న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ మరో గ్రహం నుంచి వచ్చాడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

పూణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సంచలన విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: పూణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సంచలన విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. 2016లో మూడు ఫార్మెట్లలో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఈ ఏడాదిని కెప్టెన్‌గా విజయంతో ఆరంభించడాన్ని పలువురు మాజీలు ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

టెస్టుల్లో టీమిండియాని నెంబర్ వన్‌గా నిలబెట్టిన కోహ్లీ వన్డేల్లో కూడా ఆ దిశగా సాగుతున్నాడు. పరిమత ఓవర్ల కెప్టెన్‌గా ధోని నుంచి సారధ్య బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ టెస్టుల్లో మాదిరే పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి వన్డేలో విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు టీమిండియాకు సంచలన విజయాన్నందించిన కోహ్లీ తన కెరీర్‌లో 27వ సెంచరీని నమోదు చేశాడు.

351 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన 7 వికెట్లను నష్టపోయి 11 బంతులు మిగిలుండగానే నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. ఈ లక్ష్య చేధనలో కెప్టెన్ కోహ్లీ 105 బంతులను ఎదుర్కొని 122 పరుగులు చేయగా, మరో సెంచరీ వీరుడు కేదార్ జాదవ్ 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు.

India Vs England: Virat Kohli is from another planet, says Michael Vaughan

వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (14 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ కోహ్లీ (15 సెంచరీలు) అధిగమించాడు.

463 వన్డేలాడి సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకోగా విరాట్ కోహ్లీ కేవలం 177వ వన్డేలోనే ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు రెండో ఇన్నింగ్స్‌లో సచిన్‌ టెండూల్కర్‌తో సమానంగా విరాట్ కోహ్లీ 17 సెంచరీలు సాధించాడు. సచిన్‌ టెండూల్కర్ 232 ఇన్నింగ్స్‌లాడితే కోహ్లి 96వ ఇన్నింగ్స్‌లోనే సాధించాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ క్లాసికల్ ఇన్నింగ్స్‌కు ముగ్దుడైన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాల్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌ని వీక్షించిన వాన్... కోహ్లీ వేరే గ్రహం నుంచి వచ్చినవాడిగా అభివర్ణించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పోస్టు చేశాడు. కోహ్లీని బెస్ట్ టెస్టు ప్లేయర్, బెస్ట్ వన్డే ప్లేయర్, బెస్ట్ టీ20 ప్లేయర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X