న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంభీర్ ఆవేశం: టీమిండియాకు దూరమిందుకేనా(వీడియో)

బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్(కెకెఆర్) కెప్టెన్ గౌతం గంభీర్ తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేడు. అది అంతర్జాతీయ వేదిక అయినా లేదా దేశీయ స్థాయిలో అయినా. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా.. మరోసారి అతడు దుందుడుకు ప్రవర్తనను చాటుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా గంభీర తన ఆవేశపూరిత ప్రవర్తనతో కొంత అసహనానికి గురిచేశాడు. మైదానంలో ఉండగా దూకుడుగా ఉండే గంభీర్.. మైదానం బయట కూడా అలాగే ఉంటున్నాడు. తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోతున్నాడు.

సోమవారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టును కోల్‌కతా 5 వికెట్ల తేడాతో ఓడించింది. బెంగళూరు విధించిన 186 పరుగుల లక్ష్యఛేదనలో కోల్‌కతా ఓ సమయంలో తడబాటుకు గురైంది. అయితే, యూసుఫ్ పఠాన్(29 బంతుల్లో 60 పరుగులు), ఆండ్రూ రస్సెల్స్(24 బంతుల్లో 39 పరుగులు) చేయడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టును ఓడించడం సాధ్యమైంది.

కాగా, 37 పరుగులు చేసిన తర్వాత ఎల్బీడబ్ల్యూగా గంభీర్ వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇతర ఆటగాళ్లతో ప్యాడ్లు కూడా విడకుండా కూర్చుని మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఆ సమయంలోనే పఠాన్, రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఉత్కంఠతో మ్యాచ్ తిలకించిన గంభీర్.. 19 ఓవర్లో తమ జట్టు గెలిచే అవకాశాలు కనిపించడంతో ఆనందపడ్డాడు.

అయితే, తబ్రెయిజ్ షమ్సీ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ బాదడంతో గంభీర్.. తన కుర్చీలో నుంచి లేచీ దాన్ని తన్నేశాడు. ఆ తర్వాత తువాలును విసిరేశాడు. సూర్యకుమార్ ఫోర్ బాదడంతో 8బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సులభ పరిస్థితి ఏర్పడింది.

IPL 2016 VIDEO: Angry KKR captain Gautam Gambhir kicks chair, throws towel

కాగా, గంభీర్ ఆవేశ పూరితంగా ప్రవర్తించగా.. మరో సహచరుడు పియూష్ చావ్లా గంభీర్ తన్ని కుర్చీని సరిగా పెట్టాడు. ఆ తర్వాత అందులో కూర్చున్నాడు. అంతుకుముందు గంభీర్ ఏవో వ్యాఖ్యలు చేశాడు.

గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా కోహ్లీతో గంభీర్ ఘర్షణకు దిగాడు. కోహ్లీతో మ్యాచ్ అనగానే గంభీర్ కొంత భావోద్వేగానికి గురవుతాడు. అయితే, సోమవారం జరిగిన మ్యచ్ గంభీర్ ముఖంలో ఆనందాన్ని మిగల్చగా.. కోహ్లీకి అసంతృప్తిని మిగిల్చింది. కాగా, గంభీర్‌లో ప్రతిభ ఉన్నప్పటికీ.. అతని ఆవేశపూరిత ప్రవర్తనే అతడ్ని టీమిండియాకు దూరం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X