న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

8వ ఆటగాడు: తొలి వన్డేలో అరుదైన ఘనత సాధించిన కుల్దీప్

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు టీమిండియా... వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కుల్దీప్‌ యాదవ్‌ అత్యంత అరుదైన ఘనతను అందుకున్నాడు.

<strong>వెస్టిండిస్‌తో తొలి వన్డే: ఆపేసిన వరుణుడు, కుల్దీప్ అరంగేట్రం</strong>వెస్టిండిస్‌తో తొలి వన్డే: ఆపేసిన వరుణుడు, కుల్దీప్ అరంగేట్రం

వర్షం కారణంగా రద్దు అయిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ సాధించిన రికార్డు ఏంటా? అని ఆలోచిస్తున్నారా. అరంగేట్రం చేసిన తొలి వన్డేలో ఫలితం రాకపోడవమే కుల్దీప్ సాధించిన అరుదైన ఘనత. ఈ ఘనతను ఇప్పటివరకు ఎనిమిది ఆటగాళ్లు సాధించారు.

1992లో తొలిసారి భారత ఆటగాడు అజయ్‌ జడేజా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత పారస్‌ హంబ్రే(1996), హృషికేశ్‌ కానిత్కర్‌(1997), ఆర్పీ సింగ్‌(2005), మనోజ్‌ తివారి(2008), సుదీప్‌ త్యాగి(2009), రహానె(2011), కుల్దీప్‌ యాదవ్‌(2017)లు ఆడిన తొలి వన్డే ఫలితం తేలలేదు.

India vs West Indies: Kuldeep Yadav makes ODI debut for India

ఇదిలా ఉంటే భారత జట్టు తరుపున అరంగేట్రం చేసిన 217వ ఆటగాడిగా కుల్దీప్ నిలిచాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్ధానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇండియా ఏ తరుపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడనప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కుల్దీప్ యాదవ్ మంచి రికార్డుని కలిగి ఉన్నాడు. ఇండియా-ఏ తరుపున పది మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 27 యావరేజితో 14 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన ధర్మశాల టెస్టులో కుల్దీప్ టెస్టు అరంగేట్రం చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్ తరుపున ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఇదిలా ఉంటే ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-వెస్టిండీస్‌ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X