న్యూఢిల్లీ: ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేగాక, అద్భుతమైన క్యాచ్‌లు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. ఇటీవల అలాంటి క్యాచ్ ఒకటి కనువిందు చేసింది.
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్(ఆర్పీఎస్), ఢిల్లీ డేర్ డెవిల్స్(డీడీ) మధ్య జరిగిన మ్యాచ్ లో సామ్ బిల్లింగ్స్ పట్టిన క్యాచ్ కూడా ఒక అద్భుతమే. పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ కొట్టిన షాట్.. సిక్స్‌గా వెళుతుందనగా పరుగుత్తుకుంటూ వచ్చిన బిల్లింగ్స్ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు.
బౌండరీ లైన్ కు అత్యంత సమీపంలో తనను తాను నియంత్రించుకున్న తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి. కాగా, ఈ అద్భుత క్యాచ్‌ను చూసిన ధోనీ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాడు. 42 పరుగుల వద్ద క్యాచ్ పట్టడంతో అజింక్యా రహానేతో ధోనీ భాగస్వామ్యం విడిపోయింది.
Watch @sambillings's stunner to dismiss MS Dhoni #DDvRPS #VIVOIPLhttps://t.co/MlY0Wf44Ct
— IndianPremierLeague (@IPL) May 5, 2016
ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతిని బౌండరీకి బాదగా.. బౌండరీ లైన్ వద్ద బిల్లింగ్స్ క్యాచ్ పట్టడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియకు చెందని బిల్లింగ్స్ క్యాచ్ పట్టిన తీరును చూసి ధోనీ ఆశ్చర్యానికి గురయ్యాడు. సిక్స్ అనుకున్న షాట్.. క్యాచ్ గా మారడంతో కొంత అసంతృప్తితో మైదానం విడిచాడు ధోనీ.
కాగా, ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై పుణె గెలుపొందింది. అజింక్యా రహానే ఈ మ్యాచ్ లో ఐదో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రహానే, ఉస్మాన్ ఖవాజా(30) మంచి భాగస్వామ్యం అందించడంతో జట్టు విజయం సులభమైంది.