న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ఊతప్ప విధ్వంసం, కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: పూణె వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన కోల్‌కతాకు ఇది ఆరో విజయం.

కోల్‌కతా ఆటగాళ్లలో గంభీర్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, ఒక సిక్సు), రాబిన్ ఊతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సుల)తో అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఇక పూణె బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్, క్రిస్టియన్ తలో వికెట్ తీసుకున్నారు.


గంభీర్ అర్ధ సెంచరీ:
పూణెతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం దిశగా వెళుతోంది. 183 పరుగుల విజయ లక్ష్యంతో కోల్‌కతా ఆటగాళ్లు ఉతప్ప, గంభీర్ చెలరేగి ఆడుతున్నారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. గంభీర్ 36 బంతుల్లో 51 పరుగులు చేయగా ఉతప్ప 69 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి కోల్ కతా 147 పరుగులు చేసింది. కోల్ కతా విజయం సాధించాలంటే 36 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉంది.

రాబిన్ ఉతప్ప అర్ధ సెంచరీ

183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో జట్టు స్కోర్ 10 ఓవర్లు ముగిసే సరికే వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప అర్ధ సెంచరీ చేశాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.

ఐదు ఓవర్లకు కోల్‌కతా 38/1
ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి కోల్‌కతా వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ప్రస్తుతం గౌతమ్‌ గంభీర్‌ (13), రాబిన్ ఉతప్ప(5) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌గా వచ్చిన నరైన్‌ (11 బంతుల్లో 16: 3 ఫోర్లు) రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో కోల్‌కతా స్కోరు నెమ్మదించింది.

కోల్ కతా విజయం లక్ష్యం 183

పూణె వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయ లక్ష్యం 183 పరుగులుగా నిర్దేశించింది.

ఓపెనర్లు రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 38; 7 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరి జోడి 65 పరుగుల జత చేసిన తరువాత త్రిపాఠి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. పియూష్ చావ్లా వేసిన 8వ ఓవర్‌ చివరి బంతికి త్రిపాఠి పెవిలియన్‌కు చేరాడు.

MS Dhoni

అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌, రహానేకు జత కలిసిన దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 47 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీకి చేరువలోకి వచ్చిన రహానె(46) నరైన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 18వ ఓవర్లో ధోని(11 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడబోయి మూడో వికెట్‌గా అవుటయ్యాడు. కాగా, ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో స్మిత్ (37 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు,1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, క్రిస్టియన్ (16) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా తలో వికెట్ పడగొట్టారు.

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

కోల్‌కతా జట్టులో రెండు మార్పులు చేసినట్లు గంభీర్ తెలిపాడు. కౌల్టర్‌-నైల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో డారెన్‌ బ్రావో, పీయూష్ చావ్లాను తీసుకుంటున్నట్లు తెలిపాడు. మరోవైపు పూణె కీలక ఆటగాడు బెన్‌స్టోక్స్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బెన్‌స్టోక్స్‌ స్థానంలో డుప్లెసిస్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు స్టీవ్‌స్మిత్‌ తెలిపాడు.

IPL 10: Match 30: Kolkata win the toss and elect to field

టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. నాల్గింటిలో విజయం సాధించిన పుణె నాలుగో స్థానంలో కొనసాగుతోంది. స్టీవ్‌స్మిత్ నాయకత్వంలోని పుణె జట్టు తన చివరి మ్యాచ్‌లో ముంబయిని సొంతగడ్డపైనే ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. బెంగళూరుపై అద్భుతం విజయంతో కోల్‌కతా రెట్టించిన ఉత్సాహంతో ఉంది.

కెప్టెన్‌గా గౌతం గంభీర్‌కి ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. గత సీజన్‌లో తలపడ్డ రెండుసార్లూ నైట్‌రైడర్స్‌నే విజయం వరించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ లక్ష్యం 66, మరోసారి 161 పరుగుల లక్ష్యాన్ని గంభీర్‌ సేన ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం పూణె సాధించాలనే పట్టుదలతో ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్:
Gautam Gambhir(c), Sunil Narine, Robin Uthappa(w), Darren Bravo, Manish Pandey, Yusuf Pathan, Colin de Grandhomme, Chris Woakes, Piyush Chawla, Kuldeep Yadav, Umesh Yadav

రైజింగ్ పూణె సూపర్ జెయింట్:
Ajinkya Rahane, Rahul Tripathi, Steven Smith(c), Faf du Plessis, MS Dhoni(w), Manoj Tiwary, Daniel Christian, Washington Sundar, Shardul Thakur, Imran Tahir, Jaydev Unadkat

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X