న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సత్తా చాటిన బౌలర్లు: రెండో టెస్టులో ఇంగ్లాండ్ విలవిల 103/5

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 49 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 352 పరుగుల వెనుకంజలో ఉంది.

By Nageshwara Rao

విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 49 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 352 పరుగుల వెనుకంజలో ఉంది. బెన్ స్టోక్స్ 12, జానీ బెయిర్ స్టో 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకే ఆలౌటైంది.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ భారత్ బౌలర్లు ధాటికి కుప్పకూలింది. ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్(2), హషిబ్ హమిద్(13), జో రూట్(53), డకెట్(5), మొయిన్ అలీ(1)లను పెవిలియన్‌కు పంపడంతో రెండో టెస్టులో భారత్ పైచేయి సాధించినట్లైంది.

భారత బౌలర్లు అశ్విన్ రెండు వికెట్లు, మొహ్మద్ షమీ, జయంత్ యాదవ్‌లు తలో వికెట్ తీసుకోగా, మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. 317/4 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ విరాట్ కోహ్లి(167), సాహా(3), జడేజా(0) పరుగులకే ఔటైన అశ్విన్ (58), జయంత్ యాదవ్(35) ఆకట్టుకున్నారు.

విశాఖలో భారత్-టీమిండియా టెస్టు మ్యాచ్ ఫోటోలు

80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
ఇంగ్లండ్‌తో జరుగుతున్నరెండో టెస్టులో భారత్ వరుసగా వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. 36 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 1, జానీ బెయిర్ స్టో 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ధోనిని తలపించిన కీపర్ సాహా
రెండో టెస్టులో భారత్ ఆటాగళ్లు అద్భుతమైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. కీపర్ సాహా సూపర్ రనౌట్ చేశాడు. రవీంద్ర జడేజా వేసిన 21వ ఓవర్‌ ఆరో బంతిని జో రూట్‌ స్క్వేర్‌లెగ్‌ వైపు తరలించి సింగిల్‌ తీశాడు. మరో సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించగా జయంత్‌ యాదవ్‌ మెరుపు ఫీల్డింగ్‌ చేసి బంతిని వికెట్‌ కీపర్‌ సాహా వైపు విసిరాడు. అప్పటికే సగం దూరం పరుగు తీసిన హమీద్‌ (13) క్రీజులోకే చేరుకునే లోపే సాహా వెనక్కి చూడకుండానే ధోనీ తరహాలో రనౌట్ చేశాడు.

రెండో టెస్టులో పట్టు బిగిస్తోన్న భారత్
కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ను వ్యక్తిగత స్కోరు 2 పరుగులకే షమీ క్లీన్‌బౌల్డ్‌ చేయగా హసీబ్‌ హమీద్‌ (13)ను జయంత్‌ యాదవ్‌ సాయంతో సాహా రనౌట్‌ చేయడంతో ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌ డకెట్‌ (5)ను అశ్విన్ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో 29 ఓవర్లకు గాను 3 వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్‌ 74 పరుగులు చేసింది. జోరూట్‌ (48), మొయిన్‌ అలీ (1) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

455 పరుగులకు టీమిండియా ఆటౌల్ అయిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌(2)ను భారత పేసర్‌ మహ్మద్‌ షమీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ ఒక వికెట్‌ను కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌(2), హమీద్‌(4) ఉన్నారు.

455 పరుగులకు టీమిండియా ఆలౌట్

విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకే ఆలౌటైంది. 317/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్ అర్ధ సెంచరీతో రాణించాడు. విశాఖ టెస్టుతో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్ 35 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యాదవ్ 13 పరుగులు చేయగా, షమీ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్, అలీ మూడు వికెట్లు తీసుకున్నారు. రషీద్ 2, బ్రాడ్, స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.

అర్ధ సెంచరీతో ఆదుకున్న అశ్విన్

విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ అర్ధ సెంచరీ సాధించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, జయంత్ యాదవ్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు కెరీర్‌లో 8వ అర్ధ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 123 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. అశ్విన్ 54, జయంత్ యాదవ్ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

317/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్ ఆదిలోనే తడబడింది. వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది. దీంతో లంచ్ విరామ సమయానికి 119 ఓవర్లకు గాను భారత్ 7 వికెట్లను కోల్పోయి 415 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ 47, జయంత్ యాదవ్ 26 పరుగులతో ఉన్నారు.

తడబడిన టీమిండియా

తడబడిన టీమిండియా

రెండో రోజు తొలి సెషన్ ఆదిలోనే తడబడిన టీమిండియా వరుసగా కోహ్లి (167), వృద్థిమాన్ సాహా (3), రవీంద్ర జడేజా (0) వికెట్లను కోల్పోయింది. 101 ఓవర్ మూడో బంతికి కోహ్లీని ఔట్ చేసిన అలీ, ఆపై 105 ఓవర్లో రెండు, నాలుగు బంతుల్లో సాహా, జడేజాలను పెవీలియన్‌కు పంపాడు. దీంతో 12 పరుగుల తేడాలో టీమిండియా మూడు వికెట్లను కోల్పోయింది.

ఏడో వికెట్ కోల్పోయిన భారత్

ఏడో వికెట్ కోల్పోయిన భారత్

రెండో టెస్టులో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ భారత బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెడుతున్నాడు. అతని స్పిన్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు ఒకరి వెంట మరొకరు పెవిలియన్ చేరుతున్నారు. మూడు పరుగులు చేసిన వికెట్ కీపర్ సాహా, అలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్లూగా వెనుదిరగాడు.

విశాఖ టెస్టులో జడేజా డకౌట్‌

విశాఖ టెస్టులో జడేజా డకౌట్‌

అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా కేవలం రెండో బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 110 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 376 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్విన్ (26), జయంత్ యాదవ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

167 పరుగుల వద్ద కోహ్లీ ఔట్

167 పరుగుల వద్ద కోహ్లీ ఔట్

రెండో టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 167 పరుగులు చేసిన కెప్టెన్ కోహ్లీ అలీ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో ప్రస్తుతం భారత్ 104 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. అశ్విన్ 23, సాహా 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

రెండో రోజు ఆట ప్రారంభం

రెండో రోజు ఆట ప్రారంభం

తొలి రోజు ఇంగ్లండ్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం సాధించిన భారత్‌ జట్టు రెండో రోజు తన ఆటను ప్రారంభించింది. 317/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ప్రస్తుతం క్రీజులో కెప్టెన్‌ కోహ్లీ(157)కి జోడీగా రవిచంద్రన్‌ అశ్విన్‌(10) ఉన్నాడు. 94 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X