న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా పర్యటనకు కెప్టెన్లుగా మనీష్ పాండే, కరుణ్ నాయర్

రాబోయే జులై-ఆగస్టులో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్ ఏ జట్టుని బీసీసీఐ గురువారం ప్రకటించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: రాబోయే జులై-ఆగస్టులో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్ ఏ జట్టుని బీసీసీఐ గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇండియా ఏ జట్టు వన్డే మ్యాచ్‌లతో పాటు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ల‌ను ఆడనుంది.

ఈ జట్లకు కెప్టెన్లుగా సీనియర్ ఆటగాళ్లు కరుణ్ నాయర్, మనీష్ పాండేలు ఎంపికయ్యారు. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఏ రెండు అనధికార టెస్టులకు కరుణ్ నాయర్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించగా, వన్డే జట్టు కెప్టెన్‌గా మనీష్ పాండే వ్యవహరించనున్నాడు.

Manish Pandey, Karun Nair to lead India A teams on South Africa tour

ఈ పర్యటనలో ఇండియా ఏ జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఏ జట్టు కూడా పాల్గొంటుంది. జులై 26వ తేదీన ఆస్ట్రేలియా ఏ జట్టుతో భారత్ జట్టు తలపడే మ్యాచ్‌తో ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇలా మూడు దేశాల ముక్కోణపు వన్డే సిరిస్ ఆగస్టు 8వరకు జరుగుతుంది.

ఆ తర్వాత ఇండియా ఏ జట్టు... దక్షిణాఫ్రికాతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులు ఆడుతుంది. ఆగస్టు 12 నుంచి 15 వరకూ బెనోనిలో తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరుగనుండగా, ఆగస్టు 19 నుంచి 22 వరకూ సెన్ స్వే పార్క్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరుగనుంది.

జట్ల వివరాలు:
వన్డే జట్టు:

మనీష్ పాండే(కెప్టెన్), మన్ దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృణాల్ పాండ్యా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), విజయ్ శంకర్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, జయంత్ యాదవ్, బాసిల్ తంపి, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్ద్ కౌల్

టెస్టు జట్టు:
కరుణ్ నాయర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), ప్రియంక్ పాంచల్, అభినవ్ ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ ఛటర్జీ, హనుమ విహారి, జయంత్ యాదవ్, నదీమ్, నవదీప్ సైనీ, సిరాజ్ శార్దూల్ ఠాకూర్, అంకిత్ చౌదరి, అనికిత్ చౌదరి, అంకిత్ రాజ్ పుత్

దక్షిణాఫ్రికా పర్యటనలో ఇండియా ఏ పర్యటన పూర్తి షెడ్యూల్:

S.No Date Match Venue
1st OD July 26 India 'A' vs Australia 'A' Groenkloof
2nd OD July 28 South Africa 'A' vs India 'A' Tukkies
3rd OD July 30 South Africa 'A' vs Australia 'A' Groenkloof
4th OD Aug 1 India 'A' vs Australia 'A' Tukkies
5th OD Aug 3 South Africa 'A' vs India 'A' Groenkloof
6th OD Aug 5 South Africa 'A' vs Australia 'A' Groenkloof
Final Aug 8 TBC vs TBC Tukkies

టెస్టు:

1st Four-day match Aug 12-15 South Africa 'A' vs India 'A' Benoni

2nd Four-day match Aug 19-22 South Africa 'A' vs India 'A' Senwes Park

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X