న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2017 వేలం: 14.5 కోట్లతో రికార్డు ధర పలికిన బెన్ స్టోక్స్

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం బెంగళూరులో మొదలైంది. మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇందులో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 76 మందిని ఈ వేలంలో కొనుగోలు చేయనున్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: బెంగళూరులో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ముగిసింది. ఐపీఎల్ టీ20 ఫార్మెట్ కావడంతో టీ20లో స్పెషలిస్ట్‌లుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంగా మంచి ధర పలికారు. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. అతడిని పూణె రైజింగ్ జెయింట్స్ రూ. 14.5కోట్లకు దక్కించుకుంది.

అంతకముందు యువరాజ్ సింగ్‌ అత్యధికంగా రూ. 16 కోట్లు పలికి ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ గుర్తింపు పొందాడు. అతడి తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన తైమాల్ మిల్స్‌ను రూ. 12 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది.

మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా సోమవారం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి 66 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 27 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం:

ఐపీఎల్ వేలం లైవ్ అప్‌డేట్స్:

INR 1 crore = INR 100 lakh = INR 10000000 = USD 149254 approx
INR 1 lakh = INR 100 thousand = INR 100000 = USD 1493 approx

రెండో సెషన్ ముగిసింది. ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితాను అడిగారు. తర్వాతి రౌండ్‌లో ఒక్కో జట్టు కనీసం ముగ్గురి నుంచి అత్యధికంగా 24 వరకు కొనుగోలు చేసే ఆవకాశం ఉంది.

* రాహుల్ త్రిపాఠిని రూ. 10 లక్షలకు పూణె సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
* ప్రాథమ్ సింగ్‌ను రూ. 10 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది.
* ఆర్ సంజయ్ యాదవ్, ఇషాంక్ జగ్గీలను కోల్ కతా రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది.
* భారత క్రికెటర్లు చిరాగ్ సూరి, శౌర్య, శుభమ్ అగర్వాల్‌లను గుజరాత్ లయన్స్ రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది.
* రింకూ సింగ్‌ను రూ. 10 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది.
* మునాఫ్ పటేల్ ను రూ.30 లక్షలకు గుజరాత్ లయన్స్ కొనుగోలు చేసింది.

* వెస్టిండిస్ ఆల్ రౌండర్ డారెన్ సమీని రూ. 30 లక్షలకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది.

* జేమ్స్ నీషమ్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
* డానియేల్ క్రిస్ట్రేన్‌ను రూ. కోటికి పూణె సూపర్ జెయింట్స్ కొనుగోలుచేసింది.
* శ్రీలంకకు చెందిన అసేలా గుణరత్నేను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

Siraj

* హైదరాబాద్ తరుపున రంజీల్లో రాణిస్తున్న మీడియం పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కనీస ధర రూ.20 లక్షలుగా నిర్ణయించారు. సిరాజ్‌ను రూ.2.6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
* ఆస్ట్రేలియాకు చెందిన బిల్లీ స్టాన్‌లాక్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ హైదరాబాద్
* ఆస్ట్రేలియాకు చెందిన బెన్ లాగ్లిన్‌ను రూ. 30 లక్షలకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.

* రెండో సెషన్‌లో కూడా భారత్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. మనోజ్ తివారి, తిషారా పెరారాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.

* భారత్‌కు చెందిన ఆకాస్దీప్ నాథ్, విష్ణు వినోద్, మయాంక్ దగర్‌లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
* నవ్ దీప్ షైనీని రూ. 10 లక్షలకు ఢిల్లీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.
* న్యూజిలాండ్‌కు చెందిన సోధీ, భారత్‌కు చెందిన ప్రజ్ఞాన్ ఓజా, ఉన్ముక్త్ చంద్‌లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.

* దక్షిణఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. అయినా సరే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
* రెండో సెషన్‌లో కూడా టీమిండియాయ బౌలర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
* ఆస్ట్రేలియా బౌలర్ కౌల్టర్ నీల్ కనీస ధర రూ.కోటిగా నిర్ణయించారు. రూ.3.5 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
* ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోని కనీసధర రూ.1.5 కోట్లు. ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.

