న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో వన్డేలో పైచేయి ఎందుకు సాధించామంటే?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్డేడియం ఇంగ్లాండ్ పిచ్‌ల మాదిరిగానే ఉందని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన మూడో వన్డేలో భారత్‌పై ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో

By Nageshwara Rao

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్డేడియం ఇంగ్లాండ్ పిచ్‌ల మాదిరిగానే ఉందని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన మూడో వన్డేలో భారత్‌పై ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన దశలో కేదార్ జాదవ్ తొలి రెండు బంతులకు ఓ ఫోర్, సిక్సర్ కొట్టి ఆశలు రేకెత్తించాడు. కానీ రెండు డాట్ బాల్స్ తర్వాత ఐదో బంతిని జాదవ్ గాల్లోకి లేపగా.. బౌండరీ వద్ద నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో భారత్ విజయం ముగింట బోల్తా పడింది.

 India Vs England, 3rd ODI: Good win in tough conditions, feels Chris Woakes

దీంతో మూడో వన్డేలో ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం మోర్గాన్ మాట్లాడుతూ ఈడెన్ పిచ్ తమ పిచ్‌ల మదిరిగా ఉండటం వల్లనే తాము మూడో వన్డేలో పైచేయి సాధించామన్నాడు.

ఇక్కడ పిచ్‌లు భారత ఆటగాళ్లకు బాగా అలవాటని అందుకే భారత బ్యాట్స్‌మన్ బాగా రాణించగలిగారని చెప్పుకొచ్చాడు. అయితే తమ దేశంలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఇలాంటి పిచ్‌పై మ్యాచ్ జరగడం అందులో తాము గెలవడంతో మంచి ప్రాక్టీస్‌గా భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు.

మరోవైపు చివరి ఓవర్లో భారత్ గెలవడానికి 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్థితిలో మొదటి రెండు బంతుల్లో తాము అనుకున్న విధంగా చేయలేకపోయామని, కానీ తర్వాత రెండు బంతులు పక్కాగా వేయడంతో విజయం తమను వరించిందని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X