న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన పాక్: ఫైనల్లో కోహ్లీ సేనను చిత్తుగా ఓడించింది

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఏకపక్షంగా సాగిన పోరులో పాకిస్థాన్ పైచేయి సాధించింది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు 158 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

దీంతో పాకిస్థాన్‌ తొలిసారి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధావన్ (21), యువరాజ్ సింగ్ (22), హార్ధిక్ పాండ్యా (76), రవీంద్ర జడేజా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

India won the toss and elected to bowl first

పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, హసన్ అలీ చెరో మూడు వికెట్లు తీయగా షాదాబ్ ఖాన్ రెండు, జునైద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. అంతక ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 339 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

పాక్ బ్యాట్స్‌మెన్‌లలో పకార్ జామన్ సెంచరీ (114) పరుగులతో చెలరేగగా, అజర్ అలీ 59, బాబర్ ఆజం 46, షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ హఫీజ్ 57, (నాటౌట్), ఇమాద్ వాసిమ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీశారు.


అంతకముందు టీమిండియా బ్యాటింగ్ సాగిందిలా:

9వ వికెట్ కోల్పోయిన టీమిండియా

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అంచుకు చేరింది. 156 పరుగుల వద్ద రవీంద్ర జడేజా (15), అశ్విన్ (1) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసే సరికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

ఏడో వికెట్ కోల్పోయిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 152 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసిన పాండ్యా స్కోరుబోర్డుని పరిగెత్తించాడు. హసన్ అలీ వేసిన బంతిని జడేజా ఆడగా లేని పరుగు కోసం ప్రయత్నించిన పాండ్యా అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం 27.2 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

Pandya

సిక్సర్లతో హోరెత్తిస్తున్న పాండ్యా
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. షాదాబ్ బౌలింగ్‌లో 22వ ఓవర్‌లో వరుస సిక్సర్లు బాదాడు. ఒక్క ఓవర్‌లోనే 23 పరుగులు సాధించాడు. 40 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. 26వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి స్టేడియంను హోరెత్తించాడు.

ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 72 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. షాదాబ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన జాదవ్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 72 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపుపై దాదాపు ఆశలు వదులుకుంది. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ 72 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా 11, రవీంద్ర జడేజా (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

పేకమేడలా కుప్పకూలిన భారత టాపార్డర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఎదురీదుతోంది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత 13 ఓవర్ చివరి బంతికి యువరాజ్ సింగ్ (22) వికెట్ల ముందు దొరికిపోగా 14 వ ఓవర్ మూడో బంతికి ధోనీ (4) భారీ షాట్‌కు యత్నించి ఇమాద్ వాసిమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది.

38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 33 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (21) ఆమిర్ బౌలింగ్‌లో షాదాబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లు కూడా ఆమిర్ తీయడం విశేషం. ప్రస్తుతం 9.3 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.

ఆమిర్ విజృంభణ: కోహ్లీ అవుట్
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. పాక్ బౌలర్ ఆమిర్ అద్భుత బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. తొలి ఓవర్‌లో రోహిత్‌ను పెవిలియన్ పంపిన ఆమిర్ మూడో ఓవర్ నాలుగో బంతికి కోహ్లీని అవుట్ చేశాడు. కోహ్లీ అవుటైన తర్వాత యువరాజ్ క్రీజులోకి వచ్చాడు. మూడు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (1), యువరాజ్ సింగ్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Kohli

రోహిత్ శర్మ డకౌట్
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో టీమిండియా తొలి ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. రోహిత్ అవుటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ (2), ధావన్‌ (0) క్రీజులో ఉన్నారు.

Rohit sharma

భారత్ విజయ లక్ష్యం 339
అంతకముందు ది ఓవల్ వేదికగా భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ చెల‌రేగారు. భారత్ బౌలర్లు పూర్తిగా విఫలమైన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 339 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

పాక్ ఓపెనర్లు ఫ‌క‌ార్ జ‌మాన్ (114) సెంచ‌రీతో చెలరేగగా, అజ‌ర్ అలీ (59)లు చక్కటి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత మహ్మ‌ద్ హ‌ఫీజ్ (37 బాల్స్‌లో 57 నాటౌట్‌) అర్ధ సెంచ‌రీ చేయడంతో పాకిస్థాన్ భారీ స్కోరు నమోదు చేసింది. బాబర్ అజామ్ 46 పరుగుల వద్ద అవుటై తృటిలో సెంచరీని కోల్పోయాడు.

