న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలర్‌గా రికార్డు: ఆరంగేట్రం చేసి 17 ఏళ్లకు టెస్టు కెప్టెన్సీ

By Nageshwara Rao

న్యూఢిల్లీ: టెస్టుల్లో అరంగేట్రం చేసిన 17 ఏళ్ల తర్వాత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్. శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించిన ఈ సీనియర్ క్రికెటర్ 38 ఏళ్ల వయసులో టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జింబాబ్వే పర్యటన సందర్భంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రంగనా హెరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్వవహరిస్తాడు. కాగా టెస్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పాటు వైస్ కెప్టెన్ దినేశ్ చందిమాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో హెరాత్ కు అవకాశం వచ్చింది.

రంజీల్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో దినేశ్ చందిమాల్ బొటనవేలుకి గాయం అవడంతో సర్జరీ జరిగింది. కాగా, 38 ఏళ్ల రంగనా హెరాత్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన 17 ఏళ్లకు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం గమనార్హం. అంతేకాదు ఈ అవకాశంతో రంగనా హెరాత్ ఓ ఘనతను కూడా దక్కించుకున్నాడు.

Mathews injured, Herath set for late captaincy debut

1983లో సోమచంద్ర డిసిల్వా తర్వాత ఆ దేశ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రెండో బౌలర్. 1999లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన హెరాత్ ఇప్పటివరకు 73 టెస్టులు, 71 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి వైదొలగాడు. ఆ తర్వాత తన దృష్టంతా టెస్టులపైనే కేంద్రీకరించాడు.

టెస్టుల్లో ఇప్పటివరకు 332 వికెట్లు తీసుకున్నాడు. జులై-ఆగస్టు కాలంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో 28 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు ఆసీస్‌ను 3-0తేడాతో వైట్ వాష్ చేయడంలో హెరాత్ కీలక పాత్ర పోషించాడు. కాగా తన కెరీర్‌లో 74వ టెస్టు ఆడుతున్న రంగనా హెరాత్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఇదిలా ఉంటే ఏంజెలో మాథ్యూస్ స్ధానంలో మరొకరికి చోటు కల్పించలేదు. జింబాబ్వేతో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత వెస్టిండిస్, శ్రీలంక, జింబాబ్వే మధ్య ముక్కోణపు సిరిస్ జరగనుంది. ఈ సిరిస్‌కల్లా ఏంజెలో మాథ్యూస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X