న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సేనకు షాక్: ఐపిఎల్ విజేత హైదరాబాద్

By Pratap

బెంగళూరు: తమ ముందు ఉంచిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ హైదరాబాద్ సన్ రైజర్స్‌పై 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో హైదరాబాద్ ఐపిఎల్ 9 విజేతగా నిలిచింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వస్తూనే ఎదురు దాడికి దిగింది. క్రిస్ గేల్ ఫోర్లు, సిక్స్‌లతో అదరగొడుతున్నప్పుడు హైదరాబాద్ పని అయిపోయినట్లే అనిపించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, డీవిలియర్స్ కూడా ఆశలు రేపుతూనే వచ్చారు. డీవిలియర్స్ అవుట్ కావడంతో మ్యాచు మలుపు తిరిగింది.

అయితే పూర్తిగా బెంగళూర్ చేయి జారిపోలేదు. అయితే, షేన్ వాట్సన్ అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. వరుసగా బెంగళూర్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. దీంతో ఓటమి పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఏడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

IPL Final: David Warner makes half century

ఐపిఎల్ ఫైనల్ మ్యాచులో చివరి ఓవరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 4 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన స్థితిలో ఏడో వికెట్ కోల్పోయింది. దాంతో చివరి మూడు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది.

చివరి ఓవరు భువనేశ్వర్ కుమార్ వేశాడు. చివరి రెండు బంతుల్లో బెంగళూర్ 14 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. తర్వాతి బంతికి ఒక్క పరుగు మాత్రమే బెంగుళూర్‌కు వచ్చింది. దాంతో ఒక్క బంతికి 13 పరుగులు రాబట్టడం అసాధ్యంగానే మారింది. చివరి బంతికి ఇక్బాల్ అబ్దుల్లా నాలుగు పరుగులు చేశాడు.

ఐపిఎల్ 9వ ఎడిషన్‌లో భాగంగా ఆదివారం పైనల్ మ్యాచులో హైదరాబాద్ సన్ రైజర్స్ తమ ముందు ఉంచిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రిస్ గేల్‌తో కలిసి ఓపెనర్‌గా దిగాడు.

దూకుడుగా ఆడే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రాన్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో బెంగళూరు 12.5 ఓవర్ల వద్ద 140 పరుగులు చేసి రెండో వికెట్ కోల్పోయింది.

IPL Final: David Warner makes half century

కోహ్లీ పెవిలియన్ చేరుకున్న తర్వాత డీవిలియర్స్ ఎంతో సేపు నిలబడలేదు. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి బిపుల్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో బెంగళూర్ 148 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. డీవిలియర్స్ అవుట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 160 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. రాహుల్ 11 పరుగులు చేసి కటింగ్ బౌలింగులో అవుటయ్యాడు. ఈ స్థితిలో 27 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. 164 పరుగుల వద్ద బెంగళూర్ ఐదో వికెట్ కోల్పోయింది. షేన్ వాట్సన్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముస్తాపిజుర్ రెహ్మాన్ బౌలింగులో అవుటయ్యాడు.

క్రిస్ గేల్ సిక్స్‌లు, ఫోర్లతో హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 22 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ట్వంటీ20 మ్యాచుల్లో క్రిస్ గేల్ 9వేల పరుగుల మైలు రాయిని అధిగమించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన గేల్ ఎట్టకేలకు అవుటయ్యాడు.

బెంగళూర్ 189 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో స్టువర్ట్ బిన్నీ రన్నవుట్ అయ్యాడు. దీంతో 11 పరుగుల్లో 29 పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూర్ పడింది.

IPL Final: David Warner makes half century

గేల్ 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో మోత మోగించి 76 పరుగులు చేసిన కట్టింగ్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో హైదరాబాద్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. గేల్ అవుట్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 10.3 ఓవర్ల వద్ద 114 పరుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది.

ఐపిఎల్ 9వ ఎడిషన్ ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది. చివరి ఓవరులో బెన్ కట్టింగ్ మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టాడు. వాట్సన్ వేసిన చివరి ఓవరులో హైదరాబాదు 24 పరుగులు రాబట్టింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.

చివరి మూడు ఓవర్లలో హైదరాబాద్ 52 పరుగులను పిండుకుంది. ఐపిఎల్ ఫైనల్లో ఇప్పటి వరకు ఈ మ్యాచులో హైదరాబాద్ చేసిన స్కోరే అత్యధికం కావడం విశేషం.

తొలుత డేవిడ్ వార్నర్, ఆ తర్వాత యువరాజ్ సింగ్, చివరలో బెన్ కటింగ్ చెలరేగి బ్యాటింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు, అరవింద్ రెండు వికెట్లు తీసుకోగా, చాహల్‌కు ఓ వికెట్ లభించింది.

ఐపిఎల్ 9 ఎడిషన్ ఫైనల్ మ్యాచులో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించే దిశగా సాగుతోంది. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ 25 బంతుల్లో 28 పరుగులు చేసిన చాహల్ బౌలింగులో అవుటయ్యాడు.

IPL Final: David Warner makes half century

హెన్రిక్స్, 4 పరుగుల స్కోరు వద్ద జోర్జాన్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో హైదరాబాద్ 9.5 ఓవర్ల వద్ద 97 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 13.3 ఓవర్ల వద్ద 125 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 69 పరుగులు చేసి అరవింద్ బౌలింగులో అవుటయ్యాడు.

హైదరాబాద్ 16వ ఓవరులో 147 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. హుడా అరవింద్ బౌలింగులో 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 148 పరుగుల స్కోరు వద్ద హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. చెలరేగి ఆడే క్రమంలో యువరాజ్ సింగ్ 23 బంతుల్లో 38 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగులో అవుటయ్యాడు.

158 పరుగుల వద్ద హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటి మరో మూడు ఓవర్లు మిగిలి ఉన్నాయి. లేని పరుగును తీసే క్రమంలో నాామాన్ ఓజా ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రన్నవుట్ అయ్యాడు. హైదరాబాద్ 174 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను జారవిడుచుకుంది. బిపుల్ శర్మ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోర్డాన్ బౌలింగులో అవుటయ్యాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గేల్‌తో సెకండ్ ఓవర్ వేయించాడు. అయితే గేల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గేల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ షాట్ కొట్టగా దాన్ని ఆపే ప్రయత్నంలో కింద పడ్డాడు గేల్. దీంతో పక్కనే ఉన్న డేవిడ్ వార్నర్ గేల్‌ను రెండు చేతులతో పైకి ఎత్తాడు. వెంటనే ఇరువురి ఆటగాళ్ల ముఖాల్లో ఉల్లాసం వెల్లివిరిసింది.

టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ గత జట్టుతోనే మైదానంలోకి దిగగా, హైదరాబాద్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ముస్తాఫిజుర్ రహ్మాన్ తుది జట్టులోకి వచ్చాడు.

జట్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), క్రిస్ గేల్, ఎబి డీవిలియర్స్, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్, సచిన్ బేబీ, స్టువర్ట్ బిన్నీ, ఇక్బాల్ అబ్దుల్లా, క్రిస్ జోర్డాన్, శ్రీనాథ్ అరవింద్, యుజ్‌వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, మోయిసెస్ హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, బెన్ కట్టింగ్, నామానా ఓజా, బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్, బరీందర్ శ్రాన్, ముస్తాఫిజుర్ రహ్మాన్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X