న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా కోహ్లీ: 'రన్ మెషీన్' కొత్త రికార్డులు ఇవే..

By Srinivas

బెంగళూరు: ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖంగుతిన్నది. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఐపీఎల్ 9లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతంగా రాణించాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఐపీఎల్లో కోహ్లీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.

ఈ ఐపీఎల్ మ్యాచులో కోహ్లీ నాలుగు సెంచరీలు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు...

ఓ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు: ఇప్పటి వరకు 9 ఐపీఎల్‌లు జరిగాయి. ఐపీఎల్ 9లో మాత్రం కోహ్లీ 973 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఏ ఐపీఎల్లోను వ్యక్తిగతంగా ఇన్ని పరుగులు చేయలేదు. కేవలం 27 పరుగులు తగ్గడంతో వెయ్యి పరుగుల మైలురాయిన అందుకోలేకపోయాడు.

ట్వంటీ 20, లిమిటెడ్ ఓవర్లలో అత్యధిక పరుగులు: పదహారు ఇన్నింగ్సులలో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు. ట్వంటీ 20 లేదా లిమిటెడ్ ఓవర్స్ మ్యాచులలో ఇలాంటి ఘనత ఇంత వరకు ఏ బ్యాట్సుమెన్ సాధించలేదు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు: అన్ని ఐపీఎల్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో కోహ్లీ ముందున్నాడు. ఇతను 4,110 పరుగులు చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇన్ని వ్యక్తిగత పరుగులు చేసిన వారు లేరు.

అత్యధిక సెంచరీలు: ఈ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు కొట్టాడు. ఇది రికార్డ్. ఓ ఐపీఎల్ సీజన్లో ఇన్ని సెంచరీలు ఎవరూ చేయలేదు.

List of records broken by 'run machine' Virat Kohli during IPL 2016

ఓ ఓవర్లో అత్యధిక పరుగులు: ఓ ఓవర్లో అంటే.. ఆరు బంతుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇతను గుజరాత్ లయన్స్ పైన శివిల్ కౌశిక్ బౌలింగులో ఏకంగా 30 పరుగులు తీశాడు.

అత్యధిక సిక్సులు: ఐపీఎల్ 9లో విరాట్ కోహ్లీ 38 సిక్సులు కొట్టాడు. ఇన్ని సిక్సులు ఎవరూ కొట్టలేదు.

అత్యధిక సగటు: కోహ్లీ యావరేజ్ 81.08గా ఉంది.

500 కంటే ఎక్కువ పరుగులు చేసిన కెప్టెన్: మూడు ఐపీఎల్‌లలో 500 పరుగులకు పైగా చేసిన ఓ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే. 2013లో 634 పరుగులు, 2015లో 505 పరుగులు, 2016లో 973 పరుగులు చేశాడు.

ట్వంటీ20లోని అన్ని ఫార్మాట్లలో ఇప్పటి వరకు 6445 పరుగులు చేశాడు. ఇన్ని పరుగులు చేసిన భారత క్రికెటర్ కోహ్లీయే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X