న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనత: కోహ్లీ రికార్డుని సమం చేసిన విలియమ్సన్‌

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుని కేన్ విలియమ్సన్ సమం చేశాడు.

టెస్టు వన్డే టీ20 ఈ మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాప్ 5లో కొనసాగుతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20 సిరిస్‌ను న్యూజిలాండ్ 3-0తో వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ టీ20 సిరిస్‌లో కేన్ విలియమ్సన్ మొత్తం 145 (73 నాటౌట్, 12, 60) పరుగులు చేశాడు. దీంతో తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో విలియమ్సన్ రెండు స్ధానాలు ఎగబాకి నాలుగో స్ధానంలో నిలిచాడు. ఇప్పటికే విలియమ్సన్ టెస్టుల్లో నాలుగు, వన్డేల్లో ఐదో ర్యాంకుల్లో ఉన్నాడు.

Kane Williamson matches Virat Kohli's feat

దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌ కన్నా ముందుగా టీమిండియా కెప్టెన్‌ కోహ్లి ఒక్కడే అన్ని ఫార్మాట్లలో టాప్ 5లో ఉన్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని వైదలొగడంతో 28 ఏళ్ల కోహ్లీకి బీసీసీఐ నాయకత్వ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ టీ20ల్లో నెంబర్ వన్, వన్డేల్లో నెంబర్ 2, టెస్టుల్లో నెంబర్ 2 ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక 2008లో మలేషియాలో జరిగిన ఐసీసీ అండర్‌ 19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు కోహ్లీ, ఆస్ట్రేలియా జట్టుకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా ఉన్నారు.

ఐసీసీ ర్యాంకులు - టాప్ 5 (As on January 9, 2017) Test
1. Steve Smith (Australia) - 933 rating points
2. Virat Kohli (India) - 875
3. Joe Root (England) - 848
4. Kane Williamson (New Zealand) - 817
5. David Warner (Australia) - 812

వన్డేలు:
1. AB de Villiers (South Africa) - 861
2. Kohli - 848
3. Warner - 846
4. Quinton de Kock (South Africa) - 779
5. Williamson - 770

టీ20లు:
1. Kohli - 820
2. Aaron Finch (Australia) - 771
3. Glenn Maxwell (Australia) - 763
4. Williamson - 758
5. Faf du Plessis (South Africa) - 74

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X