న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా క్రికెట్ నాశనం: మాజీ కోచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్

పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ పై ఆ దేశానికి చెందిన క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ తిరోగమనంలో పయనించడానికి వకారే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ పై ఆ దేశానికి చెందిన క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ తిరోగమనంలో పయనించడానికి వకారే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. రెండుసార్లు పాక్ కోచ్‌గా పని చేసిన వకార్ వల్ల తమ ఆటకు జరిగిన మేలు ఏమిలేకపోగా, సర్వనాశనం అయిందని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు.

'వకార్ ఒక ఫెయిల్యూర్ కోచ్. అదే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ నాశనం కావడానికి కూడా కారణమయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్‌ను మూడేళ్లు వెనక్కినెట్టాడు. అతనికి వేరే ఆటగాళ్లతో విభేదాల గురించి నాకైతే తెలీదు. అసలు పాక్ క్రికెట్‌ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై వకార్‌కు ఎప్పుడూ ప్రణాళికలు లేవు' అని అక్మల్ పేర్కొన్నాడు.

Kamran Akmal lashes out at former Pakistan coach Waqar Younis

'2015 వరల్డ్ కప్‌లో యూనిస్ ఖాన్‌ను ఓపెనింగ్ చేయమనడమే వకార్ వద్ద ప్రణాళికలు లేవనడానికి ఒక ఉదాహరణ. ఆసియా కప్‌కు సంబంధించి ఒక మ్యాచ్‌లో ఉమర్ అక్మల్ సెంచరీ చేస్తే, ఆ తర్వాత మ్యాచ్లో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత కిందకి నెట్టాడు. ఎవరితో విభేదాల కారణంగా ఇలా చేసాడో నాకైతే తెలీదు' అని అన్నాడు.

ఇలా పాకిస్తాన్ క్రికెట్‌ను మాత్రం వకార్ నాశనం చేశాడు. ఆటగాడిగా వకార్ గొప్పవాడు కావొచ్చు.. కోచ్‌గా మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడని అక్మల్ విమర్శించాడు. పాకిస్తాన్ జాతీయ జట్టుకి కోచ్‌గా వకార్ యూనిస్ రెండు దఫాలు పనిచేశాడు. 2010 నుంచి 2011 వరకూ, 2014 నుంచి 2016 వరకూ వకార్ కోచ్‌గా పని చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X