రాంచీ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో ధోని మరోసారి మ్యాజిక్ చేశాడు. భారత జట్టులోకి ఎంత మంది వికెట్ కీపర్లు వచ్చినా ధోని ఎందుకు ప్రత్యేకమో రాంచీ వన్డేలో మరోసారి నిరూపితమైంది. వికెట్ల వెనుక తన కీపింగ్ స్కిల్స్‌ను మరోసారి ఫ్యాన్స్‌కు చూపించాడు.
అమేజింగ్ షాట్: ఫీల్డర్ని ఎలా బురిడీ కొట్టించాడో చూడండినాలుగో వన్డేలో భాగంగా న్యూజలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌ను ధోని రనౌట్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఫైన్ లెగ్ నుంచి ధావల్ కులకర్ణి విసిరిన త్రోను అందుకున్న ధోని స్టెంప్స్ వైపు చూడకుండానే విసిరాడు. అదే ధోని స్టంప్స్‌కు దగ్గరగా ఉంటే రాస్ టేలర్ ఔటై ఉండేవాడు కాదేమో.
స్వేర్ లెగ్‌లో కొట్టిన షాట్‌కు రెండో రన్ కోసం పరుగెత్తి రాస్ టేలర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ధావల్ కులకర్ణి విసిరిన బంతిని కీపర్ ధోని కాస్తంత ముందుగానే త్రోను అందుకొని మెరుపువేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఇది నిజంగా స్టేడియంలో ఉన్న అభిమానులను అబ్బుర పరిచింది.
రాంచీలో 4వ వన్డే: ఆదిలోనే భారత్‌కు దెబ్బ, రోహిత్ శర్మ ఔట్
ఆ స్టంపింగ్‌కు టేలర్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరడంతో ధోని మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి.
Watch the Mahi magic on loop #INDvNZ https://t.co/btMoJF0xC3
— BCCI (@BCCI) October 26, 2016
కాగా ప్రస్తుతం జరుగుతున్న నాలుగో వన్డే ధోని సొంత మైదానంలో జరుగుతుండటంతో టీమిండియాకు అభిమానుల మద్దతు కూడా ఎక్కువగా ఉంది. రాంచీలో టీమండియా క్రికెట్ ఆడటం కొత్త కాకపోయినా, ఎందుకో ఈసారి మాత్రం ధోని నామస్మరణతో స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.