న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదేళ్ల ఐపీఎల్: టాప్‌లో సురేశ్ రైనా, టాప్ స్కోరర్లు వీరే

తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఐపీఎల్ పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పాఠకుల కోసం ఈ పదేళ్ల కాలంలో ఐపీఎల్‌లో చోటు చేసుకున్నరికార్డులు మీకోసం.. 

By Nageshwara Rao

హైదరాబాద్: పరుగులే పరుగులు. తమకు నచ్చిన జట్టు పరుగుల సునామీ సృష్టించాలనేది ఐపీఎల్‌లో సగటు అభిమాని కోరిక. ప్రతి మ్యాచ్‌లో అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించాలనే ఉద్దేశ్యంతో ఆటగాళ్లు సైతం సింగిల్స్ తీయకుండా ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఐపీఎల్ పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పాఠకుల కోసం ఈ పదేళ్ల కాలంలో ఐపీఎల్‌లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలతో పాటు రికార్డులను సైతం అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికి వస్తే సురేశ్ రైనా మొదటి స్ధానంలో నిలిచాడు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన సురేశ్ రైనా శుక్రవారం (ఏప్రిల్ 21) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

IPL turns 10: Here are the 10 leading run scorers in the history of IPL


ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో తన జట్టును గెలిపించిన సురేశ్ రైనా... ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కు నెట్టి మొదటి స్థానానికి దూసుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 154 మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా మొత్తం 4,373 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 4,264 పరుగులు చేసిన కోహ్లీ రెండో స్ధానంలో ఉన్నాడు. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(3986), కోల్‌కతా కెప్టెన్‌ గౌతం గంభీర్(3877) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (ఏప్రిల్ 25, 2017 నాటికి):

1. సురేశ్ రైనా (గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్) - 4,373 పరుగులు (154 మ్యాచ్‌లు)
2. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - 4,264 పరుగులు (143 మ్యాచ్‌లు)
3. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) - 3986 పరుగులు (150 మ్యాచ్‌లు)
4. గౌతం గంభీర్ (కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్) - 3877 పరుగులు (139 మ్యాచ్‌లు)
5. డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ - 3655 పరుగులు (107 మ్యాచ్‌లు)
6. రాబిన్ ఊతప్ప (కోల్ కతా నైట్ రైడర్స్, పూణె వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్) - 3575 పరుగులు (142 మ్యాచ్‌లు)
7. క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్) - 3570 పరుగులు (97 మ్యాచ్‌లు)
8. ఏబీ డివిలియర్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్) - 3402 పరుగులు (124 మ్యాచ్‌లు)
9. మహేంద్ర సింగ్ ధోని (రైజింగ్ పూణె సూపర్ జెయింట్, చెన్నై) - 3400 పరుగులు (150 మ్యాచ్‌లు)
10. శిఖర్ ధావన్ (సన్ రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్) - (120 మ్యాచ్‌లు)

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X