న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2nd ODIలో చివరి వరకు ఉత్కంఠ: పోరాడి ఓడిన భారత్, కివీస్ విజయం

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన హార్ధిక్ పాండ్యా చివరిలో 36 పరుగులు చేయడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా మారింది.

అయితే చివరి ఓవర్‌లో ఔటవ్వడంతో 49.3 ఓవర్లకు గాను 236 పరుగులు చేసిన భారత్ ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ జట్టు 6 పరుగుల తేడాతో రెండో వన్డే గెలిచింది. ఐదు వన్డేల సిరిస్‌ 1-1తో సమం అయ్యింది.

భారత్ Vs న్యూజిలాండ్ రెండో వన్డే స్కోరు కార్డు


6 బంతుల్లో 10 పరుగులు

243 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోవడానికి టీమిండియా 6 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఉమేష్ యాదవ్ 15, బుమ్రా 0 పరుగులతో ఉన్నారు.

12 బంతుల్లో 16 పరుగులు
రెండో వన్డేలో భారత్ గెలవడానికి 12 బంతుల్లో ఇంకా 16 పరుగులు చేయాల్సి ఉంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను భారత బౌలర్లు అక్షర పటేల్ ఉత్కంఠ మ్యాచ్‌గా మార్చేశాడు. చివరి రెండు ఓవర్లలో భారత్ 16 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో అక్సర్ పటేల్(32), ఉమేష్ యాదవ్(13) బ్యాటింగ్ చేస్తున్నారు.

India Vs New Zealand 2nd oneday toss

దుమ్ము రేపుతున్న భారత బౌలర్లు
రెండో వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు ఉమేష్ యాదవ్(7), అక్సర్ పటేల్(21) తమ శక్తిమేరకు ఆడుతున్నారు. విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా 30 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

ఓటమి దిశగా టీమిండియా
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. 243 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో జాదవ్, ధోని ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అక్షర పటేల్ (17), అమిత్ మిశ్రా (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ ఓటమి అంచులకు చేరుకుంది. కాగా. 41వ ఓవర్‌లో కెప్టెన్ విలియమ్సన్ కొత్త ప్రయోగం చేశాడు. మార్టిన్ గుప్తిల్‌ వేసిన ఈ ఓవర్‌లో మొదటి, ఐదవ బంతికి వెట్లు పడ్డాయి. దీంతో 43 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది.

ధోని ఔట్, ఉత్కంఠగా మారిన రెండో వన్డే
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫిరోజ్‌ షా కోట్లలో జరుగుతున్న రెండో వన్డే ఉత్కంఠగా కొనసాగుతోంది. కెప్టెన్ ధోనీ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. కివీస్ ఆటగాడు సౌథీ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడగా పిచ్ మధ్యలోనే కుడి చేత్తో సౌధీ క్యాచ్ అందుకున్నాడు. 65 బంతులు ఎదుర్కొన్న ధోనీ 39 పరుగులు చేశాడు. 243 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. విజయానికి టీమిండియా ఇంకా 60 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో పాండ్యా (6) అక్షర్‌ పటేల్‌ (17) ఉన్నారు.

India Vs New Zealand 2nd oneday toss

41 పరుగుల వద్ద కేదార్ జాదవ్ ఔట్
రెండో వన్డేలో 143 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ధోనితో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్న జాదవ్‌ని 41 పరుగుల వద్ద హెన్రీ పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ 34 ఓవర్లకు గాను 147 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో ధోని (29), అక్షర పటేల్ (2) పరుగులతో ఉన్నారు. ధోనీ మినహా ప్రస్తుతం బ్యాటింగ్ చేయాల్సిన వాళ్లంతా టెయిలెండర్లు కావడంతో భారత్ మ్యాచ్ గెలవడం కష్టంగా కనబడుతోంది. హర్ధిక్ పాండ్యా, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, బూమ్రా బ్యాటింగ్‌కు దిగాల్సిన వారిలో ఉన్నారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

India Vs New Zealand 2nd oneday toss

చెలరేగి ఆడుతున్న కేదార్ జాదవ్
రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఆటగాడు కేదర్ జాదవ్ చెలరేగి ఆడుతున్నాడు. 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాప్ ఆర్డర్ విఫలమైంది. దీంతో కెప్టెన్ ధోనీతో కలిసి జాదవ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దుతున్నాడు. 29 బంతులు ఎదుర్కొన్న జాదవ్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోర్ 29 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు సాధించింది. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా 116 పరుగులు చేయాల్సి ఉంది.

