న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాహా డబుల్ సెంచరీతో ఇరానీ కప్ రెస్టాఫ్ ఇండియాదే

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా డబుల్ సెంచరీతో చెలరేగడంతో గుజరాత్‌పై రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
 

By Nageshwara Rao

హైదరాబాద్: ఇరానీ కప్‌లో భాగంగా బ్రాబోర్నే స్డేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా డబుల్ సెంచరీతో చెలరేగడంతో గుజరాత్‌పై రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్టాఫ్ ఇండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు హెర్వాద్కర్‌ (20), ముకుంద్‌ (19)లతో పాటు కరుణ్‌ నాయర్‌ (7), మనోజ్‌ తివారి (7) పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాహా, ఛటేశ్వర్ పుజారా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

 Irani Cup: Wriddhiman Saha's double ton helps Rest Of India clinch trophy

266/4 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన సాహా 272 బంతుల్లో 26 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 203 పరుగులు చేసి రెస్టాఫ్ ఇండియాకు చిరస్మణీయమైన విజయాన్ని అందించాడు. సాహాకి తోడుగా సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్, రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ ఛటేశ్వర్ పూజారా 116 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు.

వీరిద్దరూ అజేయంగా 316 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 379 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్టాఫ్ ఇండియా 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రెస్టాఫ్ ఇండియాను సాహా, పూజారాల జోడీ ఆదుకుంది.

 Irani Cup: Wriddhiman Saha's double ton helps Rest Of India clinch trophy

తొలి మూడు రోజులు గుజరాత్ ఆధిపత్యం కొనసాగించింది. అయితే వీరిద్దరూ రాణించడంతో నాలుగో రోజు నుంచి మ్యాచ్ రెస్టాఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్లింది. ఐదోరోజైన మంగళవారం ఆటను కొనసాగించిన వీరిద్దరూ మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో సాహా డబుల్ సెంచరీ చేయగా, పుజారా సెంచరీ చేశాడు.

స్కోర్ల వివరాలు:
గుజరాత్: 358 & 246
రెస్టాఫ్ ఇండియా: 226, 379/4 (సాహా 203 నాటౌట్, పుజారా 116 నాటౌట్, హార్ధిక్ పటేల్ 2/104)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X