న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని-స్మిత్‌లను షోలేలో 'జై-వీరు' పాత్రలతో పోల్చిన గోయాంకా

హైదరాబాద్ వేదికగా ముంబైతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ రన్నరప్‌గా నిలిచింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ముంబైతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ రన్నరప్‌గా నిలిచింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఆ తర్వాత 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది.

IPL 2017: MS Dhoni-Steve Smith pair compared to iconic 'Jai-Veeru' from Sholay

ఈ ఓటమితో తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుందామనుకున్న పూణె ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఐపీఎల్ పైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పూణె ప్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయాంకా సోదరుడు హర్ష్ గోయాంకా చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

పైనల్ మ్యాచ్ సందర్భంగా హర్ష్ గోయాంకా పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆటగాడు ధోనిలను బాలీవుడ్ ఐకానిక్ సినిమాలోని పాత్రలతో పోలుస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. బాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్న చిత్రం షోలేలోని జై, వీరు పాత్రలతో వీరిద్దరి పోల్చాడు.

వీరిద్దరి జోడీపై హర్ష్ గోయాంకా ప్రశంసలు కురిపించాడు. 'అద్భుతమైన కాంబినేషన్: Laurel- Hardy, Jai -Veeru, Smith- Dhon #IPLfinal' అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
1975లో బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

జై, వీరు పాత్రల్లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలు పోషించారు. కాగా ఐపీఎల్ ఫైనల్‌లో రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని... స్మిత్‌తో ఆచితూచి ఆడుతూ చక్కటి భాగస్వామ్యాలను నిర్మించేందుకు యత్నించాడు.

ఇదే పూణె కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. ఈ సమయంలో ఓవర్‌కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహాజ ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు.

ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు. అటు స్మిత్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు.. అయితే పుణె మాత్రం ఈ ఐదు ఓవర్లలో 27 పరుగులే చేయడం గమనార్హం.

పుణె విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు కావల్సిన తరుణంలో బుమ్రా వేసిన బంతికి ధోని కీపర్ పార్దీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని అవుటైన తర్వాత మ్యాచ్‌పై పట్టు సాధించిన ముంబై... పూణెకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Monday, February 19, 2018, 16:49 [IST]
Other articles published on Feb 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X