న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడోసారి!: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన మార్టిన్ గుప్టిల్

న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేలలో సచిన్ రెండుసార్లు 180 పరుగులు చేశాడు.

హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేలలో సచిన్ రెండుసార్లు 180 పరుగులు చేశాడు. గుప్టిల్ మూడోసారి ఆ స్కోర్ చేశాడు. తద్వారా మాస్టర్ కంటే ఈ విషయంలో ముందు నిలిచాడు.

గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ 138 బంతుల్లో 180 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 11 సిక్సులు ఉన్నాయి. తన బ్యాటింగుతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Martin Guptill breaks ODI records of Sachin Tendulkar, Rohith Sharma

సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికా రెండు వన్డేలు గెలిచింది. న్యూజిలాండ్ ఒక్కటే గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో గుప్టిల్ కీలక మ్యాచ్‌లో (నాలుగో వన్డే) గెలిపించి సిరీస్‌ను 2-2తో సమం చేశాడు.

కాగా, గుప్టిల్ వన్డేలలో మూడుసార్లు 180 పరుగులు చేశాడు. తద్వారా ఈ జాబితాలో ఇతనే మొదటి స్థానంలో నిలిచాడు. వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలు రెండేసిసార్లు 180 పరుగులు చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X