న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

500వ టెస్ట్: ఔట్‌‌ను నాటౌట్‌గా, మూడో రోజు 15 నిమిషాల ముందు

By Nageshwara Rao

కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 500వ టెస్ట్ మ్యాచ్‌కి రెండో రోజు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. 291/9 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ జట్టు జడేజా 42 పరుగులతో దూకుడుగా ఆడటంతో టీమిండియా 300 పరుగుల మైలు రాయిని దాటి 318 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో రోజు ఒక వికెట్‌ను కోల్పోయి 152 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. కెప్టెన్ విలియమ్సన్ 65, టామ్ లాథమ్ 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరూ 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కివిస్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్ ఒక దశలో ఔటయ్యాడు, కానీ థర్డ్ అంపైర్ దానిని నాటౌట్‌గా ప్రకటించారు.

India vs New Zealand, Highlights, Kanpur Test: Williamson, Latham Put NZ On Top On Rain-Hit Day 2

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో టామ్ లాథమ్ స్వీప్ షాట్ ఆడబోయాడు. ఈ క్రమంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్ దాన్ని అందుకున్నాడు. అయితే ఆ క్రమంలో బంతి చేతి నుంచి కొద్దిగా జారి హెల్మెట్‌ను తాకి మళ్లీ చేతుల్లోకి చేరింది. దీంతో దీన్ని ఔట్‌గా ప్రకటించాలా లేదా అనే సంకోచంతో గ్రౌండ్ అంపైర్లు థార్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.

ఈ షాట్‌ వీడియోను వీడియోను పరిశీలించిన థర్డ్ అంపైర్ దానిని నాటౌట్‌గా ప్రకటించారు. క్యాచ్ అందుకోవడంలో ఆటగాడు హెల్మెట్ సహాయం తీసుకోవడం క్రికెట్ రూల్స్‌కు విరుద్దమనేది అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడొచ్చు.

శనివారం 15 నిమిషాలు ముందుగా మొదలు కానున్న 500వ టెస్ట్ మ్యాచ్

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటను వర్షం అడ్డుకుంది. దీంతో టీ విరామ అనంతరం మ్యాచ్‌ జరగకుండానే రెండో రోజు ఆట ముగిసినట్లేనని అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడో రోజు మ్యాచ్ 15 నిమిషాలు ముందుగా మొదలు కానుంది.

అంతేకాదు మ్యాచ్‌లో 8 ఓవర్లు అదనంగా పెంచారు. రెండోరోజు 90 ఓవర్లపాటు జరగాల్సిన మ్యాచ్ 54 ఓవర్ల పాటు మాత్రమే జరిగింది. మూడో రోజు ఆట ఉదయం 9.30కి మొదలు కావాల్సి ఉండగా 9.15కే ప్రారంభించనున్నారు. 90 ఓవర్లపాటు జరగాల్సిన మ్యాచ్‌ను 98 ఓవర్లకు పెంచారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ వివరాలు:

భారత్ తొలి ఇన్నింగ్స్ : 318
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 152/1

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X