న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే3 నుంచి స్పిన్: ఆ వార్తల్లో నిజం లేదన్న వాంఖడె స్టాఫ్

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు డిసెంబర్ 8 నుంచి ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు డిసెంబర్ 8 నుంచి ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. నిజానికి వాంఖడే పిచ్‌ స్పిన్ పిచ్ అనే ముద్ర ఉంది. అయితే అది నిజం కాదని పిచ్‌ తయారీలో కీలకంగా వ్యవహరించిన ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) గ్రౌండ్‌ సిబ్బంది ఒకరు తెలిపారు.

పిచ్‌పై నాగిని డ్యాన్స్ చేయి: ధావన్ బర్త్ డేకి సెహ్వాగ్ ట్వీట్

మూడో రోజు నుంచి వాంఖడె పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని తెలిపాడు. 'వికెట్‌ సాధారణంగానే ఉంటుంది. తొలి రోజే స్పిన్‌కు అంతగా సహకరించదు. కానీ నెమ్మదిగా స్వభావం మార్చుకుని మూడో రోజు బంతి ఎక్కువగా టర్న్‌ అవుతుంది' అని తెలిపాడు.

India Vs England 4th Test: Mumbai pitch to 'turn from day 3'

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆ తర్వాత విశాఖపట్నం, మొహాలిలో జరిగిన టెస్టుల్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక 2013లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు మ్యాచ్‌ తర్వాత ఇక్కడ జరిగనున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం.

ఈ క్రమంలో వాంఖడె పిచ్‌పై కొంత బౌన్స్‌ కూడా వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్పిన్‌కు మాత్రమే అనుకూలించే విధంగా పిచ్‌ను రూపొందించలేదని తెలిపారు. పద్ధతి ప్రకారం పిచ్‌పై నీళ్లు చల్లుతున్నామని, మంచు కురుస్తున్న నేపథ్యంలో దానినీ పరిగణనలోకి తీసుకుని వికెట్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

చెన్నై టెస్టుపై 'జయ' ఎఫెక్ట్: ఐదో టెస్టు వేదిక మార్పు?

భారత జట్టుకు అనుకూలంగా పిచ్‌ను రూపొందించారంటూ వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. వరల్డ్ టీ20, రంజీ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని, వాంఖడే వికెట్‌ సమతుల్యంగా ఉంటుందని ఎంసీఏ అధికారి ఒకరు తెలిపారు. కాగా, భారత, ఇంగ్లండ్‌ జట్లు మంగళవారం నుంచి ప్రాక్టీస్‌ చేయనున్నాయి. ఉదయం పూట ఇంగ్లండ్‌, మధ్యాహ్నం టీమిండియ నెట్‌ సెషన్స్‌లో పాల్గొంటాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X