న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 వికెట్లు: ముస్తాక్ రికార్డుని బద్దలు కొట్టిన మిచెల్ స్టార్క్

By Nageshwara Rao

కొలంబో: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లను సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ పేరిట ఉంది.

19 ఏళ్ల క్రితం సక్లయిన్ ముస్తాక్ 100 వికెట్లను 53 మ్యాచ్‌ల్లో తీసుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడా రికార్డుని శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరిస్‌లో మిచెల్ స్టార్క్ అధిగమించాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ధనంజయ వికెట్‌ను తీసుకోవడంతో మిచెల్ స్టార్క్ (51 మ్యాచ్‌లు) ఈ రికార్డును సాధించాడు.

అయితే ఈ ఇద్దరూ బౌలర్లు కూడా శ్రీలంకపైనే 100 వికెట్ల మార్కును చేరుకోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ 100 వికెట్లను 55 మ్యాచ్‌ల్లో తీసుకున్నాడు. కాగా, వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లను తీసుకున్న రికార్డు సక్లయిన్ ముస్తాక్ పేరిట సుమారు 19 ఏళ్ల పాటు ఉంది.

Mitchell Starc breaks Saqlain Mushtaq's record for fastest 100 ODI wickets

ఇదిలా ఉండగా ఈనెల ఆరంభంలో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో వంద వికెట్లను సాధించిన ఐదో లెప్ట్‌ఆర్మ్ పేసర్‌గా స్టార్క్ గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉంటే, తొలి వన్డేలో శ్రీలంకపై ఆస్ట్రేలియా మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 221 పరుగులు చేసింది. శ్రీలంక నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు సాధించాడు. టెస్టు సిరిస్‌లో శ్రీలంక 3-0 తో ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X