ముంబై: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తమ నాయకుడిగా ఎదుగుతున్నాడని కొనియాడారు. అతనిలోని అనుకూలత నైపుణ్యం ఇందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు.
'మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. సంపూర్ణ క్రికెటర్ కావాలంటూ సానుకూలత నైపుణ్యం అవసరం. అదే క్రికెట్ నేర్పుతుంది' అని రైట్ మేనేజ్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ అన్నారు.
ఈ దృక్పథాన్ని ఎప్పటికీ వదులుకోవొద్దని కోహ్లీకి శ్రీకాంత్ సూచించారు. ముందు నుంచి పోరాడటమే విరాట్ శైలి అని కొనియాడారు. కపల్ దేవి అద్భుత నాయకత్వంలో తాను ఆడానని 1983 ప్రపంచ కప్ సాధించిన జట్టులోని సభ్యుడైన శ్రీకాంత్ అన్నారు.
'కపిల్ దేవ్.. సునీల్ గవాస్కర్ సారథ్యంలో తేడాలున్నాయి. అయితే ఇద్దరూ సానుకూలతో ఆడి విజయం సాధించేందుకు పోరాడేవారు' అని తెలిపారు. ఈ దృక్పథమే 1983లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన ప్రపంచ కప్‌ను గెలుచుకునేందుకు దోహదపడిందని తెలిపారు. 1983లో ప్రపంచకప్ గెలిచామంటే.. అది కపిల్ దేవ్ ముందుండి నడిపించడం వల్లేనని శ్రీకాంత్ తెలిపారు.