న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై టెస్టు: అలీ సెంచరీ, తొలిరోజు ఇంగ్లాండ్‌దే 284/4

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 4 వికెట్లను కోల్పోయి 284 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మొయిన్ అలీ 120, బెన్ స్టోక్స్ 5 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీసుకోగా, కొత్త పెళ్లి కోడుకు ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.


తొలిరోజు ఆట సాగిందిలా:

మెయిన్ అలీ సెంచరీ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు మెయిన్ అలీ సెంచరీ సాధించాడు. 203 బంతులను ఎదుర్కొన్న అలీ 9 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో మెయిల్ అలీకి ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. దీంతో 86 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 4 వికెట్లను కోల్పోయి 275 పరుగులు చేసింది. ప్రస్తుతం మెయిన్ అలీ 111, బెన్ స్టోక్స్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Moeen Ali

బెయిర్‌స్టో 49 అవుట్
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ పడగొట్టింది. నిలకడగా ఆడుతున్న జానీ బెయిర్‌స్టో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో అర్ధ సెంచరీ నమోదు చేసిన అవకాశం కోల్పోయాడు. జడేజా వేసిన బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్‌ తరఫున ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మైకేల్‌ వాగన్స్‌ రికార్డుకు 13 పరుగుల దూరంలో నిలిచాడు. దీంతో 81 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది.

టీ విరామానికి ఇంగ్లాండ్ 182/3
లంచ్‌ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్‌ జట్టు ఆ తర్వాత దూకుడు పెంచింది. దీంతో టీ విరామానికి 60 ఓవర్లుకు గాను ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జో రూట్ 88 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెయిర్ స్టోతో కలిసి మెయిన్ అలీ నిలకడగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం బెయిర్ స్టో 21 పరుగులతో, అలీ 71 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు.

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఐదో టెస్టులో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 88 పరుగులు చేసిన రూట్ జడేజా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్ అవుట్‌ను మొదట ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో కోహ్లీ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టమవడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.

డ్రింక్స్ బ్రేక్: ఇంగ్లాండ్ 137/2
చెన్నై వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ నిలకడగా రాణిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన రూట్ వికెట్ల నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీని పూర్తి చేశాడు. అలీతో కలిసి మరో వికెట్ పడకుండా అడ్డుకుంటున్నాడు. దీంతో 46 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లను కోల్పోయి 137 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 74, మొయిన్ అలీ 42 పరుగులతో ఉన్నారు.

తడబడి నిలబడిన ఇంగ్లాండ్: రూట్ అర్దసెంచరీ
భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ తడబడి నిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. భారత బౌలర్ల ధాటికి ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పది పరుగులు చేసిన కుక్‌ను జడేజా అవుట్ చేయగా, కేవలం ఒక పరుగే చేసిన జెన్నింగ్స్‌ను ఇషాంత్ పెవిలియన్ చేర్చాడు.

Root

ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన రూట్ వికెట్ల నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీని పూర్తి చేశాడు. అలీతో కలిసి మరో వికెట్ పడకుండా అడ్డుకుంటున్నాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోరు వంద పరుగులు దాటింది. అంతేకాదు వీరి జోడి 83 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 39 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. రూట్ 58, అలీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లంచ్‌ విరామానికి ఇంగ్లాండ్‌ 68/2

చెన్నై వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్నఐదో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ లంచ్‌ విరామ సమయానికి 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. వాంఖడే టెస్టులో అరంగ్రేటం చేసిన జెన్నింగ్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఐదో టెస్టులో ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోరు ఏడు పరుగుల వద్ద జెన్నింగ్స్‌ను ఇషాంత్‌ శర్మ ఔట్‌ చేశాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జో రూట్ నిలకడగా ఆడుతూ 44 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. దీంతో లంచ్ విరామానికి రూట్‌ 44, మొయిన్ అలీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ బౌలర్లు ఇషాంత్‌ శర్మ, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ తీసుకున్నారు.

11వేల పరుగుల క్లబ్‌లో అలెస్టర్ కుక్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. చెన్నై టెస్టులో కుక్ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. చెన్నై టెస్టుకు ముందు కేవలం రెండు పరుగులు దూరంలో నిలిచిన కుక్ ఈ టెస్టులో దానిని అందుకున్నాడు.

తన కెరీర్‌లో 140వ టెస్టు ఆడుతున్న అలెస్టర్ కుక్‌ మొత్తం 252 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో 11 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న పదో బ్యాట్స్‌మెన్‌గా అలెస్టర్ కుక్ గుర్తింపు పొందాడు. ఐదో టెస్టు తొలి రోజైన శుక్రవారం ఆటలో భాగంగా ఉమేశ్ యాదవ్ వేసిన తొలి బంతికి రెండు పరుగులు సాధించడం ద్వారా కుక్‌ రికార్డును అందుకున్నాడు.

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో జడేజాకు బౌలింగ్ ఇచ్చి కోహ్లీ ఫలితం రాబట్టాడు. జడేజా బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడబోయిన కెప్టెన్ అలెస్టర్ కుక్ (10) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం 25 ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 39, మొయిన్ అలీ 6 పరుగులతో ఉన్నారు.

Cook

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ముంబైలో సెంచరీ హీరో జెన్నింగ్స్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఇషాంత్ బౌలింగ్‌లో పార్థివ్‌కు క్యాచ్ ఇచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదటి నుంచి నెమ్మదిగానే ఆడుతోంది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జెన్నింగ్స్ కీపర్ పార్దీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెస్టర్ కుక్ 6, జో రూట్ 4 పరుగులతో ఉన్నారు.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదో టెస్టుకు టీమిండియాలో రెండు కీలక మార్పులు చేశారు. గాయపడ్డ జయంత్‌ యాదవ్‌ కు విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో అమిత్‌ మిశ‍్రాను తుది జట్టులోకి తీసుకున్నారు.

India Vs England, Live, 5th Test, Day 1: England win toss, elect tobat at Chennai

పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో స్ఫిన్నర్ ఇషాంత్‌ శర్మను తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే పేసర్ బ్రాడ్‌ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గాయం కారణంగా జేమ్స్ ఆండర్సన్, వోక్స్‌ తుది జట్టుకు దూరమయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది.

దీంతో చెన్నై టెస్టులోనూ విజయం సాధించి, సిరీస్‌‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ మాత్రం ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేయడం ద్వారా లబ్దిపొందవచ్చని ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ భావిస్తున్నాడు.

కాగా, వర్షంతో తడిసిన పిచ్ పై టర్న్‌ను అనుకూలంగా మార్చుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టు ఆసక్తికరంగా జరుగుతుందని రెండు జట్లు భావిస్తున్నాయి. కాగా, ఇప్పటికే సిరీస్ టీమిండియా వశం కావడంతో రెండు జట్లపై ఎలాంటి ఒత్తిడి లేదు.

తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, స్వేచ్ఛగా ఆడుతామని ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సిరీస్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ రికార్డులు, రేటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడుతున్నాయి.

జట్ల వివరాలు:

ఇంగ్లాండ్:

భారత్:

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X