న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుమ్ము రేపాడు.. పదికి పది వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్

లండన్ : ఒక్క మ్యాచ్ లో ఐదు వికెట్లు దక్కితేనే బౌలర్లు ఎగిరి గంతేస్తారు. అలాంటిది ప్రత్యర్థి పది వికెట్లన్ని ఒక్కడి ఖాతాలోనే పడితే.. ఆ ఆనందం మామూలుగా ఉండదు. మహారాష్ట్రకు చెందిన 27ఏళ్ల శ్రీకాంత్ ముండే ఈ ఫీట్ సాధించి చూపించాడు.

1999లో పాక్ తో టెస్ట్ మ్యాచ్ సందర్బంగా.. భారత స్పిన్ దిగ్గజం కుంబ్లే మాత్రమే 10/10 ఫీట్ సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు శ్రీకాంత్ ముండే ఆ ఫీట్ సాధించడం భారత క్రికెట్ కు గర్వ కారణంగా మారింది. కోల్విన్ బే క్రికెట్ క్లబ్ వర్సెస్ బిర్కెన్ హెడ్ పార్క్ జట్టు మధ్య ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ ను సాధించాడు శ్రీకాంత్.

Maharashtra bowler makes history in England, takes all 10 wickets in an innings

కోల్విన్ బే క్రికెట్ క్లబ్ తరుపున బరిలోకి దిగిన శ్రీకాంత్ దెబ్బకు బిర్కెన్ హెడ్ పార్క్ జట్టు కేవలం 168 పరుగులకే ఆలౌట్ అయింది. లివర్ పూల్ కాంపిటీషన్ ప్రీమియర్ లీగ్ లో 10/10 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఇప్పుడు శ్రీకాంత్ రికార్డుల్లోకి ఎక్కాడు. మ్యాచ్ లో మొత్తం 24.1 ఓవర్లు బౌలింగ్ చేసిన ముండే.. 85 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లోను రాణిస్తూ 44 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X