76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

న్యూజిలాండ్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైంది. దీంతో భారత్ 21 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ధోని (1), కేదార్ జాదవ్ (2) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

ఉత్కంఠ: రహానే ఔటా, కాదా?
రెండో వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత ఓపెనర్ అజింక్యా రహానే ఔటా, కాదా అని చాలా సేపు ఉత్కంఠ కొనసాగింది. సౌథీ బౌలింగ్‌లో 19వ ఓవర్ నాలుగో బంతిని రహానే షాట్ కొట్టగా అండర్సన్ డైవ్ చేసి అందుకున్నాడు. అయితే ఆ క్యాచ్‌ను సరిగా పట్టాడా లేదా అని ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్ కూడా చాలా సేపు సంశయంలోనే ఉన్నారు. చివరికి థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రహానే 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు.

నిరాశపర్చిన కోహ్లీ
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 పరుగులకే ఔటై అభిమానులను నిరాశ పరిచాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్ రోంచికి క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ ఔటయ్యాడు. రోహిత్ శర్మ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. సట్నర్ బౌలింగ్‌లో కీపర్ రోంచి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 18 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే 27, మనీష్ పాండే 16 పరుగులతో ఉన్నారు.

రోహిత్ శర్మ ఔట్
243 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 8వ ఓవర్లో మొదటి వికెట్ కోల్పోయింది. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ కివీస్ బౌలర్ ట్రెంట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రహానే 14, కోహ్లీ 9 పరుగులతో ఉన్నారు. 11 ఓవర్లకు గాను టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది.

India Vs New Zealand 2nd oneday toss

భారత లక్ష్యం 243
భారత్, న్యూజిలాండ్ మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయ లక్ష్యాన్ని 243 పరుగులుగా నిర్దేశించింది. న్యూజిలాండ్ ఓపెనర్ గెప్తిల్ డకౌట్ కాగా, లాంథమ్ 46, కెప్టెన్ విలియమ్సన్ 118 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మిశ్రా 3, బూమ్రా 3, యాదవ్, అక్షర పటేల్, జాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.

ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు
ఢిల్లీ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో చివర్లో సత్తా చాటారు. 5 ఓవర్లలోనే 5 వికెట్లు తీశారు. 44.4 ఓవర్లకు 204/3 వికెట్లతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ జట్టుని భారీ స్కోరు చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. ఐదు ఓవర్లలో మిశ్రా 2, బూమ్రా 2, అక్సర్ పటేల్ 1 వికెట్లు తీసుకున్నారు. దీంతో 45.5 ఓవర్ల ముగిసే సమయానికి కివీస్ 8 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 49.2 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది.

ఎనిమిది వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు బ్రేకులేశారు. ఫామ్ లో ఉన్న కెప్టెన్ విలియమ్సన్‌ను మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. 128 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 118 పరుగులు చేసిన కివీస్ కెప్టెన్ రహానేకు క్యాచ్ ఇచ్చి 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 118 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరడంతో ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ బ్యాట్స్ మెన్లు ఆండర్సన్ (21), రోంచీ (6), డెవిసిచ్‌(7), సౌథీ (0) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు. దీంతో న్యూజిలాండ్ 45.5 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.

ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 216 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో లూక్‌ రోంచి (6) బంతిని డ్రైవ్‌ చేసే ప్రయత్నంలో కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 43.3 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 6 వికెట్లను కోల్పోయి 216 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సెంచరీ
ఢిల్లీలో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 109 బంతుల్లోనే విలియమ్సన్‌ (13 ఫోర్లు, ఒక సిక్సు)తో సెంచరీ (101) పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో విలియమ్సన్‌కు ఇది 8వ సెంచరీ. టాస్ గెలిచిన ధోనీ ప్రత్యర్ధి జట్టును బ్యాటింగ్‌కు దించగా ప్రస్తుతం 36 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు ఆండర్సన్ 9 పరుగులతో ఉన్నారు.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్లలో మార్టిన్ గుప్తిల్‌ను ఉమేష్ యాదవ్ డకౌట్ చేశాడు. టామ్ లోథమ్‌ను 46 పరుగుల వద్ద జాదవ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 21 పరుగుల వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో రాస్ టేలర్ వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ విలియమ్సన్ మాత్రం అజేయంగా శతకాన్ని పూర్తి చేశాడు.