* ఇండియన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌ను కనీస ధర రూ. 50 లక్షలకు రెండో సెషన్‌లోనూ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
* ఇంగ్లండ్ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ క్రిస్ జోర్డాన్‌ను కనీస ధర రూ. 50 లక్షలకే సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
* ఇండియన్ ప్లేయర్ సౌరభ్ తివారీని కనీస ధర రూ.30 లక్షలకే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
* ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ని కనీస ధర రూ. కోటికే గుజరాత్ లయన్స్ కొనుగోలు చేసింది.
* న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను కనీస ధర రూ.50 లక్షలకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది.
* తొలి సెషన్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లను వేలం వేస్తున్నారు.
* లంచ్ విరామం అనంతరం వేలం పాట మొదలైంది.

* ఉదయం సెషన్ పూర్తి: లంచ్ బ్రేక్, మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ ప్రారంభం, ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన క్రికెటర్ల జాబితా ఇదీ:

* అమ్ముడు పోని జాబితాలో ఫవాద్ అహ్మద్, మిచెల్ బీర్, అకిలా దానన్జయ, నైతాన్ లయాన్, రాహుల్ శర్మలు ఉన్నారు.
* ఇక స్పిన్నర్ల వంతు

Varun

* మన్ ప్రీత్ గోనిని రూ. 60 లక్షలకు గుజరాత్ లయన్స్ కొనుగోలు చేసింది.
* టీమిండియా పేసర్ వరుణ్ ఆరోన్ కనీస ధరను రూ. 30 లక్షలగా నిర్ణయించారు. వరుణ్ కోసం పంజాబ్, గుజరాత్ పోటాపోటీ పడుతున్నాయి. చివరకు వరుణ్ ఆరోన్‌ను రూ. 2.8 కోట్లకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది.

* టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్‌ అమ్ముడుపోని జాబితాలో ఉన్నాడు.
* ఇండియన్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్‌ని రూ. 30 లక్షలు కనీస ధరకే పుణె సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
* న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీని రూ. 50 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.
* శ్రీలంక ఆల్ రౌండర్ థిసర పెరెరా కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
* రిషి ధావన్ కనీస ధరను రూ.30 లక్షలుగా నిర్ణయించార. రూ.55 లక్షలకు ధావన్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

Karn Sharma

* టీమిండియా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
* ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. కోల్ కతా నైట్ రైడర్స్ ప్రాంఛైజీ రూ. 4.2 కోట్లకు క్రిస్ వోక్స్‌ని కొనుగోలు చేసింది.

Chris wokes

* ఇండియా ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ కనీస ధర రూ.30 లక్షలుగా నిర్ణయించారు. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
* సెట్ 12 - ఆల్ రౌండర్లు

* వెస్టిండీస్ బ్యాట్స్ మన్ మార్లన్ శామ్యూల్స్ కనీస ధర రూ. కోటిగా నిర్ణయించారు. మరోవైపు డారెన్ బ్రేవో కనీస ధర రూ.50 లక్షలపై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
* ఐపీఎల్ 10 వేలంలో ఫ్రాంచైజీలు భారత బ్యాట్స్ మెన్లను కొనుగోలు చేసేందుక ఆసక్తి చూపడం లేదు. అభినవ్ ముకుంద్, సుబ్రమణ్యం బద్రినాథ్‌లను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.
* టీమిండియా బ్యాట్స్ మన్ పుజారా కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
* భారత ఆటగాడు మనోజ్ తివారీ కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.

* స్పిన్నర్ ప్రవీణ్ థాంబె (రూ.10 లక్షలు)ను కనీస ధరకే కొనుగోలు చేసిన సన్ రైజర్స్
* ఆప్ఘనిస్థాన్‌కు చెందిన 18 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆర్మన్‌ను రూ. 4 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ కొనుగోలు చేసింది.
* ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. రషీద్ ఖాన్ కోసం ముంబై, హైదరాబాద్ పోటీ పడుతున్నాయి.

Khan

* స్పిన్నర్ మురుగన్ అశ్విన్ కనీస ధర రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దీంతో అతడిని బిడ్డింగ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ రూ. కోటికి కొనుగోలు చేసింది.
* సెట్ 10 - అన్ క్యాప్డ్ స్పిన్నర్లు
* కేరళ మీడియం పేస్ బౌలర్ బాసిల్ థంపిని రూ. 85 లక్షలకు గుజరాత్ లయన్స్ జట్టు కొనుగోలు చేసింది.
* ఉమర్ నాసిర్, నవద్పీప్ సైనీ, పవన్ సుయాల్‌లు అమ్ముడుపోలేదు.

