న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదేళ్ల ఐపీఎల్: గేల్ ఫస్ట్, అత్యుత్తమ విదేశీ ఆటగాళ్లు వీరే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌ను కూడా విజయవంతంగా ముందుకు సాగుతోంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌ను కూడా విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇండియన్ క్యాష్ రిచ్ టోర్నీగా పేరొందిన ఐపీఎల్ ఇంతలా సక్సెస్ అవడానికి ఎన్నో కారణాలున్నాయి.

భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషించారు. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్‌లో అనేక రికార్డులను సైతం నెలకొల్పారు. ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లకు డిమాండ్ కూడా ఎక్కువే. అంతలా రాణిస్తున్నారు కూడా.

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అనేక మంది విదేశీ ఆటగాళ్ల తమ ఆటతీరుతో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నారు. దేశవాళీ క్రికెట్ లీగ్‌ అయిన ఐపీఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణలో పొందడంలో విదేశీ ఆటగాళ్లు కూడా కీలకపాత్ర పోషించారు.

పదేళ్ల ఐపీఎల్‌ సందర్భంగా పాఠకుల కోసం ప్రత్యేక వార్తా కథనాలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించడంతో పాటు పలు రికార్డులను నెలకొల్పిన విదేశీ ఆటగాళ్ల జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం.

ఐపీఎల్‌లో అత్యుత్తమ విదేశీ ఆటగాళ్ల జాబితా (ఏప్రిల్ 27, 2017 నాటికి):

క్రిస్ గేల్

క్రిస్ గేల్

'యూనివర్స్ బాస్' గా పేరొందిన క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన క్రిస్ గేల్ ఈ ఫార్మెట్‌లో పది వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ కోల్‌కతా, బెంగళూరు జట్ల తరుపున ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 97 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 42.50 యావరేజితో 3570 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో గేల్ ఐదు సెంచరీలు, 21 అర్ధసెంచరీలు చేశాడు. క్రిస్ గేల్ ఐపీఎల్ అత్యధిక స్కోరు 175 నాటౌట్.

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో అనేక రికార్డులను నెలకొల్పాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 107 మ్యాచ్‌లాడిన వార్నర్ 39.30 యావరేజితో 3655 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ 34 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇందులో 144 సిక్సులు ఉన్నాయి.

ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన రెండో విదేశీ ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ రెండో స్దానంలో నిలిచాడు. మిస్టర్ 360గా పేరొందిన ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో భారత క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు. 124 మ్యాచ్ లాడిన ఏబీ డివిలియర్స్ 39.55 యావరేజితో 3402 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ అత్యధిక స్కోరు 133 నాటౌట్. ఐపీఎల్‌లో మూడు సెంచరీలతో పాటు 22 అర్దసెంచరీలు చేశాడు.

షేన్ వాట్సన్

షేన్ వాట్సన్

ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ ఐపీఎల్‌లో వివిధ జట్ల తరుపున ఆడాడు. ఐపీఎల్‌లో 99 మ్యాచ్‌లాడిన షేన్ వాట్సన్ 31.85 యావరేజితో 2612 పరుగులు చేశాడు. ప్రస్తుతం షేన్ వాట్సన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో షేన్ వాట్సన్ రెండు సెంచరీలతో పాటు 14 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. దీంతో పాటు 83 వికెట్లు కూడా తీసుకున్నాడు.

బ్రెండన్ మెక్‌కల్లమ్

బ్రెండన్ మెక్‌కల్లమ్

న్యూజిలాండ్‌కు చెందిన బ్రెండన్ మెక్‌కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ ఐపీఎల్లో మాత్రం రాణిస్తున్నాడు. టీ20 ఫార్మెట్‌లో డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో బ్రెండన్ మెక్‌కల్లమ్ ఒకడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 99 మ్యాచ్‌లాడిన బ్రెండన్ మెక్‌కల్లమ్ 2698 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతకముందు కోల్‌కతా, కేరళ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరుపున ఆడాడు. ప్రస్తుతం గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

లసిత్ మలింగ

లసిత్ మలింగ

శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ 2009 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీ20 ఫార్మెట్‌లో అత్యధిక వికెట్ల తీసిన ఆటగాళ్లలో మలింగ ఒకడు. 34 ఏళ్ల మలింగ 102 మ్యాచ్‌లాడి 147 వికెట్లు తీసుకున్నాడు. 2015 సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన మలింగ 24 వికెట్లు తీసుకున్నాడు.

జాక్వస్ కల్లిస్

జాక్వస్ కల్లిస్

ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్లలో దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వస్ కల్లిస్ ఒకడు. పదేళ్ల ఐపీఎల్ సీజన్‌లో భారత క్రికెట్ అభిమానులు చూసిన అత్యుత్తమ ఆల్ రౌండర్లలో జాక్వస్ కల్లిస్ ఒకడు. 2008 నుంచి 2014 వరకు ఐపీఎల్‌లో మెరిసిన కల్లిస్ మొత్తం 98 మ్యాచ్‌లాడి 2427 పరుగులు తీశాడు. ఐపీఎల్‌లో కల్లిస్ 17 అర్ధసెంచరీలతో పాటు 65 వికెట్లు తీశాడు. ప్రస్తుతం కోల్ కతా జట్టు కోచ్‌గా ఉన్నాడు.

షాన్ మార్ష్

షాన్ మార్ష్

ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్ 2008 ప్రారంభ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు తరుపున ఆడిన షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్‌ని గెలుచుకున్నాడు. అప్పటి నుంచి పదో సీజన్ వరకు షాన్ మార్ష్ పంజాబ్ జట్టు తరుపునే ఆడుతుండటం విశేషం. ఇప్పటివరకు 64 మ్యాచ్‌లాడిన షాన్ మార్ష్ 40.51 యావరేజితో 2269 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధసెంచరీలు ఉన్నాయి.

డ్వేన్ బ్రావో

డ్వేన్ బ్రావో

జమైకాకు చెందిన డ్వేన్ బ్రావో 2008 సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. అంతేకాదు ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విదేశీ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాడు. ప్రస్తుతం గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 106 మ్యాచ్‌లాడిన బ్రావో 1262 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ అయిన బ్రావో 122 వికెట్లు కూడా తీసుకున్నాడు.

సునీల్ నరేన్

సునీల్ నరేన్

వెస్టిండిస్‌కు చెందిన సునీల్ నరేన్‌కు 'మిస్టర్ స్పిన్నర్' అనే పేరుంది. 2012లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సునీల్ నరేన్ అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. 2012, 2014లో గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 74 మ్యాచ్ లాడిన నరేన్ 20.07 యావరేజితో 90 వికెట్లు తీశాడు. ఇందులో ఆరుసార్లు నాలుగు వికెట్లను తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X