న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనూహ్య మలుపు: చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం

చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతోంది.

By Nageshwara Rao

హైదరాబాద్: చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో 7 ఓవర్లు ఉండగానే భారత్ సంచలనం విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా విజృంభించి ఏడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, మిగతా పనిని ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్‌లు పూర్తి చేశారు.

ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0తో భారత్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో ఏడు వికెట్లు తీసుకుని భారత్ విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి జడేజా 10 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా ఆ తర్వాత జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ విజయం సాధించింది.

ఇంగ్లాండ్‌పై తొలిసారి 4-0తో భారత్ సిరిస్‌ను కైవసం చేసుకుంది. 2012 టెస్టు సిరిస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 1999 తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను భారత్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా 18 విజయం కావడం విశేషం కాగా, మరొకవైపు 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 477

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 759/7డిక్లేర్డ్‌
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 207

మ్యాచ్ ఫలితం: ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో భారత్ విజయం


ఐదో రోజు ఆట సాగిందిలా:

9వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్‌ చేసేందుకు భారత్‌ మరో వికెట్ దూరంలో నిలిచింది.

8వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
చెన్నై ఉన్నట్టుండి అనూహ్య మలుపు తిరిగింది. 200 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీంతో ఐదో టెస్టులో టీమిండియా విజయానికి 2 వికెట్లు దూరంలో నిలిచింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రషీద్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 82 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 205 పరుగులు చేసింది. ఇంగ్లాండా ఇంకా 77 పరుగుల వెనుకబడి ఉంది. ఇంకా సుమారు 14 ఓవర్లు పాటు ఆట మిగిలి ఉండటంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకోగా, ఇంగ్లండ్ మాత్రం డ్రా కోసం పోరాడుతోంది.

Kohli

చెలరేగుతున్న రవీంద్ర జడేజా: ఇంగ్లాండ్ 199/7

చెన్నై టెస్టులో ఇంగ్లాండ్‌ తడబడుతోంది. 79 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 199 పరుగులు చేసింది. లంచ్ విరామ అనంతరం ఆల్ రౌండర్ జడేజా తన దైన శైలిలో చెలరేగుతున్నాడు. ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. అలెస్టర్ కుక్ (49), జెన్నింగ్స్(54), రూట్(6), మొయిన్ అలీ(44), స్టోక్స్(23) పెవిలియన్‌కు పంపాడు.

మొయిన్ అలీని ఐదో వికెట్‌గా ఆరో వికెట్‌గా బెన్ స్టోక్స్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు బెయిర్ స్టో(1)ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు పంపాడు. ఇంకా సుమారు 16 ఓవర్లు పాటు ఆట మిగిలి ఉండటంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకోగా, ఇంగ్లండ్ మాత్రం డ్రా కోసం పోరాడుతోంది. ఇంగ్లాండా ఇంకా 83 పరుగుల వెనుకబడి ఉంది.

Dawson

5 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
ఐదో టెస్టులో 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. జడేజా వేసిన 71.2వ బంతిని ఆడేందుకు ముుందుకొచ్చిన అలీ మిడ్‌ఆన్‌లో అశ్విన్‌‌కి క్యాచ్ ఇచ్చాడు. 73.2 బంతిని స్టోక్స్‌ ముందుకొచ్చి డిఫెన్స్‌ ఆడబోయే క్రమంలో కరుణ్‌ నాయర్‌ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌ 6వ బంతికి అమిత్‌ మిశ్రా చక్కని గూగ్లీకి తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సాధించిన లియామ్‌ డాసన్‌ (0)ను డకౌట్‌ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌ను 129 పరుగుల వద్ద కోల్పోగా ఐదో వికెట్‌ను 192 వద్ద కోల్పోయింది. ఆ తర్వాత ఒక పరుగు తేడాలోనే 6వ వికెట్‌ కోల్పోగా డాసన్‌ 196 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు.