* నాథు సింగ్ కనీస ధరను రూ.30 లక్షలగా నిర్ణయించారు. ఇతడిని గుజరాత్ లయన్స్ జట్టు రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.
* కొంచెం ఆశ్చర్యం కలిగే వార్త. తమిళనాడు పేస్ బౌలర్ టీ నటరాజన్ కనీస ధర రూ.10 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఇతడిని రూ.3 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది.

Natarajan

* రాజస్థాన్‌కు చెందిన మీడియం పేస్ బౌలర్ అనికేత్ చౌదరి కనీస ధర రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ఇతడిని రూ. రెండు కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

* అన్ క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ల వంతు వచ్చింది
* ఇటీవలే టీ20ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డు సృష్టించిన మోహిత్ అహ్లావాత్‌ను ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.

* రూ. 75 లక్షలకు ఏకలవ్య ద్వివేదిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది.

* ముంబైకి చెందిన ఆదిత్య తరేను రూ. 25 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది. శ్రీవాత్సవ్ గోస్వామి అమ్ముడు పోలేదు.
* భారత్‌కు చెందిన విష్ణు వినోద్ కనీస ధరను రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.
* ఇప్పుడు అన్ క్యాప్డ్ వికెట్ కీపర్స్ వేలం మొదలైంది
* రూ. 25 లక్షలకు రాహుల్ తేవాటియాను పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ప్రవీణ్ దుబే, శివం దుబే, మనన్ శర్మ, రుష్ కలారియా, ప్రియాంక్ పంచల్‌లు అమ్ముడు పోలేదు.

* ప్రస్తుతం కర్ణాటక ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ కోసం బిడ్డింగ్ జరుగుతుంది. గౌతమ్ కనీస ధర రూ.10 లక్షలగా నిర్ణయించారు. గౌతమ్‌ను రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

Gowtham

* ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్ మహ్మద్ నబీని కనీస ధర రూ.30 లక్షలకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడనున్న తొలి ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్‌గా నబీ చరిత్ర సృష్టించాడు.

* తన్మయ్ అగర్వాల్‌ను రూ.10 లక్షలు కనీస ధరకే కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
* ఉన్ముక్త్ చంద్ కనీస ధరను రూ.30 లక్షలుగా నిర్ణయించారు. ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.
* ఇప్పుడు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ వేలం మొదలైంది.

* ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న సొమ్ము వివరాలు - ఢిల్లీ: రూ. 10.6 కోట్లు, గుజరాత్ లయన్స్: రూ. 14.35 కోట్లు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రూ. 21.35 కోట్లు, కోల్ కతా: రూ. 14.75 కోట్లు, ముంబై: రూ. 9.25 కోట్లు, పూణె: రూ. 3 కోట్లు, బెంగుళూరు: రూ. 4.825 కోట్లు, హైదరాబాద్: రూ 2.9 కోట్లు. ఇప్పటివరకు ఢిల్లీ ఫ్రాంచైజీ ఒక్క విదేశీ ఆటగాడిని కూడా కొనలేదు.

* గతేడాది వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు పవన్ నేగీకి మాత్రం ఈసారి కోటి రూపాయిలకే పరిమితమయ్యాడు. పవన్ నేగీనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయిలు చెల్లించి దక్కించుకుంది.

2వ సెషన్‌లో ఏం జరిగింది:

ఇంగ్లాండ్ బౌలర్ తైమాల్ మిల్స్ జాక్ పాట్ కొట్టాడు. అతడిని రూ. 12 కోట్లకు బెంగుళూరు కొనుగోలు చేసింది. 2వ సెషన్‌లో అత్యధిక ధర పలికిన ఆటాగాడు ఇతడే. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లు బెన్ స్టోక్స్ రూ. 14.5 కోట్లు, మిల్స్ రూ. 12 కోట్లుకు అమ్ముడయ్యారు.

* ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 స్పిన్నర్‌గా ఉన్న ఇమ్రాన్ తాహిర్ (కనీస ధర రూ.50 లక్షలు)గా నిర్ణయించారు. అయితే ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
* టీమిండియా స్పిన్నర్ ఇషాన్ సోధి (కనీస ధర రూ.30 లక్షలు)గా నిర్ణయించారు. అయినా సరే ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేయలేదు.

* టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (కనీస ధర రూ.30 లక్షలు)గా నిర్ణయించారు. అయినా సరే ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేయలేదు.
* ఆస్ట్రేలియన్ వెటరన్ బ్రాడ్ హాగ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
* ఇప్పుడు వేలంలో స్పిన్నర్ల వంతు వచ్చింది.

sharma

* ఆశ్చర్యం: ఇషాంత్ శర్మని ఏ ఫ్రాంజైజీ కొనుగోలు చేయలేదు.
* ఇండియన్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ (కనీస ధర రూ.2 కోట్లు)గా నిర్ణయించారు. ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

* ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ కనీస ధర రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. ప్యాట్ కమిన్స్ కోసం ఢిల్లీ, హైదరాబాద్ బిడ్డింగ్‌లో పోటీ పడుతున్నాయి. చివరకు రూ.4.5 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది.

Cummis

* రూ. 12 కోట్లకు తైమాల్ మిల్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ తైమాల్ మిల్స్ జాక్ పాట్ కొట్టాడు.
* మిల్స్‌ను దక్కించుకునేందుకు ముంబై, పంజాబ్, కోల్ కతా జట్లు పోటీ పడుతున్నాయి.
Mills

* టీ20 స్పెషలిస్ట్ తైమాల్ మిల్స్‌ను కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు.
* ప్రస్తుతం ఫాస్ బౌలర్ల వేలం జరుగుతోంది. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ని రూ. 5 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
Trent Boult

* న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోసం ఫ్రాంచైజీల హోరాహోరీ

* రూ. 5 కోట్లకు కాగిసో రబాడాను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్
* దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబాడా కోసం ఫ్రాంచైజీల పోటీ

Rabada

* అమ్ముడుపోని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో, శ్రీలంక కీపర్ దినేష్ చండీమాల్
* ఇప్పుడు రెండో రౌండ్ వేలంలో వికెట్ కీపర్స్ వంతు వచ్చింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెన్ డక్స్ తొలి ఆటగాడు. అతడి కనీస ధరను రూ. 30లక్షలుగా నిర్ణయించారు. అయితే ఏ జట్టు కూడా ఇతడని కొనుగోలు చేయలేదు.

* బ్రేక్ అనంతరం ప్రారంభమైన వేలం

* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10లో ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ పుణే సూపర్ జెయింట్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అనంతరం జరిగిన వేలంలో బెన్ స్టోక్స్ ను పూణె జట్టు రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక విదేశీ ఆటగాడికి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం ఇదే తొలిసారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువీ నిలిచాడు. యువీ గత వేలంలో రూ. 16 అమ్ముడైన సంగతి తెలిసిందే.

* 15 నిమిషాలు బ్రేక్
* ఆస్ట్రేలియాకు చెందిన సీన్ అబాట్‌, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు.
* న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరె ఆండర్సన్ ను రూ. కోటికి కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్

* ఐపీఎల్ చరిత్రలో యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు) తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ (రూ.14.5 కోట్లు) చరిత్ర సృష్టించాడు.

* కనీస ధర రూ.2 కోట్లతో మొదలై రూ.14.5 కోట్లకు చేరిన స్టోక్స్ ధర

Ben stokes

* ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రూ.14.5 కోట్లకు కొన్న పుణె సూపర్ జెయింట్స్
* స్టోక్స్ కోసం పుణె, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై హోరాహోరీ
* స్టోక్స్ కోసం ఢిల్లీ, ముంబై మధ్య హోరాహోరీ
* ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు

* గతేడాది వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు పవన్ నేగీకి మాత్రం ఈసారి కోటి రూపాయిలకే పరిమితమయ్యాడు. పవన్ నేగీనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయిలు చెల్లించి దక్కించుకుంది.
* ఇండియన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (కనీస ధర రూ. 50 లక్షలు) ను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
* రూ.30 లక్షలు కనీస ధరగా ఉన్న ఇండియన్ ఆల్ రౌండర్ పవన్ నేగిని రూ.కోటికి కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
* శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజిలో మాథ్యూస్ ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్

* ఇంగ్లండ్ టీ20, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ పంజాబ్. కనీస ధరకే అమ్ముడైన మోర్గాన్.
* తొలి రౌండ్లో అమ్ముడుపోని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్
* ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ లను కూడా కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 10వ ఎడిషన్ ఏప్రిల్‌ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్‌ సందడి చేయనుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రన్నర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 5న జరగనుంది.

ఇదే స్టేడియంలో మే 21న ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది. అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్స్‌ వేదికలను ఇంకా నిర్ణయించలేదు.

