పంజాబ్ చెత్త ఆట: పుణే గెలుపు, క్వాలిఫయర్‌లో ముంబైతో ఢీ

Posted By:
Subscribe to Oneindia Telugu

పుణే: ఐపీఎల్ కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. గత ఏడాది పేలవ ఆట తీరు ప్రదర్శించిన పుణే.. ఈసారి అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచులో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచింది.

పుణె ఎంసీఏ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కేవలం 73 పరుగులు చేసింది. పుణే ముందు 74 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని సునాయాసంగా ఛేదించింది.

pune

ఇంకా ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్లతో పంజాబ్‌ను మట్టికరిపించింది. ఓపెనర్‌ రహానె (34 బంతుల్లో 1×4, 1×6తో 34 పరుగులు), స్టీవ్‌ స్మిత్‌ (18 బంతుల్లో 15 పరుగులు) చేశారు.

రాహుల్‌ త్రిపాఠి 28; 20 బంతుల్లో 2×4, 1×6తో 28 పరుగులు చేశాడు. పంజాబ్ పైన గెలిచిన పుణే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

English summary
Rising Pune Supergiant demolished Kings XI Punjab by 9 wickets, with 48 balls to spare, and thus qualified for the playoffs stage in the Indian Premier League (IPL) 2017 here on Sunday (May 14).
Please Wait while comments are loading...