న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్ గుడ్ షో: ఓటమిపై పూణె కోచ్ ఆవేదన

ఐపీఎల్ ఫైనల్ ఓటమిపై రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. తమ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకపోవడమే ఫైనల్‌‌‌లో ఓటమి ప్రధాన కారణమని విశ్లేషించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఓటమిపై రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. తమ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకపోవడమే ఫైనల్‌‌‌లో ఓటమి ప్రధాన కారణమని విశ్లేషించాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

'పైనల్‌లో బెన్ స్టోక్స్ లేని లోటు కనబడింది. తుది పోరుకు స్టోక్స్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. స్టోక్స్ లేకపోవడం వల్ల మేము ఎక్సట్రా బౌలర్‌తో బరిలోకి దిగాల్సి వచ్చింది. దాంతో బ్యాటింగ్ విభాగం బలహీనపడింది. ఆ క్రమంలోనే 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యాం' అని ఫ్లెమింగ్ చెప్పాడు.

పైనల్‌లో స్మిత్-రహానేల భాగస్వామ్యం తప్పితే, వేరే మంచి భాగస్వామ్యాలు నమోదు కాలేదని అన్నాడు. అంతేకాదు కీలక సమయాల్లో వరుసగా వికెట్లను కోల్పోతూ ఒత్తిడిలో పడ్డామని, దాంతో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిందని అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

IPL 2017 final was a grand finish to a good competition: RPS coach Stephen Fleming

130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె చివర్లో ఒత్తిడికి గురై వికెట్లను చేజార్చుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో పూణె విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. దీంతో చివరి ఓవర్‌ను ముంబై బౌలర్ మిచెల్ జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు మాత్రమే చేశారు. అయితే మూడు పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో వాషింగ్టన్ సుందర్ రనౌట్ అయ్యాడు. లేకుంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X