న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లోధా ఎఫెక్ట్: ఏసీఏ కార్యదర్శి పదవికి గోకరాజు రాజీనామా

ఏసీఏ కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తన పదవి నుంచి తప్పుకున్నారు. జస్టిస్‌ లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి రావడంతో బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఏసీఏ జనరల్‌ సెక్రటరీ పదవికి రాజీనామా .

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్‌ ప్రక్షాళనకు ఏర్పాటైన జస్టిస్ ఆర్‌ఎమ్ లోధా కమిటీ సూచించిన పలు సంస్కరణలు ఒక్కొ రాష్ట్ర సంఘం వరుసగా అమలు చేస్తున్నాయి. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌‌లో సోమవారం పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏసీఏ కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తన పదవి నుంచి తప్పుకున్నారు. జస్టిస్‌ లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి రావడంతో బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు, నర్సాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏసీఏ జనరల్‌ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు.

Lodha effect: Ganga Raju quits office as Andhra Cricket Association head

విజయవాడలో జరిగిన ఏసీఏ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా బీసీసీఐలో ఆయన పలు కీలక పదవులను చేపట్టారు. ఆయన స్థానంలో గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజు ఏసీఏ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఏసీఏ అధ్యక్షుడిగా ఉన్న డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఏసీఏ కోశాధికారిగా ఉన్న రహీమ్‌ కూడా తన పదవికి రాజీనామా చేయడంతో ఆయనకు బదులుగా రామచంద్రరావు ఆ బాధ్యతలు తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X