న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి వల్లే ఇలా: ధోని, స్మిత్‌లపై ఉనాద్కత్ ప్రశంసలు

ధోని, స్టీవ్ స్మిత్‌లపై రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని, స్టీవ్ స్మిత్‌లపై రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్టీవ్ స్మిత్, ధోని లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం తన కెరీర్‌కు ఎంతగానో హెల్ప్ అయిందని ఉనాద్కత్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఆదివారం (మే 21)న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ పైనల్స్‌లో తలపడనుంది. ఐపీఎల్ పదో సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా జయదేవ్ ఉనాద్కత్ కొనసాగుతున్నాడు.

తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ ఆ తర్వాత జట్టులోకి వచ్చిన ఉనాద్కత్ 22 వికెట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.

IPL 2017: Rising Pune Supergiant lucky to have MS Dhoni and Steve Smith, says Jaydev Unadkat

ఐపీఎల్ పదో సీజన్‌లో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన జయదేవ్ ఉనాద్కత్ మీడియాతో మాట్లాడాడు. 'స్టీవ్ స్మిత్, ఎంఎస్ ధోని ఇద్దరూ అద్భుతం. ఇద్దరూ కూడా దేశానికి ఎన్నో విజయాలను అందించారు. అలాంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం నాకు చాలా ఉపయోగపడింది' అని చెప్పాడు.

'వారిద్దరి వద్ద ఆడటం నాకొక మంచి అనుభవం. ఈ సీజన్‌లో ఆఖరి ఓవర్లను ఎక్కువగా వేశా. డెత్ ఓవర్లను వేసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కెప్టెన్ నుంచి సహకారం అవసరం. అటువంటి సహకారం నాకు స్మిత్ నుంచి అందింది. నాపై నమ్మకం ఉంచడంతోనే నా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యా' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X