న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ను మించి: '21వ శతాబ్ధపు క్రికెటర్ కోహ్లీనే'

టీమిండియాను నెంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టిన కోహ్లీ అభిమానులకు ప్రేరణగా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా జట్టును విజయాల బాట నడిపిస్తున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సైతం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆటతీరుని చూసి సహచర క్రికెటర్లతో పాటు మాజీలు సైతం ప్రశంసలతో కొనియాడుతున్నారు.

ముఖ్యంగా ఈ ఏడాది విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టిన కోహ్లీ అభిమానులకు ప్రేరణగా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

 'Most influential cricketer Virat Kohli is ubiquitous as Sachin Tendulkar'

ఈ టెస్టు సిరిస్‌లో కోహ్లీ ఆటతీరుని అత్యంత దగ్గరగా చూసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ అథెర్టన్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'ది ఆస్ట్రేలియన్' న్యూస్ పేపర్‌కు రాసిన కాలమ్‌లో కోహ్లీని "అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా" అభివర్ణించాడు.

[అతడే బెస్ట్ 'జడ్జి': ధోని రిటైర్మెంట్‌పై సచిన్ వివరణ ]

ఈ తరానికి ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీని ఒకడంటూ మైఖెల్ అథెర్టన్ కితాబిచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో విరాట్ కోహ్లీ 101.25 యావరేజితో 405 పరుగులను నమోదు చేశాడు.

జయలలిత 'గ్రేటెస్ట్ క్రష్': ఆ క్రికెటర్ ఎవరు? జయలలిత 'గ్రేటెస్ట్ క్రష్': ఆ క్రికెటర్ ఎవరు?

భారతీయ క్రికెట్‌లో తనదైన ముద్రను వేస్తున్న కోహ్లీ బ్యాటింగ్ తీరుకు తాను ముగ్ధుడైనట్లు ఆయన తెలిపాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదన్నాడు.

అభిమానుల ఆదరణలో సచిన్ టెండూల్కర్‌ని సైతం విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని తెలిపాడు. సోషల్ మీడియాలో కోహ్లీకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని చూస్తే ఇదే స్పష్టమవుతుందని అన్నాడు. 21వ శతాబ్ధపు అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ అంటూ ప్రశంసించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X