న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ఆశలపై వర్షం నీళ్లు, ట్వంటీ 20 సిరీస్ విండీస్ వశం: ఒక్కరోజులో..

ఫ్లోరిడా: భారత్ - వెస్టిండీస్ మధ్య రెండో ట్వంటీ 20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-0తో విండీస్ వశమైంది. శనివారం నాడు జరిగిన తొలి ట్వంటీ 20లో విండీస్ ఒక్క పరుగు తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఆదివారం రెండో మ్యాచ్‌లో భారత్ పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది. కానీ వర్షం అడ్డుపడింది.

సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్ 8.10 గంలకు ప్రారంభమైంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బిన్నీ స్థానంలో అమిత్ మిశ్రాకు చోటు దక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 19.4 ఓవర్లలో 143 పరుగులు చేసింది. ఆ తర్వాత 144 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. కానీ 2 ఓవర్లు పూర్తయ్యేసరికి వర్షం వచ్చింది. ఎంతకూ తగ్గకపోవడంతో, ఆడే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ గెలుస్తామన్న అభిమానుల ఆశల పైన వర్షం నీళ్లు చల్లింది. సిరీస్ విండీస్ వశమైంది.

ఒక్కరోజులో ఎంత మార్పు

శనివారం నాటి వేదిక పైనే ఆదివారం మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచులో పరుగుల వరద పారించిన విండీస్ రెండో మ్యాచులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో భారత బౌలర్లకు రివర్స్ అయింది. మొదటి మ్యాచులో చాలా పరుగులు ఇచ్చారు. రెండో మ్యాచులో మాత్రం విండీస్‌ను కట్టడి చేశారు. పిచ్ మందగించడం వల్ల కూడా భారీషాట్లు కష్టమయ్యాయి.

ఓపెనరల్ చార్లెస్ (43) తప్ప ఎవరూ ఇరవై పరుగులు చేయలేదు. తొలి మ్యాచ్ సెంచరీ హీరో లెవిస్ 7 పరుగులకే అవుటయ్యాడు. స్పిన్నర్లు మిశ్రా, అశ్విన్, పేసర్ బూమ్రా మంచి బౌలింగ్ చేశారు. దీంతో వికెట్లు క్రమగా రాలాయి. బిన్నీ స్థానంలో వచ్చిన మిశ్రా అద్భుతంగా రాణించాడు.

Team India

భారత్ బ్యాటింగ్

- వర్షం వల్ల మ్యాచ్ ఆగింది. విండీస్‌ను భారత్ బౌలర్లు 143 పరుగులకే కట్టడి చేశారు. మరోవైపు భారత్ మంచి ఊపుమీద ఉంది. ఇలాంటి సమయంలో వర్షం పడింది.
- రెండు ఓవర్లలో భారత్ 15 పరుగులు చేసింది. రహానే 4 బంతుల్లో 4 పరుగులు, రోహిత్ 8 బంతుల్లో 10 పరుగులు చేశారు.
- రహానే, రోహిత్ శర్మలు బ్యాటింగ్‌కు వచ్చారు.

విండీస్ బ్యాటింగ్

విండీస్ వికెట్లు ఇలా..

విండీస్ తొలి వికెట్ 24 పరుగుల వద్ద, రెండో వికెట 50 పరుగుల వద్ద, 76 పరుగుల వద్ద మూడో, నాలుగో వికెట్, 92 పరుగుల వద్ద ఐదో వికెట్, 98 పరుగుల వద్ద ఆరో వికెట్, 111 పరుగుల వద్ద ఏడో వికెట్, 123 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్, 133 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్,

ఎవరెన్ని పరుగులు..

