న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ఈజ్ బ్యాక్: చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించాడు

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు రైజింగ్‌ పూణె సూపర్‌జెయింట్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. టాస్‌ గెలిచిన పూణె ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: పూణె వేదికగా రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పూణె 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి వరకు విజయం దోబూచులాడింది. ఈ సీజన్‌లో తనపై చేస్తున్న విమర్శకులకు ధోని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు.

చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో పూణె ఆటగాడు ధోని ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ధోని 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు.

177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణెకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రహానే (2) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, త్రిపాఠితో కలిసి నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. సిరాజ్ వేసిన 5 ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను బిపుల్ శర్మ మిస్ చేశాడు.

దీనిని ఆసరాగా చేసుకుని త్రిపాఠి సిరాజ్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో చెలరేగాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు రాబట్టాడు. ఇలా 32 బంతుల్లో త్రిపాఠి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 11 ఓవర్లో తన అద్భుతమైన బంతితో స్మిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో వీరద్దరి 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఆచి తూచి ఆడాడు. ఈ సమయంలో 14 ఓవర్లలో త్రిపాఠి (59) పరుగుల వద్ద రషీద్ విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలోకి వచ్చింది. చివర్లో సిరాజ్ వేసిన 18 ఓవర్లో ధోని వరుస బంతుల్లో సిక్సర్, ఫోర్‌తో రాణించడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది.

భువనేశ్వర్ వేసిన 19 ఓవర్లలో వరుస బంతులను ధోని బౌండరికి తరలించి, సిక్స్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో పూణె విజయానికి 13 పరుగులు కావల్సి ఉండగా చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరి బంతిని ధోని ఫోర్ బాదడంతో పూణె 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పూణె విజయ లక్ష్యం 177

పూణె వేదికగా రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో పూణె విజయ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్‌లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. అయితే ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ 43(40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌), శిఖర్ ధావన్ 30(29 బంతుల్లో 5 ఫోర్లు), కేన్ విలియమ్సన్ 21(14 బంతుల్లో ఫోర్, సిక్స్), హెన్రిక్స్ 45(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా 14(8 బంతుల్లో సిక్స్, ఫోర్) పరుగులు చేశారు.

ఇక, పూణె బౌలర్లలో ఉనద్కట్, క్రిస్టియన్, ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ తీసుకున్నారు.

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు రైజింగ్‌ పూణె సూపర్‌జెయింట్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. టాస్‌ గెలిచిన పూణె ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.

అనారోగ్యం కారణంగా వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో బిపుల్‌శర్మ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. మరోపక్క పుణె కూడా జట్టులో ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్‌ ద్వారా పుణె తరఫున సుందర్‌ వాషింగ్టన్‌ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేస్తున్నాడు.

టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన రైజింగ్ పుణె జట్టు రెండింట్లో మాత్రమే గెలుపొంది పట్టికలో చివరి స్థానానికి పడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక, హైదరాబాద్ మాత్రం 8 పాయింట్లతో ముూడో స్ధానంలో కొనసాగుతోంది.

రెండు పరాజయాల తర్వాత గాడిలో పడిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్‌లో కూడా జోరుని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ పరాజయల తర్వాత పూణె ఆడుతున్న మ్యాచ్ కాడవంతో ఈ మ్యాచ్‌లో గెలుపు మంత్రాన్ని కొనసాగించాలని యోచనలో పూణె ఉంది.

IPL 2017: Pune bowl first against Hyderabad; Yuvraj Singh ruled out

డిఫెండింగ్‌ చాంపియన్‌‌గా ఐపీఎల్ పదో సీజన్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్‌లో ఆకట్టుకుంటోంది. తొలుత బెంగళూరు, గుజరాత్‌లపై విజయాలను నమోదు చేసిన హైదరాబాద్‌ అనంతరం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో పరాజయం పాలైంది.

ఆ తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చిన జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌పై విజయాలు సాధించింది. అయితే హైదరాబాద్ సాధించిన విజయాలన్నీ సొంతగడ్డపై సాధించిన కావడం విశేషం. ఈ సీజన్‌లో వేరే వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలవడం ఈ మ్యాచ్‌లో కాస్తంత కలవరపెడుతోంది.

జట్ల వివరాలు:
సన్ రైజర్స్ హైదరాబాద్:

D Warner, S Dhawan, K Williamson, M Henriques, D Hooda, B Sharma, N Ojha, B Kumar, M Siraj, S Kaul, R Khan

రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌:
A Rahane, R Tripathi, S Smith, B Stokes, M Tiwary, MS Dhoni, D Christian, W Sundar, I Tahir, S Thakur, J Unadkat

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X