న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయ్ 136, కోహ్లీ 147.. భారత్‌ 451/7: ఆధిక్యం 51

ముంబైలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజుఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభమైం కొద్ది సేపటికే టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. భారత్ 142 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజైన శనివారం ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్‌పై 51 పరుగుల ఆధిక్యం భారత్‌కు లభించింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 147, జయంత్ యాదవ్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Kohli

ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, రషీద్, రూట్ తలో రెండు వికెట్లు తీసుకోగా, బాల్‌కు ఒక వికెట్ దక్కింది. 146/1ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా శనివారం ఇంగ్లాండ్‌కు ధీటుగా బదులిచ్చింది. కెప్టెన్ కోహ్లీ, మురళీ విజయ్‌లు సెంచరీలో చెలరేగి పోయారు.

మూడో రోజు ఆట సాగిందిలా:

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై ఆధిక్యం సాధించిన భారత్

నాలుగో టెస్టులో కోహ్లీసేన సత్తా చాటుతోంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఆధిక్యం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఇంగ్లాండ్ స్కోరుని దాటింది. 132 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 136, జయంత్ యాదవ్ 8 పరుగులతో ఉన్నారు.

టెస్టుల్లో 15వ సెంచరీ చేసిన కోహ్లీ

ముంబై వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 15వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో రెండోది. 187 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. దీంతో 122 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 104, జయంత్ యాదవ్ 3 పరుగులతో ఉన్నారు. ఈ ఏడాది కోహ్లీకి ఇది నాలుగో టెస్టు సెంచరీ. నాలుగో టెస్టులో కెప్టెన్ కోహ్లీ ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ సాధించిన 1000 పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Virat Kohli

టీ విరామానికి భారత్ 348/6

నాలుగో టెస్టులో టీ విరామ సమయానికి టీమిండియా 113 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 348 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 83, రవీంద్ర జేడజా 22 పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ స్కోరును సమం చేయాలంటే భారత్ మరో 52 పరుగులు చేయాల్సి ఉంది.

Tea break

స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా లంచ్‌ విరామం తర్వాత స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్‌ విరామానికి 247/2 పరుగులతో టీమిండియా పటిష్ట స్థితిలో ఉండగా, లంచ్ విరామం తర్వాత మురళీ విజయ్‌, కరుణ్‌ నాయర్‌, పార్థివ్‌ పటేల్‌, అశ్విన్‌ వికెట్లను స్వల్ప పరుగుల తేడాతో టీమిండియా కోల్పోయింది. మొహాలి టెస్టులో రాణించి కీపర్ పార్ధీవ్ పటేల్ ముంబై టెస్టులో నిరాశపర్చాడు. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

107 ఓవర్లకు టీమిండియా 325/6
నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువగా వచ్చాడు. 107 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 72, రవీంద్ర జేడజా పది పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ స్కోరును సమం చేయాలంటే భారత్ మరో 75 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అలీ, రూట్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, రషీద్, బాల్ చెరో వికెట్ తీసుకున్నారు.

Virat kohli

కోహ్లీ అర్ధ సెంచరీ
ముంబై టెస్టులో కెప్టెన్ కోహ్లీ అర్ధ సెంచరీని సాధించాడు. 90.3 ఓవర్ల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో కోహ్లీ 50 పరుగులను పూర్తి చేశాడు. పుజార్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా పరుగులు తీస్తున్నాడు. 146/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్ 88వ ఓవర్లో రషీద్‌ బౌలింగ్‌లో 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ బాటపట్టాడు. దీంతో 92 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 50పరుగులతో, కరుణ్‌ నయర్‌ 7 పరుగులతో ఉన్నారు.

లంచ్ విరామానికి భారత్ 247/2

ముంబైలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు లంచ్ విరామానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ మురళీ విజయ్ 124, విరాట్ కోహ్లీ 44 పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అలీ, బాల్ చెరో వికెట్ తీసుకున్నారు.

India Vs England, 4th Test

ముంబైలో రికార్డు సృష్టించిన కోహ్లీ

టీమిండియా టెస్టు కెప్టెన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో కెప్టెన్ కోహ్లీ ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

దీంతో 2016లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 1000 పరుగులు సాధించినట్లైంది. గతంలో ఈ రికార్డుని టీమిండియా కెప్టెన్లుగా ఇద్దరు మాత్రమే సాధించారు. 1997లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే ఈ ఘనత అందుకున్న కెప్టెన్లుగా ఉన్నారు.

మురళీ విజయ సెంచరీ

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. 231 బంతులను ఎదుర్కొన్న మురళీ విజయ్ 8 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీని నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో రెండోది.

టెస్టు కెరీర్ లోమురళీ విజయ్‌కిది 8వ టెస్టు సెంచరీ. దీంతో 72 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లను కోల్పోయి 216 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 100, కోహ్లీ 39 పరుగులతో ఉన్నారు.

Murali Vijay

200 పరుగుల మార్క్‌ని అందుకున్న టీమిండియా
నాలుగో టెస్టులో టీమిండియా 200 పరుగులు మార్క్‌ని అందుకుంది. 66 ఓవర్లకు గాను రెండు వికెట్లు నష్టపోయిన టీమిండియా 200 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 95, విరాట్ కోహ్లీ 28 పరుగులతో ఉన్నారు. పుజారా అవుటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. విజయ్‌కు చక్కటి సహకారం అందిస్తూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ స్కోరును సమం చేయాలంటే భారత్ మరో 200 పరుగులు చేయాలి. నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు అలౌట్ అయింది.

India Vs England, 4th Test, LIVE Cricket, Day 3: Pujara departs infirst over of the day

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ముంబైలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజుఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభమైం కొద్ది సేపటికే టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 146/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి ఓవర్‌లోనే రెండో వికెట్ కోల్పోయింది.

<strong>ముంబై టెస్టు, డే2: ఇంగ్లాండ్ 400 ఆలౌట్, భారత్ 146/1</strong>ముంబై టెస్టు, డే2: ఇంగ్లాండ్ 400 ఆలౌట్, భారత్ 146/1

ఇంగ్లాండ్ బౌలర్ జాక్ బాల్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికి ఛటేశ్వర్ పుజారా పెవిలియన్‌కు చేరాడు. బాల్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతికి పుజార్ ఔటయ్యాడు. దీంతో, మూడో రోజు ఒక్క పరుగు కూడా చేయకుండానే టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్లను కోల్పోయి 146 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X