న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై టెస్టు, డే2: ఇంగ్లాండ్ 400 ఆలౌట్, భారత్ 146/1

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజైన శనివారం ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసే సరికి భారత్ 52 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 146 పరుగలు చేసింది. మురళీ విజయ్ 70, ఛటేశ్వర పుజారా 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మెయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది. ఇంగ్లాండ్‌ స్కోరును సమం చేయాలంటే కోహ్లీసేన మరో 254 పరుగులు చేయాలి.


రెండో రోజు ఆటతీరు సాగిందిలా:

ఫోర్‌తో మురళీ విజయ్ అర్ధసెంచరీ

నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అర్ధసెంచరీ సాధించాడు. 128 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో అర్ధసెంచరీ (53 పరుగులు) పూర్తి చేశాడు. ఇది విజయ్ కెరీర్ లో 15వ అర్ధ సెంచరీ. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్‌ను 400 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.

Murali Vijay

కాగా, రాహుల్(24) తొలి వికెట్‌గా ఓటయ్యాడు. ఆ తరువాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఈ క్రమంలోనే విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా 41 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 57, పుజార్ 32 పరుగులతో ఉన్నారు.

టీ విరామానికి భారత్ 62/1

ముంబై వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు టీ విరామానికి 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 31, పుజారా 7 పరుగులతో ఉన్నారు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుట్
నాలుగో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (24) మొయిన్ అలీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దాంతో 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విజయ్‌ 17 పరుగులతో, పుజారా 0 పరుగులతో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్: ఇంగ్లాండ్ 400 ఆలౌట్
ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 400 పరుగులకు ఆలౌటైంది. 288/5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 112 పరుగులను జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.

ఓవర్ నైట్ ఆటగాడు బెన్ స్టోక్స్‌ను 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరడంతో శనివారం ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. జోస్ బట్లర్ 76 పరుగుల వద్ద చివరి వికెట్‌గా ఔటయ్యాడు. రెండోరోజు నిలకడగా ఆడుతూ జట్టులోని ప్రతి ఆటగాడితో భాగస్వామ్యం నెలకొల్పుతూ స్కోరు బోర్డుని నడిపించాడు.

India vs England, 4th Test:

జాక్ బాల్(31)తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే బట్లర్ అర్ధ సెంచరీ సాధించాడు. కాగా, జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన బట్లర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ముంబై టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా, జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు.

లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 385/8

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ జట్టు 8వికెట్లను కోల్పోయి 385 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ 64, జాక్ బాల్ 29 పరుగులతో ఉన్నారు. 288/5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జోస్ బట్లర్ నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లు తీసుకోగా, జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు.

8వ వికెట్ కోల్పోయి ఇంగ్లాండ్

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజైన శనివారం ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 334 పరుగుల వద్ద రషీద్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 116 ఓవర్లకు గాను 8 వికెట్లను నష్టపోయి 352 పరుగులు చేసింది. ప్రస్తుతం జోస్ బట్లర్ 53, జాక్ బాల్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India vs England, 4th Test:

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
జడేజా బౌలింగ్‌లో వోక్స్‌ కీపర్ పార్ధీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 110 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది.

India vs England, 4th Test: Ashwin-Jadeja rattle England's lower order

5 వికెట్లు తీసి అశ్విన్

ముంబైలోని వాంఖడె స్డేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదో వికెట్ తీశాడు. 288/5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆదిలోనే బెన్ స్టోక్ వికెట్ కోల్పోయింది. 97వ ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతిని ఎదుర్కొన్న స్టోక్స్ 31 వ్యక్తిగత పరుగుల వద్ద కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

గురువారమైన తొలి రోజు అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవార స్టోక్స్ వికెట్ తీయడంతో అశ్విన్ ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 100 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్‌ 305పరుగులు చేసింది. భారత బౌలర్లు అశ్విన్‌ 5, జడేజా ఒక వికెట్‌ తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X