భార‌త్ త‌ర‌ఫున పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఒక్క‌డే కాస్తంత ఫరవాలేదనిపించాడు. స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా తేలిపోయారు. అశ్విన్ 10 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ తీయకుండా 70 పరుగులు ఇవ్వగా, ఆల్ రౌండర్ జ‌డేజా 8 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగులు సమర్పించుకున్నాడు.

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండ‌టంతోపాటు భార‌త బౌల‌ర్లు ఎక్స్‌ట్రాలు ఎక్కువ ఇవ్వ‌డం కూడా పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 నోబాల్స్‌, 5 వైడ్లు వేశాడు. ఇదిలా ఉంటే భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీశారు.

యువీ అద్భుతమైన క్యాచ్: నాలుగో వికెట్ కోల్పోయిన పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్లో పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 267 పరుగుల వద్ద పాక్ బాబర్ అజామ్ వికెట్‌ను కోల్పోయింది. కేదార్ జాదవ్ బౌలింగ్‌లో బాబర్ అజామ్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 42.3 ఓవర్లకు గాను పాకిస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. బాబర్ అవుటైన తర్వాత వసీం క్రీజులోకి వచ్చాడు.

Babar Azam

మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్లో పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 247 పరుగుల వద్ద పాక్ షోయబ్ మాలిక్ వికెట్‌ను కోల్పోయింది. 16 బంతుల్లో 12 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 40 ఓవర్లకు గాను పాక్ 3 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాకిస్థాన్‌ రన్‌రేట్‌ 6కు తగ్గకుండా పరుగులు చేస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లను సులభంగా ఎదుర్కొంటోంది. షోయబ్ మాలిక్ అవుటైన తర్వాత క్రీజులోకి మహమ్మద్ హఫీజ్ వచ్చాడు.

Malik

200 పరుగులకు రెండో వికెట్ కోల్పోయిన పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్లో పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 200 పరుగుల వద్ద ఓపెనర్ ఫకార్ జమాన్‌ వికెట్ కోల్పోయింది. 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 114 పరుగులు చేసిన ఫకార్ పాండ్యా బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫకార్ జమాన్ అవుటైన తర్వాత షోయబ్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు. 33.1 ఓవర్లకు గాను పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ప్రస్తుతం బాబర్ 11, మాలిక్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

Fakhar

92 బంతుల్లో సెంచరీ చేసిన ఫకార్ జమాన్
చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో పాకిస్థాన్ ఓపెన‌ర్ ఫ‌క‌ర్ జ‌మాన్ సెంచ‌రీతో చెలరేగాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి అవుటై నోబాల్ కారణంగా బతికిపోయిన పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ 92 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. వ‌న్డేల్లో అత‌నికిదే తొలి సెంచ‌రీ. 30.1 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ ఒక వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

Fakhar

తొలి వికెట్ కోల్పోయిన పాక్
చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో టీమిండియా ఎట్టకేలకు వికెట్ తీసింది. అజర్ అలీ (59) రూపంలో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. అత‌ని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. జట్టు స్కోరు 128 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్‌లో అజర్ (59) రనౌట్ అయ్యాడు. అజర్ అలీ అవుటైన తర్వాత బాబర్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 24 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది.జమాన్ 57, బాబర్ (0) క్రీజులో ఉన్నారు.

అర్ధసెంచరీలు చేసిన పాక్ ఓపెనర్లు
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్లు తమ జట్టుకు చక్కటి శుభారంభం అందించారు. ఐసీసీ టోర్నీలో భారత్‌పై 1996లో సయీద్‌ అన్వర్‌, ఆమిర్‌ సొహైల్‌ నెలకొల్పిన అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం (84 పరుగులు) రికార్డు బద్దలు కొట్టారు. ఓపెనర్ అజర్ అలీ 61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, 60 బంతులు ఎదుర్కొన్న ఫఖర్ అలీ 7 ఫోర్లతో 51 పరుగులు చేశాడు.
ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

 India won the toss and elected to bowl first

వికెట్ కోసం శ్రమిస్తోన్న భారత బౌలర్లు
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ఓపెనర్లు అజార్‌ అలీ (40), ఫకర్‌ జమాన్‌ (33) భారత బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటున్నారు. పరుగులు కట్టడి చేయడంలో, వికెట్లు తీయడంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, అశ్విన్‌లు ఇబ్బంది పడుతున్నారు.