192 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 192 పరుగుల వద్ద మొయిన్ అలీ అవుటయ్యాడు. దీంతో 73 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 89 పరుగుల వెనుకబడి ఉంది. ఇక ఐదు వికెట్లు మాత్రమే మిగిలున్నాయి. ఈరోజు ఆట ముగియాలంటే ఇంగ్లాండ్ ఇంకా 22 ఓవర్లు ఆడాల్సి ఉంది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0తో దక్కించుకోవాలన్న భారత్‌ ప్రయత్నం ఫలించేలా కనిపిస్తోంది.

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ తడబడుతోంది. 68 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ప్రస్తుతం మొయిన్ అలీ 42, బెన్ స్టోక్స్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 96 పరుగుల వెనుకబడి ఉంది. లంచ్‌ విరామానికి ముందు ఒక వికెట్‌ కూడా కోల్పోని ఇంగ్లాండ్‌ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. లంచ్ త‌ర్వాత‌ స్పిన్న‌ర్ ర‌వీంద్ర జ‌డేజా చెల‌రేగాడు. వ‌రుసగా మూడు వికెట్లు తీశాడు. రెండో సెషన్‌లో 32 పరుగుల వ్యవధిలో కుక్‌(49), జెన్నింగ్స్‌(54), రూట్‌(6), బెయిర్‌స్టో(1) వికెట్లు కోల్పోయింది. దీంతో 129 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ప‌డింది. జడేజా మూడు, ఇషాంత్ ఒక వికెట్ తీసుకున్నారు.

India Vs England, 5th Test, Day 5

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఐదో టెస్టులో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 111 పరుగుల వద్ద అర్ధసెంచరీ చేసిన జెన్నింగ్స్‌ (54) ను జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 44 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 171 పరుగుల వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 1, మొయిన్ అలీ 2 పరుగులతో ఉన్నారు.

Cook

అలెస్టర్ కుక్ అవుట్: అర్ధ సెంచరీ మిస్
చెన్నై టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లాండ్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 103 పరుగుల వద్ద అలెస్టర్ కుక్ (49) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఒక పరుగుతో అర్ధసెంచరీని మిస్సయ్యాడు. కాగా, ఈ సిరిస్‌లో అలెస్టర్ కుక్ ను రవీంద్ర జడేజా ఆరుసార్లు అవుట్ చేయడం విశేషం.

లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 97/0
చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో చివరిరోజైన మంగళవారం లంచ్ విరామానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. కెప్టెన్ అలెస్టర్ కుక్ 47, జెన్నింగ్స్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 185 పరుగుల వెనుకబడి ఉంది. దీనిని బట్టి చూస్తే ఐదో టెస్టు డ్రాగా ముగిసే అవకాశం కనిపిస్తోంది.

చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతోంది. 20/0 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ 35 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది.

నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు
ఓపెనర్లు కుక్‌, జెన్నింగ్స్‌ వికెట్‌ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెస్టర్ కుక్, జెన్నింగ్స్ అర్ధ సెంచరీలకు చేరువలో ఉన్నారు. ప్రస్తుతం కుక్ 46, జెన్నింగ్స్ 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 187 పరుగుల వెనుకబడి ఉంది.

ఐదో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 5 ఓవర్ల ఆడి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. జెన్నింగ్స్ 9, కుక్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కన్నా ఇంగ్లాండ్ ఇంకా 270 పరుగులు వెనకబడి ఉంది.

India Vs England, 5th Test, Day 5: Team India eye ending 2016 campaign with a win

చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన క్రికెటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 299 పరుగుల వద్ద ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫోర్‌తో 303 పరుగులు చేశాడు.

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ: భారత్ 759/7 డిక్లేర్, ఇంగ్లాండ్ 12/0

381 బంతులు ఎదుర్కొన్న నాయర్ 32 ఫోర్లు, 4 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 759 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 477
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 759/7డిక్లేర్డ్‌

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X