న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టులో పట్టు బిగించిన కోహ్లీసేన, డే2: భారత్ 600 ఆలౌట్, లంక 154/5

By Nageshwara Rao

హైదరాబాద్: గాలే వేదికగా భారత్‌‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 154 పరుగులు చేసింది. ప్రస్తుతం మాథ్యూస్ 54, పెరారా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఇంకా 446 పరుగులు వెనుక‌బ‌డే ఉంది.

అంతకముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. క‌రుణ‌ర‌త్నె (2), గుణ‌తిల‌క (16), మెండిస్ (0), డిక్‌వెల్లా (8) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో ష‌మి 2, ఉమేష్, అశ్విన్ చెరొ వికెట్ తీయ‌గా త‌రంగ ర‌నౌట‌య్యాడు.


రెండో రోజు ఆట సాగిందిలా:

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన షమీ
గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 15 ఓవర్లు ముగిసే సమయానికి 68/3తో ఒత్తిడిలో పడింది.

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే గుణరత్నె (2) వికెట్‌ తీసి ఉమేశ్ యాదవ్ లంకకు షాకివ్వగా.. అనంతరం ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి షమీ ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన షమీ.. రెండో బంతికి గుణతిలక (16)ని ఔట్ చేసి.. అనంతరం ఆ ఓవర్‌లోని చివరి బంతికి కుశాల్ మెండిస్‌‌ని డకౌట్‌గా పెవిలియన్‌కి పంపాడు.

Shami

ఇక ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ హాఫ్ సెంచరీతో రాణిస్తున్నాడు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సమయానికి లంక 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూస్‌(20), తరంగ(56)ఉన్నారు. భారత బౌలర్లు షమి 2, ఉమేశ్‌ ఒక వికెట్‌ను తీశారు.

టీ విరామానికి శ్రీలంక 38/1
గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీ విరామానికి శ్రీలంక వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ప్రస్తుతం గుణతిలక 12, తరంగ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్ కరుణరత్నే (2)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు. తన తొలి ఓవర్ ఐదో బంతికి కరుణరత్నేను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ప్రస్తుతం గుణతిలక (5), ఉపుల్ తరంగ (7) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుత స్కోరు ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులకు ఆలౌటైంది.

భారత్ 600 ఆలౌట్

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంకలో అత్యధిక స్కోరు నమోదు చేసిన విదేశీ జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 399/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజైన గురువారం ఆటను ప్రారంభించిన భారత్ 201 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లను కోల్పోయింది.

భారత జట్టు ఆటగాళ్లలో శిఖర్ ధావన్ 190, అభినవ్ ముకుంద్ 12, ఛటేశ్వర్ పుజారా 153, విరాట్ కోహ్లీ 3, రహానే 57, అశ్విన్ 47, సాహా 16, పాండ్యా 50, జడేజా 15, షమీ 30 పరుగులు చేయగా, ఉమేష్ యాదవ్ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివ‌ర్లో తొలి టెస్ట్ ఆడుతున్న పాండ్యా (49 బంతుల్లో 50), బౌల‌ర్ ష‌మి (30) చెల‌రేగి ఆడ‌టంతో భారత్ భారీ స్కోరు చేసింది.

అశ్విన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా తనదైన శైలిలో ఆడుతూ లంక బౌలర్లపై విరుచుకు పడి 49 బంతుల్లో 3 సిక్సులు, 5 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా, షమీలు లంక బౌల‌ర్ల‌పై మ‌రింత విరుచుకుప‌డ్డారు. ఓవ‌ర్‌కు ఆరుకుపైగా ప‌రుగులు సాధిస్తూ టీ20ని త‌ల‌పించారు.

శ్రీలంక బౌలర్లలో ప్రదీప్‌కు 6, లాహిరు కుమారాకు 3, హెరాత్‌కు ఒక వికెట్ దక్కాయి. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది.

లంచ్ విరామానికి టీమిండియా 503/7

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు లంచ్ విరామానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా 4, రవీంద్ర జేడేజా 8 పరుగులతో ఉన్నారు. 399/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

పుజారా 153 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన తర్వాత రహానే వికెట్ కూడా కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సాహా-అశ్విన్‌ల జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. అయితే 16 పరుగులు చేసిన సాహా... హెరాత్ పెవిలియన్‌కు చేరాడు. మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే అశ్విన్ కూడా అవుటయ్యాడు.

1st Test, Day 2

అశ్విన్ 60 బంతుల్లో ఏడు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 117 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్ 5 వికెట్లు తీసుకోగా, లాహిరు, హెరాత్ చెరో వికెట్ తీసుకున్నారు.

భారీ స్కోరు దిశగా టీమిండియా

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీసేన భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 399/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత్‌ గురువారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది.

103వ ఓవర్లో లాహిరు కుమార వేసిన తొలి బంతికి రహానె 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌‌కు చేరాడు. అంతకుముందు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 144 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారా 97.4వ ఓవర్లో హెరాత్‌ బౌలింగ్‌లో పుజారా 153 పరుగుల వద్ద అవుటయ్యాడు.

India vs Sri Lanka Live Score, 1st Test, Day 2: Cheteshwar Pujara falls at 153, hosts eye comeback

పుజారా, రహానెల జోడీ నాలుగో వికెట్‌కి 137 పరుగులు నమోదు చేశారు. ప్రస్తుతం 106 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 456 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్‌ అశ్విన్‌ 24, సాహా 5 పరుగులతో ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత్‌ 3 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసిన సంగతి తెలిసిందే

అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పుజారా

అంతకముందు 93వ ఓవర్లో హెరాత్‌ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో తృటిలో పుజారా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హెరాత్‌ వేసిన తొలి బంతి బ్యాట్‌కు అత్యంత సమీపం నుంచి వికెట్‌ కీపర్‌ చేతిలోకి వెళ్లడంతో శ్రీలంక రివ్యూకి వెళ్లింది. అయితే రివ్యూలో పుజారా నాటౌట్‌గా తేలింది.

India vs Sri Lanka Live Score, 1st Test, Day 2: Cheteshwar Pujara falls at 153, hosts eye comeback

అనంతరం 96వ ఓవర్లో ప్రదీప్‌ వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన పుజారా 152 పరుగులు సాధించాడు. ఈ సందర్భంగా మైదానం వెలుపల ఉన్న కోహ్లీ, అశ్విన్‌, పాండ్య తదితరులు పుజారాను అభినందించారు. రహానె కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 97 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X