న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: దిగాలుగా విరాట్ కోహ్లీ, వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దు

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం చిన్నసామి స్టేడియంలో బెంగళూరు-హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని వరుణుడు అడ్డుకున్నాడు. బెంగళూరులో ఎడతెరిపి లేకుండా జల్లులతో కూడిన వర్షం పడటంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.

మ్యాచ్‌ను జరిపేందుకు శతవిధాలా యత్నించినా వర్షం ఎంతసేపటికి విరామం ఇవ్వలేదు. చివరకు ఐదు ఓవర్ల షూటౌట్ కూడా సాధ్యం కాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు రాత్రి 11.00 గంటల సమయంలో అంపైర్లు ప్రకటించారు.


ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మంగళవారం జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా మొదలు కాలేదు. ఇంకా వర్షపు తుంపర్లు పడుతూనే ఉన్నాయి. వర్షం ఆగిపోతే కవర్స్‌ను తొలిగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ ఎదురు చూస్తున్నారు.

రాత్రి 8 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్ 10.20 గంటలకు కూడా మొదలు కాలేదు. దీంతో ఓవర్లను కుదించే అవకాశం ఉంది. ఎంత ఆలస్యమైతే అన్ని ఓవర్లు తగ్గిస్తారు. అయితే 5 ఓవర్ల కన్నా తక్కువగా కుదించాల్సి వస్తే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలున్నాయి.

Virat Kohli

చిన్నసామి స్టేడియంలో దిగాలుగా కూర్చున్న కోహ్లీ

మంగళవారం బెంగళూరు సొంత మైదానం చిన్నసామిలో జరగాల్సిన మ్యాచ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. అయితే దురదృష్టవశాత్తు వర్షం కురుస్తుండటంతో 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ 10:30 గంటలైనా ప్రారంభంకాలేదు. దీంతో డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉన్న కోహ్లి దిగాలుగా కూర్చొని మైదానం వంక చూస్తూ ఉండిపోయాడు.

వరణుడు కరుణిస్తే తప్ప మ్యాచ్‌ సాగే అవకాశాలు కన్పించడం లేదు. ఇదిలా ఉంటే ఉప్పల్‌ వేదికగా జరిగిన పదోసీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరును సన్‌రైజర్స్‌ ఓడించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సత్తా చాటి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీ ఆలోచనలు నిజమయ్యేలా కనిపించడం లేదు.

హైదరాబాద్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి, టాస్ వాయిదా

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7.30 నిమిషాలకు టాస్ వేయాల్సి ఉంది.

అయితే వర్షం పడుతుండటంతో మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభం కానుంది. దీంతో టాస్‌ను కొద్ది సమయం పాటు ఆలస్యం చేసి మ్యాచ్‌ను మాత్రం యాధావిధిగా 8 గంటలకు మొదలుపెట్టే అవకాశాలున్నాయి. సిబ్బంది మైదానమంతా కవర్లు కప్పారు. మధ్యలో వరుణుడు కాస్త కరుణించడంతో కవర్లు తీసేసిన సిబ్బంది మళ్లీ చినుకులు రావడంతో తిరిగి కవర్లు కప్పేశారు.

వర్షం కురుస్తున్నా మైదానానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారని ఆసీస్‌ మాజీ ఆటగాడు మైకేల్‌ క్లార్క్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ సొంత మైదానం ఉప్పల్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

ఇక వేరే వేదికలపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఇక గత సీజన్‌లో రన్నరప్‌‌గా నిలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏడు మ్యాచుల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

దీంతో హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. గత సీజన్‌ మాదిరిగా 16 పాయింట్లు సాధించి బెంగళూరు ఫ్లేఆఫ్‌ చేరాలంటే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ తప్పక నెగ్గాలి. అయితే హైదరాబాద్ 6-4తో మెరుగైన రికార్డు ఉండటం బెంగళూరుని కలవర పెడుతోంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X