న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్ట్‌లో పట్టు బిగించిన కోహ్లీ: 566/8 పరుగుల వద్ద డిక్లేర్

By Nageshwara Rao

ఆంటిగ్వా: వెస్టిండీస్‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 283 బంతుల్లో 24 ఫోర్లతో డబుల్‌ సెంచరీ చేయగా, నైట్ వాచ్‌‌‌మెన్‌‌గా బరిలోకి దిగిన రవిచంద్రన్ అశ్విన్ 253 బంతుల్లో 12 ఫోర్లతో సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.

వీరిద్దరూ పరుగుల సునామీని సృష్టించడంతో రెండో రోజైన శుక్రవారం నాటి టీ విరామం తర్వాత 566/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అమిత్ మిశ్రా (53), సాహా (40) రాణించగా, వైస్ కెప్టెన్ అజ్యంకే రహానె (22) శుభారంభాన్ని ఇచ్చారు. విండిస్ బౌలర్లలో బిషూ, క్రెయిగ్‌ బ్రాతవైట్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీని ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన డబుల్ సెంచరీని ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సాధించాడు. ఫార్మాట్ ఏదైనా తన దూకుడు మంత్రంతో చెలరేగే కోహ్లీ.. వెస్టిండీస్‌పై జరుగుతున్న తొలి టెస్ట్‌లో 283 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.

గవాస్కర్, వీవీఎన్ రిచర్డ్స్ లాంటి మహామహుల సమక్షంలో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే పిచ్‌ను ముద్దాడిన కోహ్లీ తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, సాహా, అమిత్‌మిశ్రాతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పిన అశ్విన్‌ తన టెస్ట్ కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు.

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

208 బంతుల్లో 150 మార్క్‌ను దాటిన విరాట్.. మ్యాచ్ 96వ ఓవర్లో అశ్విన్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు తనపేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు 169 స్కోరును అధిగమించాడు. భోజన విరామానికి ముందు రోస్టన్ చేజ్ వేసిన ఓవర్లో డబుల్ సెంచరీ కోహ్లీ పూర్తిచేశాడు.

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

ఈ క్రమంలో ఐదో వికెట్‌కు అశ్విన్‌తో కలిసి 168 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్లో గాబ్రియెల్ బౌలింగ్‌లో రెండో బంతికి 200 పరుగుల వద్ద కోహ్లీ ఐదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఐదో వికెట్‌కు విరాట్‌-అశ్విన్‌ 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

కోహ్లీని ఔట్‌ చేసిన ఆనందం వెస్డిండిస్ బౌలర్లకు ఎంతో సేపు నిలవలేదు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన అశ్విన్‌‌తో పాటు కొత్త బ్యాట్స్‌మన్‌ సాహా ప్రత్యర్థి బౌల ర్లకు పరీక్ష పెట్టాడు. కానీ, అర్ధ సెంచరీ చేసేలా కని పించిన సాహా వేగంగా ఆడే ప్రయత్నంలో క్రెయిగ్‌ బ్రాతవైట్‌ బౌలింగ్‌లో స్టంపౌట య్యాడు. ఆ తర్వాత అశ్విన్‌కు మిశ్రా జతకలిశాడు.

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

ఇక బిషూ వేసిన 151వ ఓవర్లో బౌండ్రీతో అశ్విన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది మూడో సెంచరీ కాగా, అన్నీ విండీస్‌పైనే చేయడం విశేషం. ఇక టీ విరామానికి వెళ్లొచ్చిన తర్వాత కార్లోస్‌ బ్రాతవైట్‌ బౌలింగ్‌ గాబ్రియెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అశ్విన్‌ పెవిలియన్‌‌కు చేరాడు.

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

ఇక వేగంగా ఆడిన మిశ్రా అర్ధ శతకం సాధించిన వెంటనే అవుటయ్యాడు. దీంతో కెప్టెన్‌ విరాట్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. కాగా కెప్టెన్‌గా టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ.. కపిల్‌దేవ్(100), రాహుల్ ద్రవిడ్(146) తర్వాత విండీస్‌పై సెంచరీ చేసిన మూడో కెప్టెన్ అయ్యాడు.

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

కోహ్లీ డబుల్ సెంచరీ: భారత తొలి ఇన్నింగ్స్‌ 566/8 డిక్లేర్‌

అలాగే విదేశీగడ్డపై డబుల్ సెంచరీ కొట్టిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. దీంతో 1990లో న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌లో అప్పటి కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్(192) పేరిట నమోదైన 26 ఏండ్ల కిందటి రికార్డు బద్ధలైంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కోహ్లీ ఖాతాలో 11 సెంచరీలు ఉంటే అందులో ఎనిమిది విదేశీ గడ్డపైనే నమోదైనవి కావడం విశేషం.

జట్టు స్కోరు 499 పరుగుల వద్ద బిషు బౌలింగ్‌లో బౌండరీ కొట్టి సెంచరీ నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అశ్విన్ చేసిన మూడు సెంచరీలు కూడా వెస్టిండీస్‌పైనే కావడం విశేషం. అంతకుముందు 302/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ ఆటగాళ్లు చెలరేగి ఆడారు.

టెస్ట్ మొదటి రోజే అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. రెండో రోజు మొదట్లోనే విండీస్ కొత్త బంతిని ఎంచుకుని బరిలోకి దిగడంతో రవిచంద్రన్ అశ్విన్ కొంత తడబడ్డాడు. షానన్ గాబ్రియెల్ బౌలింగ్‌లో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి అశ్విన్ తప్పించుకున్నాడు.

43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాబ్రియెల్ బౌలింగ్‌లో అశ్విన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వికెట్‌కీపర్ షేన్ డౌరిచ్ జారవిడిచాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అశ్విన్. .కోహ్లీకి చక్కని సహకారం అందించాడు. మరోవైపు తన ట్రేడ్‌మార్క్ కవర్‌డ్రైవ్ షాట్లతో కోహ్లీ అలరించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X