చార్లెస్ 25 బంతుల్లో 43 పరుగులు (నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు), లెవీస్ 6 బంతుల్లో 7 పరుగులు (ఒక ఫోర్), సామ్యూల్స్ 10 బంతుల్లో 5 పరుగులు, సిమన్స్ 19 బంతుల్లో 19 పరుగులు (మూడు ఫోర్లు), ఫ్లెచర్ 9 బంతుల్లో 3 పరుగులు, పొలార్డ్ 8 బంతుల్లో 13 పరుగులు (ఒక సిక్స్, ఒక ఫోర్), రసెల్ 15 బంతుల్లో 13 పరుగులు (ఒక సిక్స్), బ్రావో 6 బంతుల్లో 3 పరుగులు, బ్రాత్‌వైట్ 10 బంతుల్లో 18 పరుగులు (రెండు ఫోర్లు, ఒక సిక్స్), బాద్రీ 143 పరుగుల వద్ద అవుటయ్యాడు.

ఎవరెన్ని వికెట్లు...

భువనేశ్వర్ 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. షమి 2.4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిశ్రా 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జడెజా 2 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చాడు. అశ్విన్ 3 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బూమ్రా 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

- విండీస్ నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేదు. 19.4 ఓవర్లకే అలౌట్ అయి 143 పరుగులు చేసింది. భారత్ లక్ష్యం 144.

- షమి వేసిన 20వ ఓవర్ నాలుగో బంతికి బాద్రీ అవుటయ్యాడు.

- మిశ్రా బౌలింగులో (18వ ఓవర్) బ్రాత్ వైట్ అవుటయ్యాడు. బిన్నీ స్థానంలో వచ్చిన మిశ్రా ఆకట్టుకుంటున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 133 పరుగులు చేసింది.

- భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్ చివరి బంతికి రసెల్ అవుటయ్యాడు. కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
- పదహారో ఓవర్లో అమిత్ మిశ్రా వేసిన రెండో బంతికి బ్రావో అవుటయ్యాడు. మిశ్రా బంతికి మిడిల్ స్టంప్ ఎగిరిపడింది.
- 15 ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. క్రీజులో రసెల్, బ్రావో నిలిచారు.
- 13వ ఓవర్లో చివరి బంతికి బూమ్రా బౌలింగులో ప్లెచర్ అవుటయ్యాడు.
- పన్నెండో ఓవర్లో అశ్విన్ బౌలింగ్ సమయంలో డేంజరేస్ బ్యాట్సుమెన్ పొలార్డ్‌ను అవుటయ్యాడు. అతను ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరాడు.
- పదకొండో ఓవర్లో బూమ్రా సామ్యూల్స్‌ను అవుట్ చేశాడు. ధోనీ క్యాచ్ పట్టాడు.
- పదో ఓవర్లో అశ్విన్ బౌలింగులో సిమన్స్ అవుటయ్యాడు. సిమన్స్ 19 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ధోనీ స్టంపవుట్ చేశాడు.
- అమిత్ మిశ్రా ఆరో ఓవర్ వేసాడు. తొలి బంతికే ఊపు మీదున్న చార్లెస్‌ను అవుట్ చేశాడు. మిశ్రా బౌలింగులో అజింక్యా రహానే క్యాచ్ పట్టాడు. చార్లెస్ 25 బంతుల్లో 43 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు.

- సామ్యూల్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ తర్వాత వరుస బంతుల్లో చార్లెస్ సిక్స్, ఫోర్, ఫోర్, సింగిల్ తీశాడు.

- నాలుగో ఓవర్ షమీ బౌలింగ్ వేశాడు. తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి తొలి ట్వంటీ 20 సెంచరీ హీరో ఎవిన్ లెవిస్‌ను అవుట్ చేశాడు. అమిత్ మిశ్రా క్యాచ్ పట్టాడు. లెవిస్ 6 బంతుల్లో 7 పరుగులు చేశాడు.
- మూడు ఓవర్లు ముగిసే సమయానికి 24 పరుగులు చేశారు.
- ఇరువురు ఆచితూచి ఆడుతున్నారు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి 16 పరుగులు చేశారు.
- విండీస్ బ్యాట్స్‌మెన్ చార్లెస్, తొలి ట్వంటీ 20 సెంచరీ హీరో ఎవిన్ లెవిస్ బ్యాటింగ్‌కు దిగారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X