న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఊతప్ప ప్రదర్శనను నోటీస్ చేయండి: సెలక్టర్లకు గంభీర్ సూచన

ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న రాబిన్‌ ఊతప్పపై ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న రాబిన్‌ ఊతప్పపై ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

<strong>ఈడెన్‌లో అరుదైన రికార్డుని సృష్టించిన కోల్‌కతా నైట్ రైడర్స్ </strong>ఈడెన్‌లో అరుదైన రికార్డుని సృష్టించిన కోల్‌కతా నైట్ రైడర్స్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా ఆటగాళ్లలో కెప్టెన్ గౌతం గంభీర్ (52 బంతుల్లో 71 నాటౌట్; 11 ఫోర్లు), రాబిన్ ఉతప్ప(33 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించారు.

ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గంభీర్... రాబిన్ ఊతప్పను భారత క్రికెట్ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సూచించాడు. రైజింగ్‌ పూణె సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊతప్ప అద్భుతమైన కీపింగ్ చేశాడు.

IPL 2017: Gautam Gambhir urges Indian selectors to take notice of Robin Uthappa's performances

అతడి కారణంగా మ్యాచ్ ఫలితమే మారిపోయిందని గంభీర్ చెప్పాడు. 'ముగ్గురు పూణె ఆటగాళ్లను ఊతప్ప స్టంపింగ్ చేశాడు. ఇందులో ఒకటి మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసింది. ఆ మ్యాచ్‌ల్లో మేము పూణెపై 7వికెట్ల తేడాతో విజయం సాధించాం. బ్యాటింగ్‌ విభాగంలోనూ అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. హిట్టింగ్‌ టెక్నిక్స్‌ ద్వారా బౌండరీలు తరలిస్తున్నాడు' అని గంభీర్ అన్నాడు.

<strong>అసలేం జరిగింది?: గంభీర్‌తో గొడవకు వచ్చిన తివారీ</strong>అసలేం జరిగింది?: గంభీర్‌తో గొడవకు వచ్చిన తివారీ

'ఊతప్ప అద్భుత ప్రదర్శనను భారత జట్టు సెలక్టర్లు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. అతడు టీమిండియాకు ఎంపికై జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నేను 71 పరుగులతో నాటౌట్‌గా నిలవడంలోనూ ఊతప్ప పాత్ర ఉంది' అని గంభీర్‌ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X