న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ: భారత్ 759/7 డిక్లేర్, ఇంగ్లాండ్ 12/0

ఇంగ్లాండ్ సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన కరణ్ నాయర్ తన కెరీర్‌లో సెంచరీ సాధించాడు. 185 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో కరణ్ నాయర్ సెంచరీ నమోదు చేశాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 5 ఓవర్ల ఆడి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. జెన్నింగ్స్ 9, కుక్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కన్నా ఇంగ్లాండ్ ఇంకా 270 పరుగులు వెనకబడి ఉంది.

ఐదో టెస్టులో నాయర్ ట్రిపుల్ సెంచరీ
చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన క్రికెటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 299 పరుగుల వద్ద ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫోర్‌తో 303 పరుగులు చేశాడు. 381 బంతులు ఎదుర్కొన్న నాయర్ 32 ఫోర్లు, 4 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 759 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

అర్ధసెంచరీ చేసి అవుటైన జడేజా
చెన్నై టెస్టులో రవీంద్ర జడేజా అర్ధసెంచరీ చేసి అవుటయ్యాడు. అర్ధసెంచరీ చేసిన తర్వాత 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డాసన్ బౌలింగ్‌లో జడేజా పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా 190 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 754 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నాయర్ 299, ఉమేశ్ యాదవ్ 0 పరుగుతో ఉన్నారు.

రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ
చెన్నై టెస్టులో రవీంద్ర జడేజా అర్ధసెంచరీ సాధించాడు. 52 బంతులను ఎదుర్కున్న జడేజా ఒక ఫోరు, రెండు సిక్సులతో అర్దసెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాల్గవ అర్ధసెంచరీ. దీంతో 187 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్ల నష్టానికి 751 పరుగులు చేసింది. ప్రస్తుతం నాయర్ 297, జడేజా 50 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా, టెస్టుల్లో టీమిండియా అత్యధిక స్కోరుని నమోదు చేసింది.

అశ్విన్‌ 67 అవుట్
ఐదో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. బ్రాడ్ బౌలింగ్‌లో బట్లర్‌‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో అశ్విన్-నాయర్‌ల 181 అత్యధిక పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 172 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్లు నష్టపోయి 620 పరుగులు చేసింది. ప్రస్తుతం నాయర్ 218, జడేజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

India Vs England, 5th Test, Day 4

కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ, భారత్ 600
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్‌ కరుణ్‌నాయర్‌ డబుల్ సెంచరీ సాధించాడు. 309 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో నాయర్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తన కెరీర్‌లోనే తొలి టెస్టు సిరీస్‌ ఆడుతున్న కరుణ్‌ అద్భుతమైన షాట్లతో డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 199 పరుగుల వద్ద ఔటై నిరాశ పర్చినా, నాయర్ మాత్రం దానిని సాధించాడు. అంతేకాదు తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా నాయర్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. గతంలో వినోద్‌ కాంబ్లి(224), దిలీప్‌ సర్దేశాయ్‌(200 నాటౌట్‌) ఈ ఘనత సాధించారు. ఇక ఆరో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 168 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి టీమిండియా 600 పరుగులు చేసింది.

ఐదో టెస్టులో అశ్విన్ అర్ధ సెంచరీ
చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అశ్విన్‌కి ఇది 10వ అర్ధసెంచరీ. 116 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 5 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 93 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. 162 ఓవర్లకు గాను భారత్ 575 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నాయర్‌ 189, రవిచంద్రన్‌ అశ్విన్‌ 53 పరుగులతో ఉన్నారు.

Aswin

చెన్నై టెస్టులో ఆధిక్యంలోకి భారత్‌
చెన్నై టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 139.3వ ఓవర్‌లో అలీ వేసిన బంతిని రవిచంద్రన్‌ అశ్విన్‌ సిక్స్‌ కొట్టడంతో భారత్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లంచ్ విరామం తర్వాత టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో 150 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్లను కోల్పోయి 525 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నాయర్‌ 154, రవిచంద్రన్‌ అశ్విన్‌ 38 పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 90 పరుగులు చేశారు. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

కరుణ్‌ నాయర్‌ 150

చెన్నై టెస్టులో సెంచరీ సాధించిన కరుణ్‌ నాయర్‌ 241 బంతుల్లో ఒక సిక్స్‌, 16 ఫోర్లతో 150 పరుగులు పూర్తి చేశాడు. రాహుల్‌ 199, నాయర్‌ 150 (బ్యాటింగ్ చేస్తున్నాడు) అద్భుతమైన బ్యాటింగ్‌‌తో భారత్‌ ఇప్పటికే ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. 148 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 524 పరుగులు చేసింది. క్రీజులో నాయర్‌ 153, అశ్విన్‌ 38 పరుగులతో ఉన్నారు.

Aswin

లంచ్ విరామానికి భారత్ 463/5
చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా లంచ్ విరామానికి 135 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 463 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నాయర్‌ 122, రవిచంద్రన్‌ అశ్విన్‌ 9 పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కంటే భారత్‌ ఇంకా 14 పరుగులు వెనుకబడి ఉంది.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చెన్నైలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ధీటుగా సమాధానమిస్తోంది. ఇంగ్లాండ్ సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన కరణ్ నాయర్ తన కెరీర్‌లో సెంచరీ సాధించాడు.

185 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో కరణ్ నాయర్ సెంచరీ నమోదు చేశాడు. నాయర్‌కు ఇది తొలి టెస్టు సెంచరీ. 391/4 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆటను కొనసాగించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. గత రెండు టెస్టుల్లో నాయర్ విఫలమైనా, మూడో టెస్టు అయిన చెన్నై టెస్టులో రాణించాడు.

 Karun Nair

మురళీ విజయ్‌తో కలిసి నాయర్ 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరింది. అంతక ముందు నాయర్ సెంచరీకి చేరువైన సమయంలో మురళీ విజయ్ ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 124వ ఓవర్లో డాసన్‌ వేసిన బంతికి విజయ్‌ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.

India Vs England, 5th Test, Day 4

124 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు బ్రాడ్‌, అలీ, స్టోక్స్‌, రసీద్‌, డాసన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X