న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండ్‌బాల్ క్రికెట్: ఐపీఎల్‌లో సునీల్ నరేన్ సక్సెస్ ఫార్ములా ఇదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంతో మంది హిట్టర్లు ఉన్నా కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త ఓపెనర్ సునీల్ నరేన్ బ్యాటింగ్‌ను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంతో మంది హిట్టర్లు ఉన్నా కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త ఓపెనర్ సునీల్ నరేన్ బ్యాటింగ్‌ను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. క్రిస్‌గేల్‌లా ప్రతి బంతినీ సిక్స్ కొట్టాలనే కసితో నరేన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

అంతేకాదు అవుటవుతాననే భయం లేకుండా అద్భుతైమన షాట్లతో అభిమానులను అలరిస్తున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ క్రిస్‌లిన్ గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడంతో ఈ సీజన్‌లో నరేన్‌ని కొత్త ఓపెనర్‌గా పంపించి కోల్‌కతా ప్రయోగం చేసింది. తొలి మ్యాచ్‌లోనే పంజాబ్‌పై 18 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు.

ఆ తర్వాత హైదరాబాద్‌‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైనా.. గుజరాత్ లయన్స్‌పై 17 బంతుల్లో 42 పరుగులు, బెంగళూరుపై 17 బంతుల్లో 34 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఓ రికార్డుని సైతం నెలకొల్పాడు. మరోవైపు కోల్‌కతా కెప్టెన్ గంభీర్ సింగిల్స్ తీస్తూ నరేన్‌కు స్ట్రైకింగ్ ఇచ్చే ప్రయత్నించడం చేయడం కూడా విశేషం.

IPL 2017: 'Windball cricket' key to Narine's batting success

అయితే గతంలోనే బిగ్‌బాస్, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్స్‌లో ఓపెనర్‌గా నరైన్ సత్తాచాటాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. నరైన్ హిట్టింగ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విశ్లేషకుడు ఏఆర్ శ్రీకాంత్ మాట్లాడుతూ 'కరీబియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో నేను ఒకసారి నరైన్ ఇంటికి వెళ్లాను. అక్కడ ఓ గదిలో పెద్ద సంఖ్యలో ట్రోఫీలు ఉన్నాయి' అని చెప్పాడు.

'వాటిల్లో ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కి వచ్చిన ట్రోఫీలే ఎక్కువగా ఉండటంతో నేను ఆశ్చర్యపోయాను. అప్పుడే చెప్పాడు నరైన్ అక్కడ విండ్‌బాల్‌తో జరిగే లోకల్ టోర్నమెంట్‌లో అవన్నీ గెలుచుకున్నానని. కరీబియన్ గడ్డపై ఏటా మినీ టోర్నమెంట్ నిర్వహిస్తుంటారు. ఆ మ్యాచ్‌లకి పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఉండటంతో పాటు భారీ క్రేజ్ ఉంటుంది' అని అన్నాడు.

ఆ టోర్నీలో సాప్ట్ బంతిని బలంగా బాదడం అలవాటు చేసుకున్న సునీల్ నరేన్ తాజా ఐపీఎల్‌లో కూడా అదే రీతిలో షాట్లు ఆడేస్తూ పరుగులు రాబడుతున్నాడని ఏఆర్ శ్రీకాంత్ వివరించాడు. ప్రస్తుతం నరేన్ ఫామ్ చూస్తుంటే, సీజన్ మొత్తం అతన్నే కోల్‌కతా ఓపెనర్‌గా కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X