మరోవైపు కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ తమ రెండో హోమ్‌ గ్రౌండ్‌గా ఇండోర్‌ను ఎంపిక చేసుకుంది. దీంతో 2011 తర్వాత ఇండోర్‌లో మరోసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. ధర్మశాల, రాయ్‌పూర్‌లకు మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేయలేదు. 2017 ఐపీఎల్‌ కోసం ఫిబ్రవరి 20వ తేదీన బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలం కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

ఐపీఎల్ 10వ సీజన్ ఆటగాళ్ల వేలంకు సంబంధించి పూర్తి సమాచారం:

* 351 - మొత్తం ఆటగాళ్లు
* రూ. 2 కోట్లు - ఈ ఏడాది వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ ధర
* 7- వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ ధర కలిగిన ఆటగాళ్లు (ఇషాంత్ శర్మ, బెన్ స్టోక్స్, క్రిస్ మోర్గాన్, క్రిస్ వోక్స్, మిచెల్ జాన్సన్, కుమ్మిన్స్, ఏంజెలో మ్యాథ్యూస్)
* 6 - వేలంలో అసోసియేషన్ దేశానికి చెందిన సభ్యుల సంఖ్య. ఆప్ఘనిస్థాన్ నుంచి 5, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 1.


* రూ. 384.67 కోట్లు - వేలంలో మొత్తం 8 ప్రాంచైజీల వెచ్చించనున్న సొమ్ము.
* రూ. 143.33 కోట్లు - 8 ప్రాంచైజీల వద్ద ఉన్న మొత్తం సొమ్ము.
* రూ. 23.35 కోట్లు - అత్యధికంగా ఓ ఫ్రాంచైజీ వద్ద ఉన్న సొమ్ము - కింగ్స్ ఎలెవన్ పంజాబ్
* 89 - వివిధ ప్రాంఛైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల సంఖ్య
* 76 - ఈ ఏడాది వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసే ఆటగాళ్ల సంఖ్య
* 44- 8 ప్రాంఛైజీల వద్ద ఉన్న విదేశీ ఆటగాళ్ల సంఖ్య
* 28 - ఈ ఏడాది వేలంలో జట్లు కొనుగోలు చేసే విదేశీ ఆటగాళ్ల సంఖ్య
* 27 - ఐపీఎల్ 2017 టోర్నీలో ఓ జట్టు అత్యధికంగా కలిగి ఉంటే ఆటగాళ్ల సంఖ్య
* 9 - ఒక జట్టు విదేశీ ఆటగాళ్లను కలిగి ఉంటే సంఖ్య
* 20 - వేలంలో ఎక్కువ మంది ఆటగాళ్లను ఉంచుకున్న జట్లలోని ఆటగాళ్ల సంఖ్య.

ఎవరి వద్ద ఎంతంత సొమ్ము మిగిలుందంటే:

* కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) - Rs 23.35 crore (Purse spent - Rs 42.65 crore)
* ఢిల్లీ డేర్ డెవిల్స్ (DD) - Rs 23.1 crore (Rs 42.9 crore)
* సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) - Rs 20.9 crore (Rs 45.1 crore)
* కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) - Rs 19.75 crore (Rs 46.25 crore)
* రైజింగ్ పూణె గెయింట్స్ (RPS) - Rs 17.5 crore (Rs 48.5 crore)
* గుజరాత్ లయన్స్ (GL) - Rs 14.35 crore (Rs 51.65 crore)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) - Rs 12.825 crore (Rs 53.175 crore)
* ముంబై ఇండియన్స్ (MI) - Rs 11.555 crore (Rs 54.445)



ప్రస్తుతం ఆయా జట్ల వద్ద ఉన్న ఆటగాళ్ల సంఖ్య (మొత్తం ఆటగాళ్ల సంఖ్య: 27, విదేశీ క్రికెటర్లు: 9)

* ఢిల్లీ డేర్ డెవిల్స్ - 17 (5 overseas)
* కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - 19 (5)
* కోల్ కతా నైట్ రైడర్స్ - 14 (4)
* ముంబై ఇండియన్స్ - 20 (6)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 20 (8)
* సన్ రైజర్స్ హైదరాబాద్ - 17 (5)
* రైజింగ్ పూణె గెయింట్స్ - 17 (5)
* గుజరాత్ లయన్స్ - 16 (6)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X