న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs విండిస్: ముఖాముఖి పోరులో సచిన్‌వే ఎక్కువ రికార్డులు

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వెస్టిండిస్ జట్టు దారుణ వైఫల్యాలను చవిచూస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనలో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా, భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఇప్పటివరకు 116 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ 53 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, విండీస్ 60 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మూడు వన్డేల్లో ఫలితం తేలలేదు. ఈ గణంకాలను బట్టి చూస్తే వన్డేల్లో భారత్‌పై వెస్టిండిస్ మెరుగైన రికార్డునే కలిగి ఉంది. కానీ ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రపంచంలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే గణాంకాలు ఇలా ఉన్నాయి:

India vs West Indies: Head-to-Head, statistics, records and much more

* అత్యధిక జట్టు స్కోరు: 418/5 (2011లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది)
* అత్యల్ప స్కోరు: 1993లో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగులకే ఆలౌటైంది.
* అత్యధిక భాగస్వామ్యం: వివియన్ రిచర్డ్స్-గార్డెన్ గ్రీనిడ్జి (1983 జంషెడ్పూర్ మ్యాచ్‌లో 221 పరుగులు చేశారు).
* అత్యధిక పరుగులు: 39 మ్యాచ్‌లాడిన సచిన్ టెండూల్కర్ 1,573 పరుగులు చేశాడు.
* అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్‌ చెరో నాలుగు సెంచరీలు చేశారు. గేల్ 36 మ్యాచ్‌లు ఆడితే, సచిన్ 39 మ్యాచ్‌లు ఆడాడు.
* అత్యధిక అర్ధ సెంచరీలు: 39 మ్యాచ్‌ల్లో సచిన్ టెండూల్కర్ 11 అర్ధ సెంచరీలు చేశాడు.
* ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు: 2011లో ఇండోర్ మ్యాచ్‌లో 149 బంతుల్లో సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు.
* డకౌట్ వీరులు: ఎక్కువసార్లు డకౌటైన బ్యాట్స్‌మెన్ రికార్డును క్రిస్ గేల్, సచిన్ తెండూల్కర్ సమానంగా ఉన్నారు. ఇద్దరూ చెరో ఐదుసార్లు సున్నాకే వెనుదిరిగారు.
* ఉత్తమ బౌలింగ్: 1993లో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 12 పరుగులకే 6 వికెట్లు తీశాడు.
* ఎక్కువ వికెట్లు: కొట్నీ వాల్ష్ (38 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు)
* ఒక సిరీస్‌లో ఎక్కువ వికెట్లు: 6 మ్యాచ్‌ల్లో పాట్రిక్ పాటర్సన్ 17 వికెట్లు తీశాడు.
* అత్యుత్తమ ఎకానమీ రేట్: 1989లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన వన్డేలో కపిల్ దేవ్ 7 ఓవర్లు బౌల్ చేశాడు. వీటిలో నాలుగు మెయిడిన్లుకాగా, కేవలం నాలుగు పరుగులిచ్చి, 0.57 ఎకానమీ రేట్‌ను నమోదు చేశాడు
* ఎక్కువ మ్యాచ్‌లు: శివనారాయణ్ చందర్ పాల్ (46 మ్యాచ్‌లు).
* కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు: వివియన్ రిచర్డ్స్ (20).
* అత్యధిక ఎక్‌స్ట్రాలు: 2011లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో కెమర్ రోచ్ 10 ఓవర్లు వేసిన అతను 88 పరుగులు సమర్పించుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X