కోహ్లీ నుంచి ధోనికి టాస్ అదృష్టం
న్యూజిలాండ్ జట్టుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా టాస్ ఓడిపోలేదు. కోహ్లీ నుంచి టాస్ అదృష్టాన్ని కొనసాగిస్తోన్న ధోనీ కూడా వన్డే మ్యాచ్‌లలో వరుసగా రెండు సార్లు టాస్ నెగ్గాడు. అయితే కోహ్లీ టాస్ నెగ్గినప్పుడు మూడు సార్లు కూడా బ్యాటింగ్ ఎంచుకోగా, ధోనీ మాత్రం వరుసగా రెండు సార్లు బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ నెగ్గిన ప్రతిసారి టీమిండియా విజయం సాధించింది.

అమిత్ మిశ్రాకు మూడో వికెట్

ఢిల్లీ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వద్ద టేలర్‌ను అమిత్ మిశ్రా ఔట్ చేశాడు. దీంతో 32 ఓవర్లకు గాను న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విలియమ్సన్ (90), కోరీ ఆండరన్స్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

India Vs New Zealand 2nd oneday toss

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
ఢిల్లీ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో జట్టు స్కోరు 120 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగుల వద్ద లాంథమ్‌ని కేదార్ జాదవ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో విలియమ్సన్-లాంథమ్‌ల 120 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం కివీస్ 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.

నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్, కెప్టెన్ విలియమ్సన్‌ అర్ధ సెంచరీ

ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ నిలకడగా ఆడుతోంది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ గప్టిల్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపడంతో కివీస్ ఒత్తిడిలో పడింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ లాంథమ్ (31), కెప్టెన్ విలియమ్సన్‌ (56) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 16ఓవర్లకు గాను 90 పరుగులు చేసింది.

ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయిన కివీస్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా శుభారంభం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఓవర్లోనే గప్టిల్ (0)ను ఔట్ చేసింది. దీంతో న్యూజిలాండ్ ఖాతా తెరవకుండానే వికెట్‌ కోల్పోయింది. మొదటి ఓవర్‌లో ఉమేష్ యాదవ్ రెండో బంతికే గుప్టిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. తొలి వన్డేలో 12 పరుగులు చేసిన గప్టిల్.. రెండో వన్డేలో మరింత పేలవంగా వెనుదిరగడంతో న్యూజిలాండ్ ఆదిలోనే ఇబ్బందుల్లో పడింది.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ధోని సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. కోట్లా పిచ్ మంద‌కొడిగా ఉండ‌టంతో పేస‌ర్ల‌కు అనుకూలించే అవ‌కాశం ఉంది. టాస్ గెలిచిన ధోని రాత్రి వేళల్లో మంచు ప్రభావం ఉండటం వల్ల ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు.

ధర్మశాల వన్డేలో ఆడిన జట్టుతోనే ధోని సేన బరిలోకి దిగుతుంది. న్యూజిలాండ్ మాత్రం మూడు మార్పులతో బ్యాటింగ్‌కు దిగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్రాస్‌వెల్, నీషమ్, సోధీలపై వేటు వేసి బౌల్ట్, డెవిచ్, హెన్రీలను జట్టులోకి తీసుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తేడాతో ముందంజలో ఉంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకూ 279 వన్డేలు ఆడిన ధోని మొత్తం 8939 పరుగులు చేశాడు. వన్డేల్లో 9,000 పరుగుల క్లబ్ లో చేరేందుకు ధోనీ ఇంకా 61 పరుగుల దూరంలో ఉన్నాడు.

అదే విధంగా ఈ వన్డేలో ధోని మరో మూడు సిక్సర్లు బాదితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 195 సిక్సర్ల రికార్డుని కూడా సమం చేస్తాడు. అలా కాకుండా ఏడు సిక్సర్లు బాదితే 200 సిక్సర్లు బాదిన తొలి టీమిండియా ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

సచిన్‌ని సమం చేస్తాడా?: కోట్లాలో ధోనీని ఊరిస్తున్న మూడు రికార్డులివే

ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోనీ రికార్డులపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ముగిసిన టెస్టు సిరిస్‌లో న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా 3-0తో క్లీన్ స్విప్ చేసింది. వన్డేల్లో కూడా ధోని సేన ఇదే జోరుని కొనసాగించాలనే యోచనలో ఉంది.

జట్లు:
భారత్: ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నార్, టిమ్ సౌతీ, బ్రాస్ వెల్, ఇష్ సోథీ

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X