న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొహాలి టెస్టు, డే3: పట్టు బిగిస్తోన్న భారత్

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యాన్ని సాధించింది.

By Nageshwara Rao

మొహాలి: ఇంగ్లాండ్‌తో మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తడబడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు 78 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 56 పరుగుల వెనుకంజలో ఉంది.

ప్రస్తుతం జో రూట్ 36, బాటీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 271/6ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా 417 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అలెస్టర్ కుక్(12), మొయిన్ అలీ(5) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

ఇంగ్లాండుపై భారత్ మూడో టెస్టును కూడా గెలుచుకుంటుందా?

ఆ తర్వాత జో రూట్ తో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 3ె1 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో బెయిర్ స్టోని 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయంత్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. దాంతో 70 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాత చివరి సెషన్‌ ఆఖరి ఓవర్‌లో బెన్ స్టోక్స్ 5 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసుకోగా, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.


మూడో రోజు ఆట సాగిందిలా:

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద అలీ (5) అశ్విన్ బౌలింగ్‌లో జయంత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 2 వికెట్లను కోల్పోయి 40 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది.

Cook

కుక్‌ క్లీన్‌బౌల్డ్‌
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అలెస్టర్ కుక్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 49 బంతులను ఎదుర్కొన్న అలెస్టర్ కుక్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. అంతకు ముందే అశ్విన్‌ బౌలింగ్‌లో కుక్‌ ఎల్బీ ఔట్‌ ప్రమాదం నుంచి తప్పించుకొన్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది.

భారత్ 417 ఆలౌట్

మూడో టెస్టులో టీమిండియా 417 పరుగుల వద్ద ఆలౌంటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌‌పై 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (90) పరుగులతో సెంచరీని నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో జడేజా అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా మొహాలి టెస్టులో నమోదు చేశాడు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68 కాగా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 5 వికెట్లు తీసుకోగా, రషీద్ 4 వికెట్లు తీసుకున్నారు.

100 పరుగులను దాటిన టీమిండియా ఆధిక్యం
మూడో టెస్టులో టీమిండియా ఆధిక్యం 100 పరుగులను దాటింది. 271/6ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా 130 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 395 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (90) తృటిలో తన సెంచరీని చేజార్చుకున్నాడు.

ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు
మొహాలి టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. ఆల్ రౌండర్ జడేజా సెంచరీకి చేరువలో ఉన్నాడు. 122వ ఓవర్లో మొదటి మూడు బంతులను జడేజా ఫోర్లుగా బాదాడు. అంతేకాదు ఆరో బంతిని కూడా ఫోర్ కొట్టడంతో ఒక్క ఓవర్లోనే 16 పరుగులు సాధించాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన అశ్విన్‌(72)ను జడేజా(89) అధిగమించాడు. దీంతో 122 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 7 వికెట్లను కోల్పోయి 379 పరుగులు చేసింది.

లంచ్ విరామానికి టీమిండియా 354/7
మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 271/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ఇంగ్లాండ్‌పై 71 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 114 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లను కోల్పోయి 354 పరుగులు చేసింది. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. వీరిద్దరి జోడీ లంచ్‌ విరామానికి 53పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 71పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది ప్రస్తుతం క్రీజులో జడేజా 70, జయంత్‌ యాదవ్‌ 26 పరుగులతో ఉన్నారు.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యాన్ని సాధించింది. 271/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా 106 ఓవర్ల ముగిసే సమయానికి 7 వికెట్లను కోల్పోయి 338 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జడేజా 59, జయంత్ యాదవ్ 22 పరుగులతో ఉన్నారు.

India vs England, 3rd Test, Mohali Day 3 live cricket score: Jadeja slams 50

రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 271/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించింది. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో జడేజా ఫోర్‌ కొట్టడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో ఆధిక్యం సాధించింది.

72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ అవుట్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ అవుటయ్యాడు. జట్టు స్కోరు 301 పరుగుల వద్ద అశ్విన్ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. స్టోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 98 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఏడు వికెట్లను కోల్పోయి 313 పరుగులు చేసింది. ఆదివారం అశ్విన్, జడేజాలు కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌‌లో 283 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X