న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వన్డే: సెంచరీతో ధావన్ చరిత్ర, చిత్తుగా ఓడిన శ్రీలంక

టెస్టు సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్ చేసిన కోహ్లీసేన ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం దంబుల్లాలో ప్రారంభమైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కోహ్లీసేన 28.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రీలంకపై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ (132 నాటౌట్‌) చెలరేగగా, కెప్టెన్ కోహ్లీ (82 నాటౌట్) పరుగులతో టీమిండియాకు ఘన విజయాన్నందించారు. 71 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో ధావన్ సెంచరీ పూర్తి చేయడంతో శ్రీలంకలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా ధావన్ చరిత్ర సృష్టించాడు.

తొలుత ఓపెనర్ రోహిత్ శర్మ 4 పరుగుల వద్ద రనౌటయ్యాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది.


చరిత్ర సృష్టించాడు: శిఖర్ ధావన్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. 71 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో ధావన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంకలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా ధావన్ చరిత్ర సృష్టించాడు. 88 పరుగుల వద్ద ధవన్‌ మూడు బౌండరీలు బాది తనదైన శైలిలో సెంచరీ సాధించాడు. ఇక, కోహ్లీ కూడా 50 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 163 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 54 పరుగులు కావాల్సి ఉంది.

Dhawan

36 బంతుల్లో ధావన్ అర్ధ సెంచరీ
217 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీతో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ 36 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ధావన్ 52, కోహ్లీ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రోహిత్ శర్మ రనౌట్
217 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మలింగ వేసిన ఐదో ఓవర్‌ చివరి బంతికి రోహిత్ శర్మ (4) రనౌట్ అయ్యాడు. బంతిని ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ సింగిల్‌ తీసేందుకు నాన్‌స్ట్రైకర్‌ వైపు వెళ్లాడు. పరుగు తీసే క్రమంలో క్రీజు ముందు బ్యాట్‌ వదిలేశాడు. క్రీజుదాటినా కాలు గాల్లో ఉండగానే కపుగెదెర విసిరిన బంతి అనూహ్యంగా వికెట్లను తగిలింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 22, కెప్టెన్ కోహ్లీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.


భారత్ విజయ లక్ష్యం 217

అంతకముందు తొలి వన్డేలో శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియా విజయ లక్ష్యం 217 పరుగులుగా నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 74 పరుగుల వరకు వికెట్ పోకుండా జాగ్రత్త పడింది.

ఆ తర్వాత వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది. 166 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక ఆ తర్వాత ఏ దశలోనూ కోలులేకపోయింది. డిక్‌వెల్లా(65), గుణతిలక(35), మెండిస్(36), ఉపుల్ తరంగా(13), కపుగదెరా(1), హసరంగా(2), మాథ్యూస్ 36 పరుగులు చేశారు.

India win toss, opt to field first against Sri Lanka

ఇక భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్ 3, యుజ్వేందర్ చాహల్, కేదార్ జాదవ్, బుమ్రాలు తలో రెండు వికెట్లు తీశారు.


శ్రీలంక తొలి ఇన్నింగ్స్ సాగిందిలా:

40 ఓవర్లకు శ్రీలంక 196/8
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్పిన్నర్లు సత్తా చాటారు. 10 పరుగుల తేడాతో 3 కీలక వికెట్లను తీసి శ్రీలంక మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. వరుసగా వెంటనే శ్రీలంక వికెట్లను తీసి తక్కువ స్కోరుకే కట్టడి చేసేలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంక 40 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం మాథ్యూస్ 25, మలింగా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో తిశారా పెరీరా డకౌట్ అయ్యాడు. 176 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన లంక దానికి మరో రెండు పరుగులు జోడించిన తర్వాత పెరీరా రూపంలో ఏడో వికెట్ కోల్పోంది. 36 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

10 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక

అంతకముందు అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో హసరంగ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 35 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 6 వికెట్ల కోల్పోయి 177 పరుగులు చేసింది. భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతోంది. 166 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక మరో మూడు పరుగులు జోడించిన తర్వాత కపుగెదెర రనౌటయ్యాడు.

74/1తో పటిష్టంగా కనిపించిన లంక జట్టు 169 పరుగులకు వచ్చే సరికి ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కేదార్ జాదవ్, అక్షర్‌ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా చాహల్‌కు ఒక వికెట్ తీసుకున్నాడు.

India win toss, opt to field first against Sri Lanka

నాలుగో వికెట్ కోల్పోయిన లంక

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 166 పరుగుల వద్ద కేదార్ జాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ ఉపుల్ తరంగ (13) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మాథ్యూస్ (10), కపుగెదెర (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద మెండిస్ రూపంలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోతున్నట్టు కనిపించిన కుశాల్ మెండిస్‌ను 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మెండిస్ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. 28 ఓవర్లు ముగిసే సరికి లంక మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ ఉపుల్ తరంగ (6), మాథ్యూస్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ తర్వాత డిక్‌వెల్లా(64) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేదార్ జాదవ్ అవుట్ చేశాడు. 74 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన డిక్‌వెల్లా జాదవ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం 27 ఓవర్లు ముగిసే సరికి లంక రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్‌ 36, కెప్టెన్ ఉపుల్ తరంగ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

డిక్‌వెల్లా అర్ధ సెంచరీ: 22 ఓవర్లకు శ్రీలంక 122/1
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ డిక్‌వెల్లా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 65 బంతులు ఎదుర్కొన్న డిక్‌వెల్లా 5 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డిక్‌వెల్లా నిలకడగా ఆడుతున్నాడు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తున్నాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి లంక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 28, డిక్‌వెల్లా 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
దంబుల్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గుణతిలక 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. డిక్‌వెల్లాతో కలిసి తొలి వికెట్‌కు గుణతిలక 74 పరుగులు జొడించాడు. 15 ఓవర్లకు గాను శ్రీలంక 75 పరుగులు చేసింది. ప్రస్తుతం డిక్‌వెల్లా 32, మెండిస్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10 ఓవర్లకు శ్రీలంక 55/0

దంబుల్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. గుణతిలక 29, డిక్‌వెల్లా 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న లంక ఓపెనర్లు చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు.

నిలకడగా ఆడుతున్న శ్రీలంక: 7 ఓవర్లకు 32/0
దంబుల్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. 7 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దనుష్క గుణతిలక 16, నిరోషన్ డిక్‌వెల్లా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ

టెస్టు సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్ చేసిన కోహ్లీసేన ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం దంబుల్లాలో ప్రారంభమైంది. తొలి వన్డేలో టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది.

ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ ద్వారా 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టును తయారు చేసుకునే పనిని బీసీసీఐ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బలహీనంగా కనిపిస్తున్న శ్రీలంకపై యువ ఆటగాళ్లను పరీక్షించనుంది.

India vs Sri Lanka, 1st ODI: India win toss, opt to field first against Sri Lanka

మరోవైపు టెస్టు సిరీస్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. దీనికి అనుగుణంగానే జట్టును తయారుచేశారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో శ్రీలంక ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో రెండు వన్డేలు గెలిస్తే ఆ స్థానాన్ని పదిలం చేసుకుని, వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.

జట్ల వివరాలు:

టీమిండియా: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, చాహల్

శ్రీలంక: ఉపుల్ తరంగ(కెప్టెన్), డిక్ వెల్లా, గుణతిలకా, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, చమరా కపుగెదెరా, వానిందు హసరంగా, తిషారా పెరీరా, లక్షన్ సండాకన్, విశ్వ ఫెర్నెండో, లసిత్ మలింగా

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X