 India won the toss and elected to bowl first

9వ ఓవర్ మెయిడెన్ వేసిన భువనేశ్వర్
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ మరోమారు అదరగొట్టాడు. జోరు పెంచిన పాక్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశాడు. తొమ్మిదో ఓవర్ వేసిన భవనేశ్వర్ పరుగులేమీ ఇవ్వకుండా మెయిడెన్ చేశాడు. ఐదు ఓవర్లు వేసిన భువనేశ్వర్ రెండు మెయిడెన్లు వేశాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. అజర్ అలీ 29, ఫకార్ జమన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతోన్న పాక్ ఓపెనర్లు
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. నాలుగో ఓవ‌ర్ తొలి బంతికే పేసర్ బుమ్రా పాక్ ఓపెన‌ర్ ఫ‌క‌ార్ జ‌మాన్‌ను అవుట్ చేసి మురిపించాడు. అయితే అది కాస్తా నోబాల్ కావడంతో భారత అభిమానులు ఉసూరుమ‌న్నారు. ఈ టోర్నీలో రాణిస్తున్న ఫకార్ వికెట్ అందినట్టే అంది చేజారడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఓపెన‌ర్లు బౌండ‌రీల వ‌ర్షం కురిపిస్తూ.. స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నారు. 7 ఓవర్లకు ముగిసే సరికి పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫకార్ 13, అజహర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ అవుట్: నో బాల్‌గా ప్రకటించిన అంఫైర్
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. బుమ్రా బౌలింగ్‌లో పాక్ ఓపెనర్ ఫకార్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంపైర్ కూడా అవుట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగారు. అయితే అంతలోనే అది నాటౌట్ అంటూ అంపైర్ మరోమారు ప్రకటించాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్ తొలి బంతి నోబాల్ కావడంతో అంఫైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఫకార్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది.

ఫస్ట్ ఓవర్ మెయిడిన్
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ మెయిడిన్‌గా నమోదైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్థాన్‌... భువీ వేసిన తొలి ఓవర్‌లో పరుగులేమీ సాధించ లేకపోయింది. దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి పాక్ వికెట్ నష్టపోకుండా సున్న పరుగులు చేసింది.

టాస్ గెలిచిన కోహ్లీ, పాకిస్థాన్ బ్యాటింగ్

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

టాస్ గెలిచిన సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎవరన్నది కాకుండా.. తమ జట్టు సభ్యులంతా పూర్తి శక్తియుక్తులతో ఆడతారని అన్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. టోర్నీలో భాగంగా రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడిన జట్టే ఫైనల్లో ఆడుతుంది.

India vs Pakistan Final, ICC Champions Trophy 2017: India won the toss and elected to bowl first

ఇక రాయిస్ స్థానంలో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు బలంగా కోరుకుంటోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌ 13-2తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది.

ఇక టీమిండియా మాత్రం ఇది నాలుగో ఫైనల్‌. ఈసారి గెలిస్తే ఇది మూడో టోర్నీ అవుతుంది. 2002, 2013లో టీమిండియా విజేతగా నిలిచింది. పిచ్, వాతావరణం ఈ మ్యాచ్ కోసం ఉపయోగిస్తున్న కొత్త పిచ్ పొడిగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలం. 300లకు పైగా స్కోరు నమోదు కావొచ్చు.

మరోవైపు వాతావరణం కాస్త మేఘావృతంగా ఉంది. కానీ ఎక్కువశాతం పొడిగానే ఉండే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఉంది. ఈ మ్యాచ్‌పై దేశ వ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ వేస్తున్నారు. ఒక్క లండన్లోనే రూ. 2000 వేల కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరిపారు.

టోర్నీలో భాగంగా లీగ్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

జట్ల వివరాలు:
టీమిండియా:
కోహ్లీ (కెప్టెన్), ధావన్, రోహిత్, యువరాజ్, ధోనీ, కేదార్, హార్దిక్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా.
పాకిస్థాన్: సర్ఫరాజ్ (కెప్టెన్), అజర్ అలీ, జమాన్, ఆజమ్, హఫీజ్, షోయబ్, వసీమ్, ఆమిర్, షాదాబ్, హసన్ అలీ, జునైద్.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X