న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైకి బ్రేక్ వేసిన పూణె: భజ్జీ రికార్డు, మ్యాచ్ హైలెట్స్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్ షాక్‌. తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టిన ముంబై ఇండియన్స్‌ జోరుకు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ బ్రేకులు వేసి

By Nageshwara Rao

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్ షాక్‌. తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టిన ముంబై ఇండియన్స్‌ జోరుకు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ బ్రేకులు వేసింది. [పూణె Vs ముంబై మ్యాచ్ స్కోరు కార్డు]

ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో స్మిత్‌ విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పూణె మూడు పరుగులతో తేడాతో ముంబైని విజయం సాధించింది. 161 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157 రన్స్‌ మాత్రమే చేసింది.

Match 28 Highlights: Mumbai Vs Pune; Stokes shines for RPS

కెప్టెన్‌ రోహిత శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) అద్భుత అర్ధ శతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బెన్‌ స్టోక్స్‌ (2/21), జయదేవ్‌ ఉనాద్కట్‌ (2/40) ముంబై విజయాన్ని అడ్డుకున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి (31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), అజింక్యా రహానె (38) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత బుమ్రా, కర్ణ్‌ శర్మ చెరో రెండు వికెట్లతో రాణించారు.

ఈ మ్యాచ్‌లో భారత్ వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నా డు. టీ20ల్లో అతను 200 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో స్టీవ్‌ స్మిత్ వికెట్‌ తీయడం ద్వారా అతను 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

Match 28 Highlights: Mumbai Vs Pune; Stokes shines for RPS

పూణె Vs ముంబై మ్యాచ్ హైలెట్స్:

* ఈ సీజన్‌లో పూణెతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఓటమి పాలైంది.
* ఈ సీజన్‌లో ముంబై ఇప్పటివరకు ఆడిన పూణె చేతిలో మాత్రమే ఓటమి పాలైంది.
* ఆరు వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబైకి పూణె బ్రేక్ వేసింది.
* డెత్ ఓవర్లలో పూణె బౌలర్ బెన్ స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
* బెన్ స్టోక్స్ వేసిన 19 ఓవర్లో 7 పరుగులిచ్చి పూణె విజయావకాశాలను మెరుగుపరిచాడు.
* 33 బంతుల్లో 58 పరుగులు చేసిన రోహిత్ శర్మ ముంబై టాప్ స్కోరర్ గా నిలిచాడు.
* ఈ సీజన్‌లో రోహిత్ శర్మకు ఇది తొలి అర్ధసెంచరీ. అతడు ఫామ్ లోకి రావడం ముంబైకి మంచిది.
* ఈ మ్యాచ్‌‌లో జయదేవ్‌ ఉనాద్కట్‌ 2 వికెట్లు తీశాడు.
* పూణె ఓపెనర్లు రహానే, రాహుల్ త్రిపాఠి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* 31 బంతుల్లో 45 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి పూణె తరుపున టాప్ స్కోరర్ గా నిలిచాడు.
* పూణెలో బ్యాటింగ్ లైనప్‌లో రహానే 38 పరుగుల వద్ద అవుటయ్యాడు.
* కర్ణ్ శర్మ ముంబై తరుపున ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడాడు.
* పేస్‌ను దీటుగా ఎదుర్కొన్న రహానే 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అయితే స్పిన్ బౌలింగ్‌లో 16 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు.
* ఈ మ్యాచ్‌లో భారత్ వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నా డు. టీ20ల్లో అతను 200 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు.
* ఈ మ్యాచ్‌‌లో స్టీవ్‌ స్మిత్ వికెట్‌ తీయడం ద్వారా అతను 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X