న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: బెంగళూరులో ఆ ఏడుగురు, గుజరాత్ ఘన విజయం

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 13.5 ఓవర్లలో అలవోకగా చేధించింది.

Gujarat Lions win the toss and elect to field

తొలి రెండు వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ కెప్టెన్ సురేశ్ రైనా(34), అరోన్ ఫించ్ (72)తో నిలదొక్కుకుని ఆడడంతో గుజరాత్ అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆరోన్ ఫించ్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. తాజా ఓటమితో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివర్లో ఉంది.


గుజరాత్ లక్ష్యం 135

ఐపీఎల్ పదో సీజన్‌లో బెంగళూరు బ్యాటింగ్‌లో మరోసారి చేతులేత్తేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లును చేజార్చుకుండా స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలిపోయింది. బెంగళూరు ఓపెనర్లు క్రిస్ గేల్ (8), విరాట్ కోహ్లీ (10)తో పాటు డివిలియర్స్ (5), ట్రావిస్ హెడ్ (0) నిరాశపరిచారు. డివిలియర్స్, చాహల్ రనౌట్‌గా వెనుదిరిగారు. ఒకానొక దశలో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.

Gujarat Lions win the toss and elect to field

ఈ దశలో కేదార్ జాదవ్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు, ఒక సిక్సు) వరుసగా బౌండరీలు బాది స్కోరును పెంచే ప్రయత్నం చేసినప్పటికీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా అతడ్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బెంగళూరు ఆటగాళ్లలో కేదార్ జాదవ్(31), పవన్ నేగి (32) ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించారు.

ఓపెనర్లు క్రిస్ గేల్, కోహ్లిలు తమ శైలికి భిన్నంగా ఆచితూచి బ్యాటింగ్ ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో విరాట్ కోహ్లి ఓ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికి గేల్ కూడా అవుటయ్యాడు. దాంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

కోల్‌కతా‌తో మ్యాచ్‌లో 49 పరుగులకే కుప్పకూలిన బెంగళూరు, కీలకమైన గురువారం మ్యాచ్‌లో కూడా రాణించలేకపోయింది. బెంగళూరులో ఏడుగురు బ్యాట్స్‌మెన్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు తీసుకోగా, జడేజా రెండు, అంకిత్, ఫాల్కనర్, థంపీ తలో వికెట్ తీశారు.

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో జరుగుతుంది.

ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలవాలంటే ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితిలో రెండు జట్లు ఉండటంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగనుంది. ఇరు జట్లలో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బెంగళూరు జట్టులో స్టువర్ట్ బిన్నీ స్ధానంలో అంకిత్ చౌదరి చోటు దక్కించుకున్నాడు.

IPL 10: Match 31: Gujarat Lions win the toss and elect to field

ఇక గుజరాత్ లయన్స్ జట్టులో డ్వేన్ స్మిత్ స్థానంలో ఫాల్కనర్‌ వచ్చాడు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ ఇది. టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఇప్పటివరకు కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియగా, మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

దీంతో బెంగళూరు ఐదు పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్‌లో సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన గుజరాత్‌ రెండు విజయాలతో పట్టికలో చివరి స్థానంలో ఉంది.

బెంగళూరు జట్టు:
క్రిస్ ‌గేల్, విరాట్ కోహ్లి, మన్‌దీప్ సింగ్, ఏబీ డివిలియర్స్, ట్రావిస్ హెడ్, కేదార్ జాదవ్, పవన్ నేగి, శామ్యూల్ బద్రి, శ్రీనాథ్ అరవింద్, యుజ్వేందర్ చాహల్, అంకిత్ చౌదరి

బెంగళూరు జట్టు:
క్రిస్ ‌గేల్, విరాట్ కోహ్లి, మన్‌దీప్ సింగ్, ఏబీ డివిలియర్స్, ట్రావిస్ హెడ్, కేదార్ జాదవ్, పవన్ నేగి, శామ్యూల్ బద్రి, శ్రీనాథ్ అరవింద్, యుజ్వేందర్ చాహల్, అంకిత్ చౌదరి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X