న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ టెస్టులో కోహ్లీ 151: డే 1, భారత్ 317/4

By Nageshwara Rao

విశాఖపట్నం: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు నష్టానికి 317 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 90 ఓవర్ల ఆటలో ఛటేశ్వర పుజారా(119), కెప్టెన్ విరాట్ కోహ్లీ(151)లతో చెలరేగిపోయారు.

154 బంతుల్లో సెంచరీ సాధించిన కోహ్లీ 150 పరుగులను 238 బంతుల్లోనే సాధించాడు. 15 ఫోర్లు, 62.87 స్ట్రయిక్ రేట్‌తో ఉన్న కోహ్లీ డబుల్ సెంచరీ చేసే దిశగా దూసుకుపోతున్నాడు. ఆట ముగుస్తున్న సమయంలో భారత్ వికెట్ కోల్పోయింది. 89వ ఓవర్ మూడో బంతికి అండర్సన్ బౌలింగ్‌లో రహానే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

61 బంతులు ఎదుర్కొన్న రహానే 23 పరుగులు చేశాడు. దీంతో 88.3 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లను నష్టపోయి 316 పరుగులు చేసింది. రహానే తర్వాత అశ్విన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అశ్విన్‌తో జతకలిసిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 151, అశ్విన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ మూడు వికెట్లు తీసుకోగా, స్టువర్ట్ బ్రాడ్ ఒక వికెట్ తీశాడు.

248 పరుగుల వద్ద పుజారా (119) ఔట్

విశాఖ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 248 పరుగుల వద్ద పుజారా (119) అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పుజారా ఔట్ అయిన తర్వాత క్రీజులోకి రహానే వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 69.3 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 113, రహానే 1 పరుగులతో ఉన్నారు.

టెస్టుల్లో 14వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ
విశాఖ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ కోహ్లీ సత్తా చాటాడు. 154 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు పూర్తి చేశాడు. దీంతో తన టెస్టు కెరీర్‌లో 14వ శతకాన్ని నమోదు చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం టీమిండియా 64.2 ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర పూజారా 106, కోహ్లీ 104 పరుగులతో ఉన్నారు.

జట్టు స్కోరు 6 పరుగుల వద్ద కేఎల్‌ రాహుల్‌(0), 22 పరుగుల వద్ద మురళీ విజయ్‌(20) అవుట్ కావడంతో కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ, పుజారాలు నిలదొక్కుకుని సెంచరీలు సాధించారు. వీరిద్దరూ కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సిక్స్‌తో సెంచరీ చేసిన పూజారా

రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర పుజారా సెంచరీ సాధించాడు. 184 బంతులు ఎదుర్కొన్న పూజారా 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో సెంచరీని సాధించాడు. టెస్టుల్లో పుజారాకి ఇది పదో సెంచరీ. పూజారా 99 పరుగుల వద్ద ఉన్న సమయంలో సిక్స్‌తో సెంచరీని అందుకున్నాడు.

కోహ్లీ-పుజారాల అద్భుత భాగస్వామ్యం
రెండో టెస్టులో టీమిండియా భారీస్కోరు దిశగా పయనిస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద కేఎల్‌ రాహుల్‌(0), 22 పరుగుల వద్ద మురళీ విజయ్‌(20) అవుట్ కావడంతో కష్టాల్లో పడింది.

అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ, పుజారాలు నిలదొక్కుకుని అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ విరామ సమయానికి వీరిద్దరూ మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. ప్రస్తుతం టీమిండియా 56.2 ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర పూజారా 97, కోహ్లీ 91 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పుజారా అర్ధసెంచరీ
విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ అర్ధ సెంచరీ చేసిన కాసేపటికే చటేశ్వర పూజారా అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 113 బంతుల్లో 5 ఫోర్లతో పూజారా అర్ధ సెంచరీ చేశాడు. ఇది పూజారా కెరీర్‌లో 11వ అర్ధ సెంచరీ. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత జట్టు పరుగుల వేట నిదానంగా సాగుతోంది.

ఆదిలోనే 6 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ ను, ఆపై 22 పరుగుల వద్ద మరో ఓపెనర్ మురళీ విజయ్ వికెట్ ను కోల్పోయిన ఇండియాను కెప్టెన్ కోహ్లీ, పుజారాలు ఆదుకున్నారు. చటేశ్వర పూజారాకు జతకలిసిన కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే కోహ్లీ, పూజారాలు అర్ధ సెంచరీలు సాధించారు.

ప్రస్తుతం 43 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 61, ఛటేశ్వర పుజారా 56 పరుగులతో ఉన్నారు.

కోహ్లీ అర్ధ సెంచరీ
కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 87 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ ఏడు ఫోర్ల సాయంతో అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది 13వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం కోహ్లీ 50, పుజారా 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లు గాను 2 వికెట్ల కోల్పోయిన టీమిండియా 112 పరుగులు చేసింది.

నిలకడగా పుజారా-కోహ్లీ
విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. 22 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ కోహ్లీ-పుజారాలు క్రీజులో నిలదొక్కుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరూ అజేయంగా 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో లంచ్ విరామ సమయానికి భారత్ 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కోహ్లీ 35, పుజారా 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్

రెండో టెస్టులో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మురళీ విజయ్ 20 పరుగులకే ఆండర్సన్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ 7 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది.

విశాఖలో భారత్-టీమిండియా టెస్టు మ్యాచ్ ఫోటోలు

కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌
ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర పుజారా 8, విరాట్ కోహ్లీ 0 పరుగులతో ఉన్నారు. గంభీర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌ అయ్యాడు. బ్రాడ్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతి రాహుల్ బ్యాట్ ఎడ్జ్ కి తగిలి థర్డ్ స్లిప్ లోకి వెళ్లింది. ఆ క్యాచ్ ను థర్డ్ స్లిప్ లోని స్టోక్స్ అందుకోవడంతో రాహుల్ పెవిలియన్ చేరాడు.

2nd Test: India win toss, elect to bat against England; Jayant Yadav makes debut

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నంలో గురువారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పూర్తిగా ఎండిపోయినట్టున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసి, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు.

భారత్ Vs ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ ఫోటోలు

విశాఖ టెస్టులో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. దీంతో తన కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం యాదవ్‌కు లభించినట్లయింది. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్ధానంలో జయంత్ యాదవ్ తుది జట్టులో చోటు కల్పించారు. ఇక గంభీర్ స్ధానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసిన టీమిండియా కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక ఇంగ్లాండ్ జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. క్రిస్ వోక్స్ స్ధానంలో జేమ్స్ ఆండర్సన్ జట్టులోకి వచ్చాడు.

రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. 1953లో ఏర్పడిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తొలిసారి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విశాఖ టెస్టు మ్యాచ్‌పై కూడా పడింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తక పోవడంతో తొలిరోజు క్రీడాభిమానును ఉచితంగానే అనుమతిస్తున్నారు.

జట్ల వివరాలు:

భారత్: మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్: అలెస్టర్ కుక్, హమీద్, రూట్, డకెట్, మోయిన్ అలీ, బెన్‌స్టోక్స్, బరిస్ట్టో, అన్సారీ, రషీద్ బ్రాడ్, ఆండర్సన్

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X